ప్రధాన మెనూను తెరువు
సాధారణంగా పిట్ బుల్ జాతి కుక్కలుగా గుర్తించబడే మూడు రకాల జాతులలో ఒకటైన స్టాఫోర్డ్ షైర్ బుల్ టేరియర్.
 • మోలోస్సేర్ జాతి సమూహానికి చెందిన అనేక కుక్క జాతులను సాధారణంగా పిట్ బుల్ అని వ్యవహరించడం జరుగుతుంది. వొంటారియో, కెనడా[1] మరియు డెన్వర్, కొలరాడో[2] వంటి అనేక చట్ట పరిధులలో పిట్ బుల్ అనే పదాన్ని ఆధునిక అమెరికన్ పిట్ బుల్ టేరియర్, అమెరికన్ స్టాఫోర్డ్షిర్ టేరియర్, స్టాఫోర్డ్షిర్ బుల్ టేరియర్ లేక ఈ జాతుల లక్షణాలు, పోలికలు కలిగిన ఇతర జాతుల కుక్కలను సూచిస్తూ వాడతారు. అయితే సింగపూర్[3] మరియు ఫ్రాంక్లిన్ దేశమైన ఓహియో[4] వంటి దేశాలలో ఆధునిక అమెరికన్ బుల్ డాగ్ నే పిట్ బుల్ రకం కుక్కగా వ్యవహరిస్తుండగా యునైటెడ్ కింగ్డంలో మాత్రం ఈ పదం కేవలం అమెరికన్ పిట్ బుల్ టేరియర్ కే వర్తిస్తుంది.[5] బుల్ డాగ్ లేక రకరకాల టేరియర్ ల నుండి ఉద్భవించిన ఈ మూడు జాతులకు దాదాపు ఒకటే విధమైన చరిత్ర ఉంది. 20వ శతాబ్దపు తొలినాళ్ళలో ఆధునిక బుల్ టేరియర్ ల అభివృద్ధికి ముందు "బుల్ టేరియర్"లుగా పిలువబడే కుక్కలను కూడా ఇలాగే వ్యవహరించడం జరిగింది.
 • పిట్ బుల్ అనేది ఎంతో ప్రేమపూరితమైన జంతువు. అన్ని పిట్ బుల్ కుక్కలు కూడా బుల్ డాగ్ లు మరియు టేరియర్ ల సంకరంతోనే ఉద్భవించినప్పటికీ ఇందులో ప్రతి జాతీ కూడా ప్రత్యేకమైన చరిత్రను కలిగి ఉంది. యునైటెడ్ స్టేట్స్ లో మొత్తం 77.5 మిలియన్ పెంపుడు కుక్కలు ఉన్నట్లు అంచనా.[6] అయితే, ఇందులో పిట్ బుల్ జాతి కుక్కల సంఖ్య ఎంత అనేదాని పై మాత్రం సరైన అంచనాలు లేవు.[7] యునైటెడ్ స్టేట్స్ లోని జంతు సంరక్షణా కేంద్రాలలో 2008లో మొత్తం 1.7 మిలియన్ కుక్కలను వాటి బాధ తొలగించే నిమిత్తం వధించగా అందులో 980,000 అనగా 58 శాతం కుక్కలు పిట్ బుల్ జాతి కుక్కలుగా అంచనా వేయడం జరిగింది.[8]

అమెరికన్ పిట్ బుల్ టేరియర్సవరించు

అమెరికన్ పిట్ బుల్ టేరియర్
 • టేరియర్ లు మరియు బుల్ డాగ్ జాతి కుక్కల సంకరం ద్వారా ఉద్భవించిన అమెరికన్ పిట్ బుల్ టేరియర్ కుక్కలు టేరియర్ ల యొక్క చలాకీతనం మరియు బుల్ డాగ్ ల యొక్క బలం మరియు కండర బలాలు కలిసి ఉంటాయి.[9] ఈ కుక్కలు తొలుత ఇంగ్లాండ్, ఐర్లాండ్ మరియు స్కాట్లాండ్ లలో అభివృద్ధి చేయబడి ఈ దేశాల నుండి యునైటెడ్ స్టేట్స్ కు వచ్చే వలసదారుల ద్వారా ఆ దేశం లోనికి తీసుకురాబడ్డాయి. యునైటెడ్ స్టేట్స్ లో ఈ కుక్కలను అడవి పందులను వేటాడేందుకు, పశువులకు మరియు మనుషులకు తోడుగా కాపలా ఉండేందుకు కాచ్ డాగ్ లుగా ఉపయోగిస్తారు.[9] అయితే కొన్నింటిని మాత్రం వాటి పోరాట సామర్ధ్యం మెరుగ్గా ఉండేందుకు ప్రత్యేకంగా సంకరం చేస్తారు.[10] 20వ శతాబ్దం తొలినాళ్ళ నుండి యునైటెడ్ స్టేట్స్ లో కుక్కల పోరాటాలకు గాను బుల్ టేరియర్ ప్రత్యేక ఎంపికగా మారింది.[11][12]
 • ది యునైటెడ్ కేన్నెల్ క్లబ్ లో అమెరికన్ పిట్ బుల్ టేరియర్ ను మొదటగా నమోదు చేసుకోవడం జరిగింది.[13] ఈ క్లబ్ వ్యవస్థాపకుడు అయిన సి.జెడ్.బెన్నెట్ 1898లో తన సొంత అమెరికన్ పిట్ బుల్ టేరియర్ అయిన బెనేట్స్ రింగ్ కు ఒకటవ రిజిస్ట్రేషన్ సంఖ్యను ఇవ్వడం జరిగింది.[9]
 • ఈ రోజున అమెరికన్ పిట్ బుల్ టేరియర్ లను తోడుగా ఉండే కుక్కలుగాను, పోలీస్ కుక్కలు[14][15] గాను మరియు వైద్యానికి సంబంధించిన కుక్కలు[16] గాను వివిధ రకాలుగా వినియోగించడం జరుగుతుంది.అయితే టేరియర్ లు బాగా దూకుడుగా[17] ఉండే లక్షణాలు కలిగి ఉండడం వల్ల యునైటెడ్ స్టేట్స్ లో వీటిని అధికంగా అనైతికమైన కుక్కల పోరాటాలకు వినియోగిస్తుంటారు.[18] దీనితో పాటు ఈ కుక్కలను నార్కోటిక్ కార్యకలాపాలకు తోడ్పడడం, [19] పోలీసులకు వ్యతిరేకంగా వ్యవహరించడం[20] మరియు ఆయుధాలుగా ఉపయోగపడడం వంటి అనైతిక కార్యక్రమాలకు వినియోగించడం జరుగుతుందని చట్ట సంస్థల నుండి ఫిర్యాదులు ఉన్నాయి.[21]
 • ఈ పిట్ బుల్ కుక్కలకు ఉండే ఈ దూకుడు స్వభావం వల్ల సాన్ ఫ్రాన్సిస్కో సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాల్తీ టు యానిమల్స్ 1996లో ఈ పిట్ బుల్ టేరియర్ లకు "సెయింట్ ఫ్రాన్సిస్ టేరియర్లు" అనే మారుపేరు ఇవ్వడం జరిగింది (దీనికి న్యూయార్క్ లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ లోని టేరియర్ మస్కట్ కు సంబంధం లేదు). దీని వలన వీటిని మరింత తేలికగా దత్తత చేసుకోవడం వీలవుతుందనేది దీని ఉద్దేశం.[22] కొత్తగా దత్తత తీసుకున్న అనేక కుక్కలు పిల్లులను చంపడం వల్ల ఈ కార్యక్రమం ముగిసే లోపు మొత్తం 60 దూకుడు పరీక్ష చేసిన కుక్కలను మాత్రం దత్తత తీసుకోవడం జరిగింది.[23] ది న్యూయార్క్ సిటి సెంటర్ ఫర్ యానిమల్ కేర్ అండ్ కంట్రోల్ వారు కూడా 2004 ఈ పిట్ బుల్ టేరియర్ లకు "న్యుయార్కీస్" అనే పేరు పెట్టడం ద్వారా అదే వ్యూహాన్ని అమలు చేయడానికి ప్రయత్నించినప్పటికీ భారీ ఎత్తున వచ్చిన ప్రజా వ్యతిరేకత వల్ల ఆ ప్రతిపాదనను విరమించుకోవడం జరిగింది.[24][25]

