పావ్‌హరి బాబా
పావ్‌హరి బాబా (మరణం: 1898) ఒక భారతీయ సన్యాసి, యోగి [1].[2] పావ్‌హరి అనగా గాలి భుజించేవాడు అని అర్థం. ఆయన వారణాసి సమీపంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. చదువు కోసం ఘాజీపూర్ లోని తన మామ ఇంటికి వెళ్ళి అక్కడే చదువు పూర్తి చేశాడు. తరువాత చాలా ప్రదేశాలు తిరిగాడు. కథియావార్ అనే ద్వీపకల్పంలో ఉన్న గిర్నార్ పర్వత శ్రేణుల్లో యోగా చేయడం ప్రారంభించాడు.[3]
ఆయన మళ్ళీ ఘాజీపూర్ కు తిరిగి వచ్చి తన ఇంట్లోనే ఒక భూగృహాన్ని నిర్మించుకుని అందులోనే రోజుల తరబడి యోగా, ధ్యానం సాధన చేశాడు.[3][1] అణకువ, గౌరవం, అందరూ బాగుండాలనే తత్వం ఆయన సుగుణాలు. ఒక రోజు రాత్రి ఓ దొంగ ఆయన ఇంటిలో ప్రవేశించాడు. బాబా చూశాడని గ్రహించి ఆ దొంగ దొంగిలించిన వస్తువులు అక్కడే పడేసి పరిగెత్తాడు. కానీ బాబా అతని వెంట పరిగెత్తి ఆ సామాన్లన్నీ అతనికే ఇచ్చివేశాడు. ఆ సంఘటనతో ఆ దొంగ తన తప్పును తెలుసుకుని తను కూడా ఓ సన్యాసిగా, బాబా శిష్యుడిగా మారిపోయాడు.
1890 లో స్వామి వివేకానంద ఘాజీపూర్ వెళ్ళి బాబాను కలిశాడు [4] సిస్టర్ నివేదిత ప్రకారం బాబా 1898లో మరణించాడు. తనదేహానికి తానే నిప్పంటుకుని మరణించినట్లుగా భావిస్తున్నారు.[3]
పూర్వ జీవితం
మార్చుపావ్హరి బాబా ఒక యోగిగా ప్రసిద్ధి చెందినా ఆయన జీవితంలో తెలియని కోణాలు ఎన్నో ఉన్నాయి. ఆయన వారణాసిలోని గుజి అనే ప్రాంతానికి సమీపంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. చదువు కోసం ఘాజీపూర్ లోని తన మేనమామ ఇంటికి వెళ్ళాడు. ఆయన మేనమామ ఒక నైష్టిక బ్రహ్మచారి [5]. రామానుజుల సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉండేవాడు. ఆయనకు ఘాజీపూర్ లో కొంత స్థలం ఉండేది. అది పావ్‌హరి బాబా కు వారసత్వంగా సంక్రమించింది. ఆయన వ్యాకరణ, న్యాయ శాస్త్రాల్లో మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. అంతే కాకుండా అనేక హిందూ తత్వ శాస్త్రాల్లో తన ప్రతిభ కనబరిచాడు.[3][5]
బోధనలు
మార్చుఆయన స్వయంగా బోధించడం కన్నా తన జీవన విధానం ద్వారా ఆచరించి చూపాడు. మనిషి అంతర్గత క్రమశిక్షణ ద్వారానే నిజాన్ని తెలుసుకోగలడని ఆయన విశ్వాసం.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 Jackson 1994, pp. 24–25
- ↑ Prabhavananda 1964, p. 59
- ↑ 3.0 3.1 3.2 3.3 Nikhilananda 1953, pp. 44–45
- ↑ Bhuyan 2003, p. 12
- ↑ 5.0 5.1 Swami Vivekananda. "Sketch of the life of Pavhari Baba". Complete Works of Swami Vivekananda. RamakrishnaVivekananda.info. Archived from the original on 4 జూన్ 2013. Retrieved 2 జూన్ 2014.