పాల్వంచ సంస్థానం

ఒకప్పటి శంకర గిరియే నేటి పాల్వంచ. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మంలో ఉండేది, ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రాంతానికి చెందుతుంది. దీని విస్తీర్ణం 800 చ. మైళ్లు. 40,000 జనాభా కలిగి ఉంది. రాజ్య ఆదాయం 70,000. ఇది నిజాం రాజ్యంలోని సామంత రాజ్యం. భద్రాచలం జమీందారుల ఆధీనంలో ఉండేది. దీన్ని వెలమ సామాజిక కులంవారు పరిపాలించారు. అశ్వరావు కండిమల్ల జలగమ తండ్రి డామరు. ముత్యాల వంశం వారు పరిపాలించారు.[1] ఇది ఆరు తాలూకాలతో కూడిన సంస్థానం.[2]

చారిత్రక సంగతులు

మార్చు

ఒక సంస్కృతి ఉంది. సంస్థానాల్ని కేవలం భౌగోళిక పరిధులకు సంబంధించినవిగానే పరిగణించకూడదు. వాటికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఆంగ్లేయుల నుంచి విముక్తయిన తర్వాత భారతదేశంలో అనేక సంస్థానాల్ని విలీనం చేశారు. కానీ అంతకుముందు వాటి విల క్షణలతో అవి మనుగడలో సాగాయి. అవి చరిత్రలో, చరిత్ర నిర్మాణంలో భాగం.

నిజాం రాష్ట్రంలో అప్పట్లో 14 సంస్థానాలుండేవి అందులో కేవలం 5 మాత్రమే పాలనా అధికారాలను కలిగివున్న పెద్ద సంస్థానాలుగా నిలబడ్డాయి.[3] అందులో పాల్వంచ ఒకటి. ఈ సంస్థానంలో చాలా ప్రాంతం దట్టమైన అడవులతో నిండివుంది. గోదావరి నది వాయవ్యంగా మొదలై ఆగ్నేయ దిశగా పారుతూ ఈ సంస్థానాన్ని రెండుగా విభజిస్తుంది.[4] గోదావరి (తెలివాహ) కుడి వైపు ప్రాంతం నిజాం రాష్ట్రంలో బాగంగానూ, ఎడమవైపు ప్రాంతం మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగానూ వుండేది. పాల్వంచ సంస్థానం ఒకప్పుడు హైదరాబాదు రాష్ట్రంలోని భాగం. 1860లో బ్రిటీషు ప్రభుత్వానికి దత్తత చేయబడి మధ్యరాష్ట్రాలలో చేర్చబడింది. 1935లో దీని పేష్కసు పద్దెనిమిది వేలు వుండేది.1769 లో జాఫరుద్ధౌలా ఒక యుధ్దంలో నరసింహ అశ్వారావును సంహరించి తామ్రఫలకాల మీద రాసిన సదు పత్రాలను స్వాధీనం చేసుకున్నాడు. 1798లో నిజామలీఖాన్ వెంకట్రామ అశ్వారావుకు రాజబహద్ధూర్ సవై అనే బిరుదు లిచ్చి సనదు ఇచ్చాడట. అయితే ఈ బిరుదుతో పాటు ఒక గౌరవ ప్రథమైన బాధ్యతను కూడా వీరికి అప్పగించారట. 2000 అశ్విక దళాలను, 3000 పదాతి దళాన్ని నిర్వహించాలనేది ఆ షరతు. అన్నివేళ అశ్విక దళాలు ఇబ్బంది పడకుండా నీరు త్రాగేందుకు ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని ఇప్పటికీ ఇక్కడ గుర్రాల చెరువు అనే పేరుతోనే పిలుస్తున్నారు.

శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం, భద్రాచలం

మార్చు

ఈ సంస్థానం పరిధిలోకే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం, భద్రాచలం వస్తుంది. 17వ శతాబ్దం నాటి సంకీర్తనాచార్యులు శ్రీరామదాసుగా పేరు పొందిన కంచర్ల గోపన్న జీవితంతో ఈ ఆలయ నిర్మాణం ముడిపడి ఉంది. 17వ శతాబ్దం రెండవ భాగంలో కంచర్ల గోపన్న భద్రాచలం తహశీల్దార్ గా ఉన్నపుడు ఈ ఆలయ నిర్మాణం చేపట్టాడు. ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన ఈ దేవాలయం ప్రపంచ నలుమూలల నుండి వేలాది భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. పవిత్రమైన గోదావరి నది ఈ కొండను చుట్టుకొని దక్షిణ దిశ వైపుగా ప్రవహిస్తూ ప్రకృతి అందాలను ఒలకపోస్తూ ఒక పుణ్యక్షేత్రంగా భాసిల్లేలా భద్రాచలంకి మరింత తోడ్పాటునందించింది. మేరుపర్వతం, మేనకలకు లభించిన వరం వల్ల పుట్టిన బాలుడే భద్ర పర్వతం. ఈ భద్రుడి (చిన్నకొండ) వలనే ఈ చిన్నకొండను భద్రగిరి అని ఇక్కడ ఏర్పడిన ఊరికి భద్రాచలం అని పేరు వచ్చింది.