అమెరికన్ స్టాఫోర్డ్‌షైర్ టెర్రియర్సవరించు

 • 19వ శతాబ్దంలో బుల్ మరియు టేరియర్ డాగ్, హాఫ్ అండ్ హాఫ్, పిట్ డాగ్ లేక పిట్ బుల్ టేరియర్ లను ఉత్పత్తి చేసిన బుల్ డాగ్ లు మరియు టేరియర్ ల సంకర ఉత్పత్తి అయిన అమెరికన్ స్తాఫోర్డ్ షైర్ టేరియర్ లే తర్వాత కాలంలో ఇంగ్లాండ్ లో స్తాఫోర్డ్ షైర్ బుల్ టేరియర్ లుగా ప్రాచుర్యం పొందాయి. పూర్తిగా అభివృద్ధి చెందిన కండరాలతో, పొడవైన తోకతో ఉన్న ఆనాటి బుల్ డాగ్ కు మరియు ఆధునిక బుల్ డాగ్ కు ఎన్నో తేడాలు ఉన్నాయి. తరువాతి కాలంలో వైట్ ఇంగ్లిష్ టేరియర్, బ్లాక్ అండ్ టాన్ టేరియర్, ఫాక్స్ టేరియర్ లేక వాటి మిశ్రమ జాతులను వినియోగించడం జరిగిందనే వాదనలు కూడా ఉన్నాయి. ఈ కుక్కలే తరువాత 1870ల కాలంలో అమెరికాలోకి ప్రవేశించి పిట్ డాగ్, పిట్ బుల్ టేరియర్ మరియు అమెరికన్ బుల్ టేరియర్ లుగా, తరువాతి కాలంలో యాంకీ టేరియర్ లు గాను ప్రాచుర్యం పొందాయి.[26] వాటికోసమే కాకపోయినా ప్రధానంగా వీటిని పిట్ యద్ద పందాల కోసమే దిగుమతి చేసుకోవడం జరిగేది.[27]
 • 1936లో వీటిని అమెరికన్ కేన్నల్ క్లబ్ (ఎకేసి) "స్తాఫోర్డ్ షైర్ టేరియర్" లుగా నమోదు చేసుకోవడం జరిగింది. యునైటెడ్ స్టేట్స్ లోని జంతు పెంపకందారులు 1972 జనవరి 1 న ఇంగ్లాండ్ కు చెందిన స్తాఫోర్డ్ షైర్ బుల్ టేరియర్ ల కన్నా ఎక్కువ బరువు కలిగిన "అమెరికన్ స్తాఫోర్డ్ షైర్ టేరియర్" లను అభివృద్ధి చేయడంతో ఈ రెండు జాతులకు మధ్య తేడాను చూపించేందుకు గానూ వీటికి ప్రత్యేకమైన పేరు ఇవ్వడం జరిగింది.[26]

