పాపికొండ జాతీయ ఉద్యానవనం

తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లా లోని ఒక వన్యప్రాణుల అభయారణ్యం

పాపికొండ జాతీయ ఉద్యానవనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నడుమ ఉన్న పాపికొండలలో ఉంది.

పాపికొండ జాతీయ ఉద్యానవనం
IUCN category II (national park)
Papikondalu view 16.jpg
గోదావరి నది నుండి పాపికొండ జాతీయ ఉద్యానవనం దృశ్యం
ప్రదేశంఆంధ్రప్రదేశ్, భారతదేశం
విస్తీర్ణం1,012.86 km2 (391.07 sq mi)

చరిత్రసవరించు

ఈ ఉద్యానవనాన్ని 1978 లో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రగా ఏర్పరిచారు. ఆ తరువాత 2008 లో ఈ ఉద్యానవనాన్ని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు.[1]

జంతు, వృక్ష సంపదసవరించు

ఈ ఉద్యానవనంలో తేమ ఆకురాల్చే, పొడి ఆకురాల్చే అడవులు ఉన్నాయి. చెట్ల జాతులలో స్టెరోకార్పస్ మార్సుపియం, టెర్మినాలియా ఎలిప్టికా, టెర్మినాలియా అర్జున, అడినా కార్డిఫోలియా, స్టెర్క్యులియా యురెన్స్, మంగిఫెరా ఇండికా, అనోజిసస్ లాటిఫోలియా లాంటి అనేక రకాల జాతులకు చెందిన మొక్కలు ఉన్నాయి. ఈ ఉద్యానవనంలో బెంగాల్ పులులు, చిరుతపులులు, మచ్చ పిలల్లులు, ఎలుగుబంట్లు, జింకలు లాంటి అనేక రకాల జంతువులు ఉన్నాయి.[2]

మరిన్ని విశేషాలుసవరించు

ఈ ఉద్యానవనం ఎత్తు 20మీ నుండి 850 మీ వరకు ఉంటుంది. ఈ ఉద్యానవనం గుండా గోదావరి నది ప్రవహిస్తుంది. పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు పూర్తి అయిన తరువాత ఈ ఉద్యానవనం కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి.[3]

మూలాలుసవరించు

  1. Gujja, B.; Ramakrishna, S.; Goud, V.; Sivaramakrishna (2006). Perspectives on Polavaram, a Major Irrigation Project on Godavari (in ఆంగ్లం). Academic Foundation. ISBN 9788171885787.
  2. Aditya, V.; Ganesh, T. (2017). "Mammals of Papikonda Hills, northern Eastern Ghats, India". Journal of Threatened Taxa. 9 (10): 10823–10830. doi:10.11609/jott.3021.9.10.10823-10830. Archived from the original on 2019-10-27. Retrieved 2019-10-27.
  3. Lua error in మాడ్యూల్:Citation/CS1/Identifiers at line 1055: attempt to compare nil with number.