పారగమ్యత, రాళ్ళకు ఉండే లక్షణం. రాళ్ళ గుండా ద్రవాలు ప్రవహించగల సామర్ధ్యానికి కొలత ఇది. పారగమ్యత ఎక్కువగా ఉన్న రాళ్ల గుండా ద్రవాలు వేగంగా ప్రవహిస్తాయి. రాతి పారగమ్యత ఆ రాతిలో ఉన్న పీడనాన్ని బట్టి ఉంటుంది. పారగమ్యతను ఇంగ్లూషులో పెర్మీయబిలిటీ అంటారు.

దీని కొలత డార్సీ. దీని S.I. కొలమానం, ఆచరణాత్మక కొలమానం డార్సీ లేదా మిల్లీ డార్సీ. ఫ్రెంచ్ ఇంజనీర్ గౌరవార్ధం ఆ పేరు వచ్చింది, ఇతను మొదటగా త్రాగు నీటి సరఫరా కోసం ఇసుక ఫిల్టర్ల ద్వారా నీటిని ప్రవహింపచేయడాన్ని ఇసుక రాళ్ళ పారగమ్యత విలువల ద్వారా వివరించాడు. ఇసుక రాళ్ళ పారగమ్యత 1 నుండి 50000 మిల్లీడార్సీ వరకు ఉంటుంది. సాధారణంగా పారగమ్యత పది నుండి వంద మిల్లీడార్సీ మధ్య ఉంటుంది. ఒక రాయి 25% పోరొసిటీ, 1 మిల్లీడార్సీ ఉంటే గణనీయమైన నీటిప్రవాహం ఉండదు. ఇటువంటి గట్టి శిలలను కృత్తిమంగా స్టిమ్యులేట్ చేసి ద్రవాలు ప్రవహించేతట్లు పారగమ్యత సృష్టిస్తారు.

ఉపయోగాలుసవరించు

దీనిని ముఖ్యంగా హైడ్రోకార్బన్లలో, నూనెలలో, జలాశయాలలో, భూగర్భ జలాలలో ప్రవాహ లక్షణాలు చెప్పేందుకు ఈ కొలతను ఉపయోగిస్తారు.

వివరణసవరించు

పారగమ్యత డార్సీ నియమము యొక్క యుక్త, స్థిర భాగం. ఇది ప్రవాహ రేటుకి, ద్రవం యొక్క భౌతిక లక్షణాలకి సంబంధించింది.

 

అందువలన :   ఇక్కడ,

K - మాధ్యమం యొక్క పారగమ్యత
U – ద్రవం యొక్క డైనమిక్ స్నిగ్ధత
  - ఒత్తిడి వ్యత్యాసం
  – పోరస్ మాధ్యమం యొక్క మందం

సహజంగా దొరికే పదార్ధాలలో పారగమ్యత విలువల పరిణామం పెద్ద పరిధిలో ఉంటుంది.

హైడాలిక్ వాహకతతో సంబంధంసవరించు

పోరస్ మాధ్యమం నుండి ద్రవం యొక్క ప్రవాహం హైడ్రాలిక్ వాహకత అంటారు. పారగమ్యత ఇందులో ఒక భాగం. ఈ లక్షణం కేవలం పోరస్ మీడియానికి మాత్రమే, ద్రవానికి కాదు. భూగర్భ వ్యవస్థ యొక్క హైడ్రాలిక్ వాహకత విలువ తెలిస్తే పారగమ్యత విలువ కింద ఉన్న సూత్రం ద్వారా కనుక్కోవచ్చు.

 
ఇక్కడ
  •   - పారగమ్యత
  •   – హైడ్రాలిక్ వాహకత
  •   – ద్రవం యొక్క హైడ్రాలిక్ స్నిగ్ధత
  •   – ద్రవం యొక్క సాంద్రత
  •   – గురుత్వాకరణ శక్తి

సంకల్పంసవరించు

పారగమ్యత సాధారణంగా ప్రయోగశాలలో స్థిరమైన స్థితిలో డార్సీ నియమం ద్వారా లెక్కిస్తారు లేదా ఆమోద ఉద్భవించిన సూత్రాల యొక్క అంచనా ద్వారా లెక్కిస్తారు. పైపులో ప్రవాహం ఆధారంగా పారగమ్యత హైగెన్ – పైసుల్ సమీకరణం ఆధారంగా, పైపులోని జిగట ప్రవాహం ద్వారా పారగమ్యత ఈ విధంగా లెక్కించవచ్చు.

 
ఇక్కడ
  – ఇన్ట్రిన్సిక్ పారగమ్యత
  – ప్రవాహ మార్గ ఆకృతీకరణకు సంబంధించిన ఒక ప్రమాణం లేని స్థిరాంకం
  – సగటు ప్రభావిత సూక్ష్మ రంధ్రం వ్యాసం

ఇంట్రిన్సిక్ పారగమ్యత, సంపూర్ణ పారగమ్యతసవరించు

వీటి నిబంధనలలో పారగమ్యత విలువ ఇంటెన్సివ్ లక్షణం మాత్రమే.

వాయువులకు పారగమ్యతసవరించు

కొన్నిసార్లు వాయువుల పారగమ్యత, ద్రవాల పారగమ్యత కంటే భిన్నంగా ఉంటుంది. దశ మారే స్థానం వద్ద వాయువు స్లిప్పేజ్ కు ఒక తేడాను ఆపాదించవచ్చు.

టెన్సర్ పారగమ్యతసవరించు

దిశాత్మక మాధ్యమం యొక్క పారగమ్యత కోసం టెన్సర్ పారగమ్యత అవసరం. ఒత్తిడి మూడు దిశలలో అన్వయించవచ్చు. ప్రతి దశలో పారగమ్యత విలువ లెక్కించడం ద్వారా 3 * 3 టెన్సర్ కు దారి తీస్తుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=పారగమ్యత&oldid=2870346" నుండి వెలికితీశారు