స్టాఫోర్డ్‌షైర్ బుల్ టెర్రియర్సవరించు

 • అనేక శతాబ్దాల క్రితం బుల్ బైటింగ్ మరియు బేర్ బైటింగ్ వంటి క్రీడలకు బుల్ డాగ్ మరియు మస్తిఫ్ వంటి కుక్కలను వినియోగించే కాలంలోనే ఇంగ్లాండ్ లో స్తాఫోర్డ్ షైర్ బుల్ టేరియర్ ల కాలం ప్రారంభమయింది. ఎలిజబెత్ కాలంలో, ఈ క్రీడల కోసం బ్రీడర్ లో పెద్ద కుక్కలను ఉత్పత్తి చేయగా తరువాతి కాలంలో 100 నుండి 120 పౌండ్ ల బరువున్న కుక్కల స్థానంలో కేవలం 90 పౌండ్ ల బరువు మాత్రమే కలిగి చిన్నగా మరింత చురుకుగా ఉండే కుక్కలను ఉత్పత్తి చేయడం జరిగింది.[28]
 • 19వ శతాబ్దపు తొలినాళ్ళలో ఇంగ్లాండ్ లో కుక్కల పోరాట క్రీడలు మరింత ప్రాచుర్యం పొందడంతో మరింత చిన్నవైన, చురుకైన కుక్కలు అభివృద్ధి చేయబడ్డాయి. అవి "బుల్ డాగ్ టేరియర్" మరియు "బుల్ అండ్ టేరియర్" అనే పేర్లతో ప్రాచుర్యం పొందాయి. దాదాపు 60 పౌండ్ ల బరువు కలిగి ఉండే ఆధునిక ఇంగ్లీష్ బుల్ డాగ్ తో పోలిస్తే అప్పటి బుల్ డాగ్ లు మరింత పెద్దవిగా ఉండేవి. ఈ కుక్కను ప్రస్తుతపు మాంచెస్టర్ టేరియర్ ను పోలి ఉండే చిన్న స్థానిక టేరియర్ లతో సంకరం చేయగా దాదాపు 30 నుండి 45 పౌండ్ ల బరువు ఉండే స్తాఫోర్డ్ షైర్ బుల్ టేరియర్ లు ఉత్పత్తి కావడం జరిగింది.[28]
 • జేమ్స్ హింక్స్ 1860 లో ప్రస్తుతం స్తాఫోర్డ్ షైర్ బుల్ టేరియర్ గా పిలువబడే పాత పిట్ బుల్ టేరియర్ ను సంకరం చేసి మొత్తం తెల్లగా ఉండే ఇంగ్లిష్ బుల్ టేరియర్ ను ఉత్పత్తి చేయడం జరిగింది. గ్రేట్ బ్రిటన్ లోని కేన్నెల్ క్లబ్ 19వ శతాబ్దపు చివరి నాళ్లలో బుల్ టేరియర్ ను గుర్తించడం జరిగింది. అయితే ఈ పోరాట క్రీడల కుక్కలుగా ఈ స్తాఫోర్డ్ షైర్ బుల్ టేరియర్ ల ప్రాచుర్యం ఏ స్థాయిలో ఉందంటే జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక చట్టం 1835 క్రింద కుక్కల పోరాట క్రీడలు చట్టబద్ధం కాకుండా పోయిన శతాబ్దం తరువాత 1935కు గానీ కేన్నెల్ క్లబ్ ఈ జాతిని గుర్తించడం జరగలేదు.[28]
 • AKC యొక్క స్టడ్ పుస్తకంలో 1974 అక్టోబరు 1 నుండి స్తాఫోర్డ్ షైర్ బుల్ టేరియర్ లు నమోదు చేయబడ్డాయి. అయితే AKC షో లలో మాత్రం ఈ టేరియర్ సమూహం యొక్క సాధారణ షో వర్గీకరణలు 1975 మార్చి 5 నుండి అందుబాటులో ఉన్నాయి.[29]

సంబంధిత మానవ మరణాలుసవరించు

 • కుక్క కాటు వలన సంభవించే ట్రామా వల్ల కలిగే మానవ మరణాల యొక్క సంఖ్య పై చాలా కొద్ది అధ్యయనాలు మాత్రమే జరిగాయి. ఇవి కూడా కుక్క కాటు సంబంధిత మరణాల పై వార్తా కథనాలను పరిగణనలోకి తీసుకుని మాత్రమే అధ్యయనం చేయడం జరిగింది. ఈ పద్ధతి వలన అనేక పొరపాట్లు జరిగేందుకు అవకాశం ఉంది: కొన్ని మరణాలు అసలు రిపోర్ట్ కాకపోవచ్చు; ఒక అధ్యయనంలో అన్ని సంబంధిత వార్తా కథనాలు లభించకపోవచ్చు; యునైటెడ్ స్టేట్స్[30][31] మరియు కెనడా[32][33] లలో కోర్ట్ లు జాతుల ప్రమాణాలను వినియోగించే సందర్భంలో జాతులకు సంబంధించిన చట్టాల అమలు విషయంలో నిపుణుల ద్వారా గుర్తింపు జరపాలనే ఆదేశాలు ఇచ్చినప్పటికీ కుక్కల జాతుల గుర్తింపులో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది[7]. DNA పరీక్ష[33] ద్వారా కుక్కల జాతులలో తేడాలు గుర్తించడం సాధ్యమైనప్పటికీ ఈ పరీక్షల యొక్క ఫలితాలు ఆ పరీక్ష నిర్వహించే ప్రయోగశాల పై మరియు ఆ ప్రయోగశాలల లోని DNA డేటాబేస్ లో ఉన్న సుద్ధ జాతుల సంఖ్య పై ఆధారపడి ఉంటాయి.[34]
 • దవడ లోపాలను ఆపరేషన్ ద్వారా సరిచేయబడం ద్వారా మూసి ఉన్నప్పుడు ఒక కుక్క దవడను లాక్ చేయడం సాధ్యమైనప్పటికీ [35] సాధారణ పిట్ బుల్ రకం కుక్కల పళ్ళు మరియు దవడల నిర్మాణంలో శారీరకమైన లాకింగ్ మెకానిజం ఉన్నట్లు ఏమీ ఆధారాలు లేవు.[36] ఈ శారీరకమైన దవడ లాకింగ్ యంత్రాంగం లేకపోయినప్పటికీ పిట్ బుల్ రకం కుక్కలు తరచుగా కొరకడం, పట్టుకోవడం మరియు ఊపడం వంటి లక్షణాలను ప్రదర్శించడమే కాక కొరికేటప్పుడు అంత తేలికగా వదలవు కూడా.[19][27][37] ఒక అమ్మోనియా యంప్యుల్ ను విరిచి కుక్కకు వాసన చూపించడం [27] లేదా అది ఒక మనిషినో లేక జంతువునో కరుస్తున్నప్పుడు కుక్క దవడను బలవంతంగా తెరిచేందుకు "బ్రేక్ స్టిక్"ను వినియోగించడం అనేవి పిట్ బుల్ రకం కుక్క తన పట్టును వదిలేందుకు చేసే ప్రయత్నాలలో కొన్ని.[17][38]