వారసత్వ సమస్యలు

మార్చు
 
మేకా వంశీయులకు చెందిన వేంకట రంగయ్యప్పారావు

సంస్థానాధిపతి తల్లి లక్ష్మీ నరసయ్యమ్మారావు 1875లో చనిపోయారు. చనిపోవడానికి పూర్వమే తన మనవడు (కూతురు కొడుకు) పార్ధసారథి అప్పారావుని రాజాగా దత్తత తీసుకున్నాడు. కొన్ని విచారణలూ, మరికొన్ని ఒప్పందాలూ తర్జన భర్జనల తర్వాత పార్ధసారథి అప్పారావుకి సంస్థానం స్వాధీనం అయ్యింది.

ప్రధాన పట్టణాలు

మార్చు

పాల్వంచ సంస్థానపు తొలి ప్రధాన పట్టణంగా కొన్ని ఏళ్ళు పాల్వంచ పట్టణం ఉంది. తర్వాత కొన్నాళ్ళు అశ్వారావుపేట పట్టణ కేంద్రంగానూ, తర్వాత భద్రాచల పట్టణ కేంద్రంగానూ పాలన సాగింది.

సరిహద్దు ప్రాంతాలు

మార్చు
దస్త్రం:Boates in godavari.a.jpg
గోదావరిలో పడవల రాకపోకలు

పాల్వంచ సంస్థానం (తెలంగాణ), వేఁగినాడు (ప.గో.జి), కోనసీమ, రంపనాడు ప్రాంతాలకి. చాలా కుటుంబాలకి భద్రాద్రి రాముడు, ఇలవేల్పు. భద్రాచలం యాత్రాస్థలం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో రోడ్డు రవాణా సౌకర్యం బాగా ఉంది. హైదరాబాదు నుండి ఖమ్మం, కొత్తగూడెం మీదుగా, విజయవాడ నుండి కొత్తగూడెం మీదుగా, రాజమండ్రి నుండి మోతుగూడెం మీదుగా, విశాఖపట్నం నుండి సీలేరు, చింతపల్లి మీదుగా, వరంగల్లు నుండి ఏటూరు నాగారం మీదుగా రోడ్డు మార్గాలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి.

సాహిత్య పోషణ

మార్చు

తెలంగాణ సంస్కృతి నిర్మాణంలో ముఖ్యంగా సాహిత్యం వికాసంలో సంస్థానాల పాత్ర విశిష్టమైనది. ఆసఫ్‌జాహీలు నిర్వహించాల్సిన పనిని ఇవి నిర్వహించాయి. అనేక తాళపత్ర గ్రంథాలను భద్రపరిచారు. దక్షిణాంధ్రయుగంలో తంజావూరు, మధుర, పుదుక్కోట రాజ్యాలు పోషించిన పాత్రను తెలంగాణలో ఈ సంస్థానాలు పోషించాయి. తెలంగాణా సంస్థానాధీశుల్లో కొందరు కవి పండితులై కావ్యాలు వెలువరించారు. మరి కొందరు ఎందరో కవులను ప్రోత్సహించి కావ్యాలు వెలువడుటకు కారకులయ్యారు.

  • ఈ సంస్థానం హయాంలో జరిగిన సాహిత్య సేవకు సంబంధించిన ఆధారాలేవీ మిగుల్చుకోలేకపోవడం దురదృష్టకరం. కానీ సా.శ. 1700 ప్రాంతంలో పాల్యంచ సంస్థానంలోని అశ్వారావుపేట ప్రాంతానికి చెందిన శ్రీనాధుని వెంకటరామయ్య అనే కవి, రచయిత ఈ సంస్థాన చరిత్రను అశ్వారాయ చరిత్రము లేదా శ్రీరామ పట్టాభిషేకం అనే పేరుతో రాసారని సూరవరం వారు సేకరించి ప్రచురించిన గోల్కొండ కవుల చరిత్రలో పేర్కొన్నారు. కానీ ఆ పుస్తకం ఇప్పుడు లభ్యం కావడం లేదు.
  • పాల్వంచ సంస్థానం గురించిన చరిత్రను కొత్తపల్లి వెంకటరామలక్ష్మీనారాయణ పాల్వంచ సంస్థాన చరిత్ర పేరుతో రాసారు. ఇతను పాల్వంచ సంస్థానంలో విద్యాధికారిగా పనిచేసాడు, దానితో పాటు ఆంధ్రవాజ్మయ సేవాసమితి కార్యదర్శి బాధ్యతలు నిర్వహించాడు.

