పాపినేని శివశంకర్
'డాıı పాపినేని శివశంకర్' సుప్రసిద్ధ కవి, కథకులు మరియు విమర్శకులు. సాహితీ త్రిముఖుడుగా ప్రసిద్ధి గాంచారు. 1953 నవంబర్ 6న విజయ దీపావళి నాడు గుంటూరు జిల్లా నెక్కల్లు గ్రామంలో జన్మించిన శివశంకర్ ఆధునిక తెలుగు కవిత్వ ప్రపంచములో అగ్రశ్రేణి కవులలో ఒకరు. ఆయన రాసిన రజనీగంధ అనే కవితా సంపుటికి గాను కేంద్ర ప్రభుత్వం 2016 డిసెంబరు 21 న కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం ప్రకటించింది.[1][2] ఆలోచనల, అనుభూతుల మేళవింపు శివశంకర్ కవిత్వం. అందులోని తాత్త్వికమైన లోతులు చదువరులను ఆలోచింపజేస్తాయి. ఇప్పటివరకు సుమారుగా 350 కవితలు, 55 చిన్న కథలు ఇంకా 220 వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. 1990 నుంచి తెలుగు ఉత్తమ కథా సంకలనాలను 'కథా సాహితి' పేరుతో వాసిరెడ్డి నవీన్తో కలిసి ప్రతి సంవత్సరమూ ప్రచురిస్తున్నారు. శివశంకర్ కవితా సంపుటాలు 5 ప్రచురించబడ్డాయి. 2 కథా సంపుటాలు మట్టి గుండె (1992), సగం తెరిచిన తలుపు (2008) వెలువడ్డాయి. 'సాహిత్యం-మౌలిక భావనలు' అనే అంశంపై వీరు చేసిన ఉత్తమ పరిశోధనకు ఆచార్య తూమాటి దొణప్ప స్వర్ణపతకం లభించింది. చినుకు, కథాసాహితి, విస్మృత కథ, రైతు కవిత, కవిత సంపుటాలకు సంపాదకత్వ బాధ్యత నిర్వహించారు. తెలుగు విశ్వవిద్యాలయము నుంచి, 2000 సంవత్సరములో వచన కవిత్వ పురస్కారం పొందారు. తాడికొండ బి.ఎస్.ఎస్.బి.కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా, ప్రిన్శిపాల్ గా పనిచేసి, 2010 ఫిబ్రవరిలో పదవీవిరమణ చేశారు.
డా. పాపినేని శివశంకర్ | |
---|---|
![]() | |
జననం | 1953, నవంబర్ 6 గుంటూరు జిల్లా, తుళ్ళూరు మండలం, నెక్కల్లు గ్రామం |
నివాసం | గుంటూరు |
వృత్తి | తెలుగు అధ్యాపకులు |
ప్రసిద్ధులు | సాహితీ త్రిముఖుడు |
మతం | హిందు |
జీవిత భాగస్వామి | గృహలక్ష్మి |
పిల్లలు | సృజన, స్పందన |
తల్లిదండ్రులు |
|
రచనలుసవరించు
కవిత్వంసవరించు
- స్తబ్దత - చలనం (1984)
- ఒక సారాంశం కోసం (1990)
- ఆకుపచ్చని లోకంలో (1998)
- ఒక ఖడ్గం - ఒక పుష్పం (2004)
- రజనీగంధ (2013)
కథాసంపుటాలుసవరించు
- మట్టిగుండె (1992)
- సగం తెరిచిన తలుపు (2008)
సాహిత్య విమర్శసవరించు
- సాహిత్యం -మౌలిక భావనలు (1996)
- నిశాంత (2008)
- తల్లీ! నిన్నుదలంచి (2012)
- ద్రవాధునికత (2015)
- మహా స్వాప్నికుడు (2015)
పురస్కారాలుసవరించు
- ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు, హైదరాబాదు - 1985
- డా. గరికపాటి కవితా పురస్కారం, రాజమండ్రి- 1991
- జ్యేష్ట సాహితీ అవార్డు, విశాఖపట్నం - 1993
- ఉమ్మిడిశెట్టి సాహితీ అవార్డు, తాడిపత్రి - 1993
- డా. సి.నా.రె.కవితాపురస్కారం, కరీంనగర్ - 2000
- తెలుగు విశ్వవిద్యాలయం వచనకవిత్వ పురస్కారం - 2000
- నూతలపాటి సాహితీపురస్కారం - 2000
- నాగభైరవ కళాపీఠం అవార్డు, ఒంగోలు - 2002
- ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం పురస్కారం, తిరుపతి - 2003
- రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు, హైదరాబాదు - 2003
- విశాలాంధ్ర- సుంకర సాహితీ సత్కారం, ఒంగోలు - 2006
- విశ్వకళా పీఠం స్నేహనిధి పురస్కారం, హైదరాబాదు - 2006
- డా. కేతు విశ్వనాథరెడ్డి కథా పురస్కారం, నందలూరు - 2008
- డా. ఆవంత్స సోమసుందర్ కవితా పురస్కారం, పిఠాపురం - 2010
- ఆంధ్ర నాటక కళా పరిషత్ పురస్కారం, బెజవాడ - 2012
- నవ్యాంధ్రప్రదేశ్ ఉగాది విశిష్ట పురస్కారం, అనంతవరం - 2015
- సృజన కవితా పురస్కారం, అద్దంకి - 2015
- దేవరకొండ బాలగంగాధర తిలక్ అవార్డు, తణుకు - 2015
- రజనీగంధ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం -2016
- ఉత్తమ జాతీయకవి సత్కారం (ప్రసార భారతి), వారణాసి - 2017
- భారతీ సమితి సాహిత్య పురస్కారం, గుడివాడ - 2017
- మహాకవి జాషువ పురస్కారం, గుంటూరు - 2017
మూలాలుసవరించు
- ↑ "పాపినేనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు". eenadu.net. ఈనాడు. మూలం నుండి 21 December 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 21 December 2016.
- ↑ "చాలా సంతోషంగా ఉంది: పాపినేని". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. మూలం నుండి 21 December 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 21 December 2016.