వ్యాధుల నియంత్రణ మరియు నివారణ కేంద్రాలు (2000)సవరించు

 • 2000 సంవత్సరంలో ది సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) 1979 -1998 వరకు కుక్క కాటుకు సంబంధించిన మరణాల పై ఒక నివేదికను విడుదల చేసింది. ఈ 24 సంవత్సరాల కాలంలో కుక్క కాటుల వలన దాదాపు 238 మంది ప్రజలు చనిపోయినట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఈ నివేదికలో గుర్తించిన మరణాలలో 76 మంది అనగా దాదాపు 32 శాతం పిట్ బుల్ టేరియర్ లు లేక సంబంధిత జాతి కుక్కల వలనే చనిపోయినట్లు ఈ నివేదిక వెల్లడించింది. 44 మంది అనగా 18 శాతం మరణాలకు కారణమైన రొట్వీలర్ సంబంధిత జాతులు ఆ తరువాతి స్థానంలో ఉన్నట్లు కూడా ఈ నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం మొత్తం మీద ఈ 20 సంవత్సరాల కాలంలో సంభవించిన మరణాలలో దాదాపు 50 శాతం పిట్ బుల్ లు మరియు రొట్వీలర్ ల వలనే సంభవించగా చివరి రెండు సంవత్సరాలలో (1997-1998) దాదాపు 67 శాతం మరణాలకు ఇవి కారణమయ్యాయి. ఈ నివేదిక ముగింపు ఇలా ఉంది.

  "యునైటెడ్ స్టేట్స్ లో దాదాపు 60 శాతం ఈ జాతి (పిట్ బుల్ మరియు రొట్వీలర్) కుక్కలే ఉంటుండగా ఇదే సమయంలో ఈ కుక్కల వలనే అత్యధిక మరణాలు సంభవించడం అసాధారణం".[7]

 • ఈ నివేదిక రచయితలు ఇంకా ఇలా వెల్లడించారు:

  "మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తున్నప్పటికీ భవిష్యత్తు కార్యాచరణ రూపొందించే ముందు మరణాలకు కారణమైన కాట్లు మరియు కారణం కానివి రెండింటినీ పరిగణనలోనికి తీసుకోవలసి ఉంటుంది. 1986 నుండి 1994 వరకు వైద్య చికిత్స పొందిన కాటుల సంఖ్యలో 36 శాతం పెరుగుదల ఉన్నదంటే కుక్క కాటు నివారణా కార్యక్రమాలతో పాటు మరింత ప్రభావవంతమైన కార్యక్రమాలు రూపొందించాల్సిన అవసరం స్పష్టమౌతుంది. ఏడాది కాలంలో మరణాలకు కారణమౌతున్న కాటుల సంఖ్య 0.00001% మాత్రమే ఉంటుంది.మరణాలకు కారణమౌతున్న కాటుల సంఖ్యలో పెద్దగా మార్పు లేకపోయినప్పటికీ ఇతర కుక్క కాటుల సంఖ్య మాత్రం పెరుగుతూ ఉంది. కుక్క కాటు నియంత్రణా చట్టాల రూపకల్పన మరియు అమలు వలన మరణాలకు కారణమయ్యే స్థాయిలో కుక్క కాటులు పెద్దగా లేవు. కుక్క కాటు నియంత్రణకు సంబంధించిన విధానాలు రూపొందించేటప్పుడు మరణాలకు కారణమయిన కాటుల సంఖ్యను ప్రధానంగా పరిగణన లోనికి తీసుకోకూడదని మేము నమ్ముతున్నాము."

 • "కుక్కల యొక్క జాతితో సంబంధం లేకుండా పటిష్టమైన నియంత్రణా చట్టాలు రూపొందిస్తే కుక్క యొక్క జాతి ఏదైనప్పటికీ దాని ప్రవర్తన యొక్క బాధ్యత దాని యజమాని పై ఉండే అవకాశం ఉంటుందని" కూడా ఈ రచయితలు సూచించారు. ప్రత్యేకంగా విపరీత ధోరణిలో ప్రవర్తించే కుక్కల యొక్క యజమానుల పై పనిచేయడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుందని కూడా వారు అభిప్రాయపడ్డారు.[39]
 • "డాగ్ బైట్: ఫాక్ట్ షీట్" పేరుతో వెలువడిన సరికొత్త CDC నివేదిక ఈ నివేదికకు సంబంధించిన ఒక డిస్క్లైమర్ ను వెలువరించింది. దీని ప్రకారం

  "ఈ నివేదిక ఎక్కువగా కరిచే లేక చంపే అవకాశం ఉన్న జాతులను గుర్తించే నివేదిక కాదు కాబట్టి ఈ విషయం పై విధానాలకు సంబంధించిన నిర్ణయాలను తీసుకునేందుకు ఇది ప్రాతిపదిక కారాదు. ప్రతి ఏటా 4.7 మిలియన్ అమెరికన్ లు కుక్క కాటుకు గురవుతున్నారు. ఈ కాటుల వలన సుమారు 16 మంది మరణిస్తున్నారు; ఇది మొత్తం కుక్క కాటుకు గురయిన వారి సంఖ్యలో 0.0002 శాతం. ఈ కొద్ది మరణాలకు సంబంధించి మాత్రమే కుక్కల జాతులకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంది. ఒక ప్రత్యేకమైన జాతికి సంబంధించిన కుక్కల సంఖ్యను గుర్తించేందుకు ప్రస్తుతం ఎటువంటి ఖచ్చితమైన పద్ధతి లేదు. దీని వలన ఏ జాతి కుక్కలు అధికంగా కరుస్తాయి లేక మరణాలకు కారణమౌతాయి అనేదానిని గుర్తించేందుకు కూడా సరైన పద్ధతులు లేవు".[40]