సాంస్కృతిక సేవ

మార్చు

తెలంగాణ సంస్కృతి వ్యాప్తిలో, సంఘ సంస్కరణలలో సంస్థానా ధీశుల పాత్ర చాలా విశేషమైంది. భద్రాచల దేవాలయ పోషణ పాల్వంచ సాంస్కృతిక వైభవానికి ఒక నిదర్శనం. రామునికి, పట్టువస్త్రాలూ, ముత్యాల తలంబ్రాలూ హైదరాబాదు ముస్లిం పాలకులకాలం నుండి ప్రతీయేటా సమర్పించబడటం ఆచారంగా ఉంది హిందూ ముస్లిం సాంస్కృతిక సమన్యయానికి ఇది ఒక నిదర్శనంగా నిలచింది. దాశరథి శతక రచన చేసి తొలి సంకీర్తనాచార్యులలో ఒకరిగా పేరు పొందిన భక్త రామదాసు శంకరగిరి, హసనాబాదు తాలూకా అధికారిగా విధులు నిర్వహించినవాడే. తెలంగాణాలోని ఏకైక బౌద్ధ గుహాలయం కారుకొండను కలిగివున్న ప్రాంతం ఇదే.

గ్రంధాలయ ఉద్యమంలో

మార్చు
  • హైదరాబాదు లోని కోఠిలో 1901 సెప్టెంబరు1న శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయంని రావిచెట్టు రంగారావు ఇంట్లో ఏర్పాటు చేశారు. అప్పటి పాల్వంచ రాజాగారైన పార్థసారథి అప్పారావు స్థాపన సభకు అధ్యక్షత వహించారు. ఆనాటి సభను అలంకరించిన పెద్దలలో మునగాల రాజా నాయని వెంకట రంగారావు, రఘుపతి వెంకటరత్నం నాయుడు, డా. ఎం.జి.నాయుడు, ఆదిపూడి సోమనాథరావు, మైలవరపు నరసింహశాస్త్రి, రావిచెట్టు రంగారావు, ఆదిరాజు వీరభద్రరావు, కొఠారు వెంకట్రావు నాయుడు పేర్కొనదగినవారు.ఈ ఉద్యమాన్ని రాజా పార్థసారథి అప్పారావు (పాల్వంచ జమిందార్‌) అధ్యక్షుడిగా 10 సంవత్సరాలు వారి నిర్వహణలో దిగ్విజయంగా నడిపాడు.
  • శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషానిలయం గ్రంథాలయ భవన నిర్మాణం కొరకు రావిచెట్టు రంగారావు జ్ఞాపకార్ధం ఆతని సతీమణి లక్ష్మీనరసమ్మ 3000 రూపాయలు, మునగాల రాజా 1250 రూపాయలు, 750 రూపాయలు పార్థసారథి పౌండేషన్‌ వారు విరాళాలు సేకరించి ఈ భాష నిలయం అభివృద్ధికి తోడ్పాటును అందించారు.1940 నాటికి శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషానిలయం పుస్తకాలు, పత్రికలు లక్షల్లో కొనుగోలు చేసి వాటిని భద్రపరిచారు.
  • ఈ గ్రంథాలయ ఉద్యమ స్ఫూర్తితో అశ్వారావుపేట పట్టణంలో అశ్వారాయాంధ్ర భాషానిలయం పేరుతో గ్రంథాలయాన్ని ప్రారంభించారు. తదనంతర కాలంలో దాని పోషకులు లేక గ్రంథాలయం మూతపడి జీర్ణమై పోయినవి పోగా మిగిలిన అతికొద్ది గ్రంథాలు వారసుల పంచన రక్షన పొందాయి.

