నల్లని పాము ఒక రకమైన మతాబు. ఇది రెండురకాలుగా ఉంటుంది. ఒకటి ఫరోస్ పాము అయితే రెండవది సుగర్ పాము. ఫారోస్ పాము మండించి నపుడు నలుపు రంగులో పాములాంటి కర్బన పదార్థం ఏర్పడుతుంది. ఫారోస్ పాము ఏర్పడినపుడు అందులో ఉపయోగించిన మెర్క్యురీ (II) థయోసైనేట్ వల్ల పాము ఏర్పడుతుంది. ఇది విషతుల్యం కనుక ఎక్కువసేపు కాల్చరాదు.[1] సుగర్ స్నేక్ లో సోడియం బైకార్బొనేట్, పంచదార లు ఉపయోగిస్తారు. [2]

ప్రయోగం సందర్భంలో పొడవైన పాములాంటి ఆకారంతో ఏర్పడిన కార్బన్ .
ఫారో పాము

ఇవి చిన్న బిళ్ల మాదిరిగా ఉండి వెలిగించిన వెంటనే పొగతో కలిసి బూడిద ఒక పాము మాదిరిగా బయటికి వస్తుంది. ఇవి చాలా పొడుగ్గా వచ్చినా భూమి మీదనే ప్రాకుతున్నట్లు నలుపు రంగులో ఉంటాయి. ఇవి ఎటువంటి శబ్దం గాని, చమ్కీలు గాని వెదజల్లదు.

సోడియం బై కార్బొనేట్ దీనిలోని ముఖ్యమైన రసాయనం. దీనినుండి కార్బన్ డై ఆక్సైడ్ వాయువు, సుగర్ కలిగియున్న బూడిద బయటికి వస్తుంది. కొన్ని రకాల పాము బిళ్లల్లో నాఫ్తలీన్, లిన్ సీడ్ ఆయిల్ మిశ్రమం ఉంటుంది.[3]

చరిత్ర

మార్చు

ఫారోస్ పాము రసాయన చర్యను 1921లో వోలర్ కనుగొన్నాడు. అతను మెర్క్యురీ థయోసైనేట్ ను సంశ్లేషణ చేయు సమయంలో ఈ చర్యను గమనించాడు. ఈ చర్యలో చుట్లు చుట్టుకొన్న పామువంటి పదార్థం ఎక్కువగా ఏర్పడి తేలికగా గ్రాఫైట్ రంగును కలిగి ఉన్నట్లు గుర్తించాడు. కొంత కాలం ఈ చర్యలో ఉత్పన్నాన్ని "ఫారోషాలంజెన్" అని జర్మనీలో పిలిచారు. కానీ దానికి గల విషపూరిత లక్షణం మూలంగా అనేక మంది పిల్లలు మృత్యువాత పడటం వల్ల దీనిని నిషేధించారు. [4]

ఉపయోగాలు

మార్చు

సుగర్ స్నేక్ ను దీపావళి మతాబుగా ఉపయోగిస్తారు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Helmenstine, Anne Marie (June 3, 2020). "How to Make a Pharaoh's Snake Firework". Archived from the original on 17 October 2019. Retrieved 16 October 2019.
  2. Helmenstine, Anne Marie (June 3, 2020). "How to Make Black Snake or Glow Worms". Archived from the original on 14 October 2019. Retrieved 16 October 2019.
  3. "LISTSERV 15.0 - CHEMED-L Archives". Mailer.uwf.edu. Archived from the original on 2006-09-13. Retrieved 2009-04-05.
  4. Davis, T. L. (1940). "Pyrotechnic Snakes". Journal of Chemical Education. 17 (6): 268–270. doi:10.1021/ed017p268.