కెనడియన్ వెటర్నరీ జర్నల్ (2008)సవరించు

 • డాక్టర్ మాలతీ రాఘవన్, DVM, PhD వార్తా పత్రికా కథనాలను ఆన్ లైన్ ద్వారా పరిశోధించి 1990 నుండి 2007 వరకు కెనడాలో సంభవించిన కుక్క కాటుకు సంబంధించిన మరణాలలో ప్రతి 28 మరణాలలో ఒకటి (3.6%) మాత్రమే పిట్ బుల్ టేరియర్ ల వల్ల సంభవించినవని కనుగొన్నారు.[41]

క్లిఫ్టన్ నివేదిక (2009)సవరించు

 • యానిమల్ పీపుల్ న్యూస్ యొక్క ఎడిటర్ అయిన మేర్రిట్ క్లిఫ్తన్[42] సెప్టెంబరు 1982 నుండి 2009 డిసెంబరు 22 వరకు యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడాలలో సంభవించిన తీవ్రమైన కుక్క కాటులు మరియు మరణాలకు సంబంధించిన వార్తా కథనాలన్నింటినీ సమీకరించారు. కుక్క యొక్క జాతి మరియు వారసత్వం కచ్చితంగా నిర్ధారించబడి జంతు నియంత్రణ అధికారులచే లేక నిపుణులచే పెంపుడు కుక్కలుగా నిర్ణయించబడిన కుక్కల యొక్క దాడులను ఈ అధ్యయనం లెక్క కట్టింది. ఈ అధ్యయనంలో జాతి నిర్ధారణ కాని కుక్క కాటులను, అదే విధంగా పోలీస్ కుక్కలు, కాపలా కుక్కలు మరియు పోరాటాలకై ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వబడిన కుక్కల యొక్క దాడులను ఈ నివేదిక పరిగణన లోనికి తీసుకోలేదు కాబట్టి ఇది ఎంత మాత్రమూ పూర్తి జాబితా కాదు అని క్లిఫ్తన్ వెల్లడించారు.[43]
 • 27 సంవత్సరాల కాలంలో 345 మంది ప్రజలు కుక్క కాటుల వల్ల మరణించారని ఈ నివేదిక కనుగొంది. ఇందులో 159 మంది అనగా దాదాపు 46 శాతం మంది ప్రజలు పిట్ బుల్ టేరియర్ లు వాటి సంబంధిత జాతుల వల్లే మరణానికి గురయ్యారని అంచనా. మొత్తం 70 మరణాలు అనగా 20 శాతం మరణాలకు కారణమౌతున్న రొట్వీలర్ మరియు సంబంధిత జాతులు ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాయి. మొత్తం మీద పిట్ బుల్ లు, రొట్వీలర్ లు వీటి సంబంధిత జాతి కుక్కలు 66 శాతం కుక్క కాటు సంబంధిత మరణాలకు కారణమౌతున్నాయని ఈ నివేదిక తెలిపింది. ఈ సమయంలో పిట్ బుల్ టేరియర్ ల వల్ల తీవ్ర గాయాలైనవారు 778 మంది ఉన్నారనీ, రొట్వీలర్ల వలన గాయాలైనవారు 244 మంది ఉన్నారనీ కూడా ఈ నివేదిక తెలిపింది. ఇదే సమయంలో జర్మన్ షెపర్డ్ కుక్క కాటు వలన మరణించిన వారి సంఖ్య 9గా ఉంది. జర్మన్ షెపర్డ్ వలన తీవ్ర గాయాలైన వారి సంఖ్య 50.[43]
 • క్లిఫ్తన్ తన నివేదికను ఇలా ముగించారు.

  "దూకుడుతనం అనేది ఇక్కడ సమస్య కాదు. ప్రమాదం యొక్క సంభావ్యత అనేదే ఇక్కడ సమస్య. ఏ కుక్క సరైన మూడ్ లో లేకున్నా ఎవరో ఒకరిని కరుస్తుంది. అయితే దాని వలన మరణించడమో, తీవ్ర గాయాలవడమో జరగకపోవచ్చు. కాబట్టి ఈ ప్రమాదం సంభవించే అవకాశాలనే దృష్టిలో పెట్టుకోవడం సమంజసంగా ఉంటుంది. ఒక పిట్ బుల్ టేరియర్ సరైన మూడ్ లో లేనట్లయితే అది మనిషి మరణానికి కారణమవడమో లేక తీవ్ర గాయాలకు గురిచేయడమో జరుగుతుంది. దీనిని నిర్లక్ష్యం చేసినట్లయితే కుక్క మరియు మనిషి ఇద్దరు మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది".[43]

యునైటెడ్ స్టేట్స్ లో నమోదైన మరణాలు (2005–2009)సవరించు

 • వార్తా సంస్థల కథనాల ప్రకారం 2005 నుండి 2009 వరకు యునైటెడ్ స్టేట్స్ లో సంభవించిన పిట్ బుల్ కుక్క కాటుకు సంబంధిన మరణాల సంఖ్య ఈ క్రింది పట్టికలో ఇవ్వబడింది:

యునైటెడ్ స్టేట్స్ లో నమోదైన కుక్క కాటుకు సంబంధించిన మరణాలు .[44]
సంవత్సరం మొత్తం ఇందుకు కారణమైన పిట్ బుల్ జాతి కుక్కలు
2005 28 17 (62%)
2006 29 15 (52%)
2007 34 18 (53%)
2008 23 15 (65%)
2009 30 14.6%