ఆలయాల నిర్మాణం

మార్చు
  • ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి మండలం లోని గ్రామం ఉప్పులూరులోని శ్రీచెన్నకేశవస్వామి ఆలయం :[5] కాకతీయ సామ్రాజ్యం పతన దశలో వున్న రోజుల్లో మహమ్మదీయుల దాడి నుంచి హిందూ మత రక్షణకు, ఆంధ్ర దేశ పర్యటనకు వచ్చిన సింహాచల క్షేత్రనివాసి కందాల కృష్ణమాచారి ఉప్పులూరులో 1335వ సంవత్సరంలో అప్పటి అప్పలస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 1650లో జజ్జూరి సంస్థ్దానాదీశులు రాజా వల్లి రాగన్న జమీందారు అప్పలస్వామి ఆలయ నిర్మాణం చేపట్టారు. పాల్వంచ, భద్రాచలం సంస్థానాదీశులు రాజా పార్థసారథి అప్పారావు బహుదూర్‌ 1893లో ఈ ఆలయానికి భూదానమిచ్చారు. శనివారపు పేట సంస్థానాదీశులు రాజా ధర్మ అప్పారావు బహుదూర్‌ 1793లో ఆలయ నిర్మాణం పూర్తిచేశారు. వైష్ణవ మత గురువులైన పరవస్తు రామాజనుజాచార్యులు 1870 సంవత్సరంలో ఈ ఆలయ విగ్రహానికి చెన్నకేశవస్వామిగా నామకరణం చేశారు. 1895లో శేషబట్టారు రాఘవాచారి చెన్నకేశస్వామికి మొట్టమొదటి సారిగా కల్యాణోత్సవాలు జరిపించారు.[6]
  • శ్రీచెన్నకేశవస్వామి ఆలయంలో దళితులే అర్చకులుగా కొనసాగుతున్నారు. పల్నాడును పాలించిన బ్రహ్మనాయుడు సేనాధిపతి కన్నమదాసు సేవాతత్పరతకు, నిష్కళంక దేశభక్తికి మెచ్చి మాచర్ల, మార్కాపురం గ్రామాలలోని చెన్నకేశవస్వామి ఆలయాల్లో పూజల నిర్వహణ బాధ్యతను అప్పగించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. కన్నమదాసు సంతతికి చెందిన తిరువీధి నారాయణదాసు 1280వ సంవత్సరంలో ఉప్పులూరు గ్రామానికి వలస వచ్చారు. తరువాతి కాలంలో ఆలయం ఆవిర్భావంతో నారాయణదాసు కుటుంబీకులే అర్చకులుగా కొనసాగుతున్నారని ఆలయ చరిత్రను బట్టి తెలుస్తోంది.
  • పాల్వంచ శివాలయం: 1820లో నిర్మించబడ్డ ఈ గుడి ఇస్లామిక్‌, గోతిక్‌ నిర్మాణ రీతుల్లో ఉంటుంది.
  • పెద్దమ్మ తల్లి గుడి పాల్వంచ బస్టాండు నుంచి 4 కి.మీ. ల దూరంలో ఉన్న ఈ గుడికి ఎంతో ప్రజాదరణ సంతరించుకుంది

క్రీఢా ప్రాంగణాలు

మార్చు

విద్యుత్ కళా భారతి ఆటస్థలం: ఖమ్మం జిల్లాలో కెల్లా పెద్దదైన ఈ ఆటస్థలం చరిత్ర పాల్వంచ క్రికెట్‌ క్లబ్బుతో ముడిపడి ఉంది. ప్రస్తుత కళాభారతి 1964లో ఉనికి లోకి వచ్చింది. ఈ ప్రదేశం ఎవరికి చెందిందో తెలియరాలేదు కానీ, క్రికెట్‌ క్లబ్బుకు అందాక, క్లబ్బు 1971లో పెవిలియను నిర్మించి ఈ ప్రాంతంలో క్రికెట్‌ ఆట అభివృద్ధికి దోహదం చేసింది.

ఇవి కూడా చూడండి

మార్చు
 
ఉత్సవమూర్తులు

మూలాలు

మార్చు
  1. తూమాటి, దోణప్ప. ఆంధ్ర సంస్థానములు సాహిత్య పోషణ (PDF). Archived from the original (PDF) on 2010-12-27. Retrieved 2020-07-16.
  2. సురవరం, ప్రతాపరెడ్డి. నిజాం రాష్ట్రంలోని ఆంధ్ర సంస్థానముల చరిత్ర. శ్రీకృష్ణ దేవరాయల ఆంధ్రభాషానిలయం రచతోత్సవ సంచిక. p. 30-49.
  3. అనంతపంతుల, రామలింగస్వామి (1965). శ్రీకృష్ణ కవి జీవితము. p. 85.
  4. శిష్టాి, వెంకటప్పయ్య (1940). హృదయాభిరామ ప్రభందము.
  5. ఆంధ్రజ్యోతి, దినపత్రిక. "చెన్నకేశవస్వామి కల్యాణోత్సవాలు". www.andhrajyothy.com. Archived from the original on 17 జూలై 2020. Retrieved 16 July 2020.
  6. "సమానత్వానికి పెద్దపీట - Eenadu". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 16 July 2020.

బయటి లింకులు

మార్చు