వాణిజ్యపరమైన నిబంధనలుసవరించు

లయబులిటీ ఇన్సురెన్స్సవరించు

 • యునైటెడ్ స్టేట్స్ లో వారి కుక్కలు చేసే గాయాలకు యజమానులే చట్టబద్ధమైన బాధ్యత వహించవలసి ఉంటుంది. కుక్కను బాధ్యతా రాహిత్యంతో వదిలివేసినందుకు లేక వారి కుక్కకు ఇతరులను గాయపరిచే (ఉదాహరణకు కరవడం) అలవాటు ఉన్నట్లు ముందుగా తెలిసినా సరైన బాధ్యత తీసుకోనందుకు ఆయా కుక్కల యజమానులే సాధారణంగా జవాబుదారీగా ఉండవలసి ఉంటుంది. అయితే బాధ్యతా రాహిత్యం, కుక్క యొక్క ప్రవర్తన కారణం కానప్పటికీ స్థానిక చట్టాలు కనుక కుక్క వలన జరిగే నష్టానికి యజమానినే కచ్చితంగా బాధ్యులను చేసినట్లయితే కుక్క యజమానులు సహజంగానే జవాబుదారీతనం చూపుతారు. కుక్క కాటు వలన కలిగే గాయాలకు 100,000–300,000 యుఎస్ డాలర్ల వరకు హోం ఓనర్స్ మరియు రెంటర్స్ ఇన్సురెన్స్ విధానాలు కవరేజ్ కల్పిస్తాయి.[45] అయితే కొన్ని బీమా కంపెనీలు వారు బీమా చేసిన కుక్కల యజమానుల పై నియంత్రణలు విధించడం ద్వారా వారి కుక్క కాటుకు సంబంధించిన క్లయింల పై పరిమితులు విధిస్తాయి. ఇన్సురెన్స్ పాలసీలో కుక్క కాటులను కవర్ చేసేందుకు తిరస్కరించడం, కొన్ని ప్రత్యేక జాతుల పెంపుడు కుక్కల యజమానులకు భేమా రేట్ లను పెంచడం, కొన్ని ప్రత్యేక జాతి కుక్కల యజమానులను ప్రత్యేక శిక్షణ తీసుకోవలసిందిగా కోరడం లేదా వారి కుక్కలను అమెరికన్ కేన్నేల్ క్లబ్ వారి కనైన్ గుడ్ సిటిజన్ పరీక్ష పాస్ కావలసిందిగా కోరడం, [46] కుక్కలను గొలుసులు లేదా ఇతర సాధనాల ద్వారా నియంత్రించాల్సిందిగా యజమానులను కోరడం మరియు కొన్ని ప్రత్యేక జాతుల కుక్కల యొక్క యజమానులకు పాలసీలు చేసేందుకు తిరస్కరించడం వంటివి ఈ నియంత్రణలలో కొన్ని.[45] అన్ని పిట్ బుల్ రకం కుక్కలను ప్రమాదకరమైనవిగా ప్రకటించిన వోహియోలో, [47] పిట్ బుల్ కుక్క కాటు నష్టాన్ని ఎదుర్కునేందుకు చేసే ప్రత్యేక లయబులిటీ ఇన్సురెన్స్ యొక్క ఖరీదు ఏడాదికి దాదాపు 575 యుఎస్ డాలర్ లకు పైగానే ఉంటుంది.[48]
 • ఎవరివైనా కుక్కలు వారికి సంబంధించిన అద్దెకు ఇవ్వబడిన ఇండ్లలో ఉంటూ, వారికి వారి ఇంట్లో నివసిస్తున్న కుక్క దూకుడు స్వభావం కలదని తెలిసి కూడా ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్న వారి భద్రత కోసం ఎటువంటి చర్యలు తీసుకోనట్లయితే ఆ కుక్కల యజమానులు అందుకు బాధ్యత వహించవలసి ఉంటుంది. ఫలితంగా, ఈ కుక్క కాటు వలన జరిగే నష్టాన్ని ఆ అద్దెకు ఇవ్వబడిన ఆస్తి యొక్క ఇన్సురెన్స్ కవర్ చేయనట్లయితే చాలా వరకు అద్దెకు ఇవ్వబడిన ఇండ్లలో ఈ పిట్ బుల్ రకం కుక్కలను ఉంచడం జరగదు. పిట్ బుల్ రకం కుక్కలు, రొట్వీలర్ లు, జర్మన్ షెపర్డ్ లు, డాబర్ మాన్ పించెర్ లు, అకిటాలు (అకిటా ఇనూ మరియు అమెరికన్ అకిటా) మరియు చౌలు సాధారణంగా ఇన్సురెన్స్ కంపెనీ ల యొక్క లక్ష్యంగా ఉండే కుక్క జాతులు.[49]

వాయు రవాణా నిబంధనలుసవరించు

 • తల చిన్నగా, వెడల్పుగా ఉండే జంతువుల పై అధిక ఉష్ణోగ్రత మరియు తేమల యొక్క ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, లేక ఎయిర్ లైన్ యొక్క ఆస్తులు, సిబ్బంది మరియు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అనేక వాయు రవాణా సంస్థలు కొన్ని ప్రత్యేక జాతుల కుక్కల రవాణా పై నిషేధం విధించాయి. పిట్ బుల్ జాతి కుక్కల వాయు రవాణాకు సంబంధించిన నిబంధనలు ఈ క్రింద పట్టికలో ఇవ్వబడ్డాయి.
ఎయిర్‌లైన్ కారణము వివరములు
ఎయిర్ ఫ్రాన్స్ భద్రత స్టాఫోర్డ్ షైర్ టేరియర్, మాస్టిఫ్ఫ్ (బోర్బోల్), తోసా మరియు పిట్ బుల్ లను వాయు మార్గం ద్వారా రవాణా చేసే వీలు లేదు.[50]
అలస్కా ఎయిర్ లైన్స్ / హారిజాన్ ఎయిర్ ఆరోగ్యం అమెరికన్ పిట్ బుల్ టేరియర్ లు, అమెరికన్ స్టాఫోర్డ్ షైర్ టేరియర్ లు, స్టాఫోర్డ్ షైర్ బుల్ టేరియర్ లు మరియు ఇతర సంబంధిత కుక్కలను యజమాని బాధ్యత మీద వాయు రవాణా చేయవచ్చు. అయితే రవాణా సమయంలో కుక్కలకు అయ్యే గాయాలకు, వాటి మరణాలకు ఎటువంటి అదనపు పరిహారము ఇవ్వబడదు. కుక్క యొక్క భద్రతకు బయట ఉన్న వాతావరణం ప్రమాదమని భావించిన పక్షంలో ఆ కుక్కల రవాణాను తిరస్కరించే అధికారం ఎయిర్ లైన్స్ కు ఉంది.[51]
అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఆరోగ్యం ప్రయాణ సమయంలోని ఏ నిముషం లోనైనా ఉష్ణోగ్రత 75 డిగ్రీల ఫారెన్ హీట్ అనగా 23.8 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా యొక్క ఉండవచ్చనే అంచనా ఉన్న సందర్భంలో పిట్ బుల్ జాతి కుక్కలతో సహా అన్ని గుండ్రని మూతిగల కుక్కల రవాణా నిషేధము.[52]
బ్రిటిష్ ఎయిర్వేస్ భద్రత అమెరికన్ పిట్ బుల్ టేరియన్ ల రవాణా నిషిద్ధం[53]
కాంటినెంటల్ ఎయిర్ లైన్స్ భద్రత ఆరు నెలల కన్నా ఎక్కువ వయసు ఉన్నా లేక 20 పౌండ్ ల కన్నా (9 కిలోగ్రామ్) ల కన్నా ఎక్కువ బరువున్న అన్ని అమెరికన్ పిట్ బుల్ టేరియర్ ల రవాణా నిషిద్ధం.[54]
కాంటినెంటల్ ఎయిర్ లైన్స్ ఆరోగ్యం ఆరు నెలల కన్నా ఎక్కువ వయసు ఉన్నా లేక 20 పౌండ్ ల కన్నా (9 కిలోగ్రామ్) ల కన్నా ఎక్కువ బరువున్న అన్ని అమెరికన్ స్టాఫోర్డ్ షైర్ టేరియర్ లు మరియు అమెరికన్ బుల్ డాగ్ లు లేక ప్రయాణం ప్రారంభ సమయంలో లేక మధ్యలో ఏ క్షణాన్నైనా ఉష్ణోగ్రత 85 డిగ్రీల ఫారెన్ హీట్ అనగా 29 .4 డిగ్రీల సెంటి గ్రేడ్ దాటే సందర్భంలో ఈ అన్ని జాతుల కుక్కల రవాణా నిషేధం.[54]
డెల్టా ఎయిర్ లైన్స్ ఆరోగ్యం ప్రయాణ సమయంలోని ఏ నిముషం లోనైనా ఉష్ణోగ్రత 75 డిగ్రీల ఫారెన్ హీట్ అనగా 23.8 డిగ్రీ ల సెంటీగ్రేడ్ కన్నా యొక్క ఉండవచ్చనే అంచనా ఉన్న సందర్భంలో పిట్ బుల్ జాతి కుక్కలతో సహా అన్ని గుండ్రని మూతిగల కుక్కల రవాణా నిషేధము.[55]

వీటిని కూడా చూడండిసవరించు

Lua error in package.lua at line 80: module 'Module:Portal/images/d' not found.

 • యునైటెడ్ స్టేట్స్ లో నమోదైన ప్రమాదకర కుక్క కాట్ల జాబితా

సూచనలుసవరించు

 1. "An Act to amend the Dog Owners' Liability Act to increase public safety in relation to dogs, including pit bulls, and to make related amendments to the Animals for Research Act". Government of Ontario, Canada. 2005-08-29. Retrieved 2010-07-05. Cite web requires |website= (help)
 2. "Revised Municipal Code – City and County of Denver, Colorado". City of Denver, Colorado. 2009-05-19. Retrieved 2010-07-05. Cite web requires |website= (help)
 3. "Veterinary Conditions for the importation of dogs/cats for countries under Category A (1/4)" (PDF). Agri-Food and Veterinary Authority of Singapore. 2008-08-04. Retrieved 2009-08-04. Cite web requires |website= (help)
 4. "Pit Bull Information". Franklin County, Ohio. Retrieved 2010-07-30. Cite web requires |website= (help)
 5. Department for Environment, Food and Rural Affairs (2009-03). "Dangerous Dogs Law: Guidance for Enforcers" (PDF). Retrieved 2010-08-07. Cite web requires |website= (help); Check date values in: |date= (help)
 6. "U.S. pet ownership statistics". Humane Society of the United States. 2009-12-30. Retrieved 2010-08-15. Cite web requires |website= (help)
 7. 7.0 7.1 7.2 "Breeds of dogs involved in fatal human attacks in the United States between 1979 and 1998" (PDF). Centers for Disease Control and Prevention. 2008-04-01. Retrieved 2009-07-08. Cite web requires |website= (help)
 8. "Decade of adoption focus fails to reduce shelter killing" (PDF). Animal People News. 6 (XIX). July/August 2009. pp. 8–10. Retrieved 2009-10-24. Check date values in: |date= (help)
 9. 9.0 9.1 9.2 "American Pit Bull Terrier". United Kennel Club (UKC). 2008-11-01. Retrieved 2009-08-07. Cite web requires |website= (help)
 10. "Pit Bull Cruelty". American Society for the Prevention of Cruelty to Animals (ASPCA). 2010. Retrieved 2010-07-05. Cite web requires |website= (help)
 11. Palika, Liz (2006-01-31). American Pit Bull Terrier: Your Happy Healthy Pet. Howell Book House. ISBN 978-0471748229. Retrieved 2010-03-01.
 12. "Dog Fighting FAQ". American Society for the Prevention of Cruelty to Animals (ASPCA). 2009. Retrieved 2009-08-16. Cite web requires |website= (help)
 13. Stahlkuppe, Joe (2000-09-01). accessdate=2010-03-01 American Pit Bull Check |url= value (help). Complete Pet Owner's Manual. Barron's Educational Series. ISBN 978-0764110528. Missing pipe in: |url= (help)
 14. "Cool K-9 Popsicle retires". U.S. Customs Today. 38 (10). 2002. Retrieved 2009-08-07. Unknown parameter |month= ignored (help)
 15. Lewin, Adrienne Mand (October 12, 2005). "Protecting the Nation – One Sniff at a Time". ABC News. Retrieved 2009-02-02. Cite news requires |newspaper= (help)
 16. Simon, Scott (2008-06-21). "Trainer turns pit bull into therapy dog". National Public Radio. Retrieved 2009-08-07. Cite web requires |website= (help)
 17. 17.0 17.1 "Break Stick Information". Pit Bull Rescue Central. 2008. Retrieved 2009-08-16. Cite web requires |website= (help)
 18. "Dog Fighting Fact Sheet". Humane Society of the United States. 2009. Retrieved 2009-08-07. Cite web requires |website= (help)
 19. 19.0 19.1 Swift, E.M. (1987-07-27). "The pit bull: friend and killer". Sports Illustrated. 67 (4). Retrieved 2009-12-02.
 20. Baker, Al; Warren, Mathew R. (2009-07-09). "Shooting highlights the risks dogs pose to police, and vice versa". The New York Times. New York, NY. Retrieved 2010-01-07.
 21. "'Dangerous dogs' weapon of choice". BBC News. 2009-12-02. Retrieved 2009-12-02. Cite news requires |newspaper= (help)
 22. Cothran, George (1997-06-11). "Shouldn't we just kill this dog?". San Francisco Weekly. San Francisco, CA. Retrieved 2009-09-04.
 23. "Bring breeders of high-risk dogs to heel". Animal People News. 2004-01. Retrieved 2009-09-04. Check date values in: |date= (help)
 24. Haberman, Clyde (2004-01-13). "NYC; Rebrand Fido? An idea best put down". The New York Times. New York, NY. Retrieved 2009-09-04.
 25. Laurence, Charles (2004-01-04). "Q: When is a pit bull terrier not a pit bull terrier? A: When it's a patriot terrier". The Daily Telegraph. London, UK. Retrieved 2009-11-14.
 26. 26.0 26.1 "American Staffordshire Terrier History". American Kennel Club. 2009. Retrieved 2010-07-24. Cite web requires |website= (help)
 27. 27.0 27.1 27.2 Clark, Ross D., DVM; Stainer, Joan R.; Haynes, H. David, DVM; Buckner, Ralph, DVM; Mosier, Jacob, DVM; Quinn, Art J., DVM, సంపాదకులు. (1983). Medical & Genetic Aspects of Purebred Dogs. Edwardsville, KS: Veterinary Medicine Publishing. p. 27. ISBN 978-0964160903.
 28. 28.0 28.1 28.2 Lee, Clare (2000-09). Staffordshire Bull Terrier. Pet Owner's Guide Series. Ringpress Books. ISBN 978-1860540820. Retrieved 2010-03-01. Check date values in: |date= (help)
 29. "Staffordshire Bull Terrier History". American Kennel Club. 2009. Retrieved 2009-08-03. Cite web requires |website= (help)
 30. "Toledo v. Tellings, 114 Ohio St.3d 278, 2007-Ohio-3724" (PDF). Supreme Court of Ohio. Retrieved 2009-06-29. Cite web requires |website= (help)
 31. "Certeriorari – Summary Dispositions (Order List: 552 U.S.)" (PDF). United States Supreme Court. 2008-02-19. Retrieved 2009-08-03. Cite web requires |website= (help)
 32. "Cochrane v. Ontario (Attorney General), 2008 ONCA 718" (PDF). Ontario Court of Appeal. 2008-10-24. Retrieved 2009-07-21. Cite web requires |website= (help)
 33. 33.0 33.1 "Who let the dogs out?". Center for Constitutional Studies, University of Alberta, Canada. 2009-06-12. Retrieved 2009-07-21. Cite web requires |website= (help)
 34. Szuchman, Paula (2009-09-18). "Beagle or Bichon: Can Dog Drool Provide Insight?". The Wall Street Journal. New York, NY. Retrieved 2009-11-16.
 35. "Toledo v. Tellings, -REVERSED-, 2006-Ohio-975, ¶25" (PDF). Court of Appeals of Ohio, Sixth Appellate District. Retrieved 2009-10-02. Cite web requires |website= (help)
 36. Frazho, J.K.; Tano, C.A.; Ferrell, E.A. (2008-09-01). "Diagnosis and treatment of dynamic closed-mouth jaw locking in a dog". Journal of the American Veterinary Medical Association. 233 (5): 748–751. doi:10.2460/javma.233.5.748. PMID 18764710. Retrieved 2009-10-01.
 37. "Breaking up a fight". Pit Bull Rescue Central. 2008. Retrieved 2009-08-16. Cite web requires |website= (help)
 38. "Pros and cons of owning a pit bull". Bay Area Doglovers Responsible About Pitbulls (BADRAP). 2007. Retrieved 2009-08-16. Cite web requires |website= (help)
 39. "Breeds of dogs involved in fatal human attacks in the United States between 1979 and 1998" (PDF). Centers for Disease Control and Prevention. 2000-09-15. Retrieved 2009-07-08. Cite web requires |website= (help)
 40. "Dog Bite: Fact Sheet". Centers for Disease Control and Prevention. 2008-04-01. Retrieved 2009-07-08. Cite web requires |website= (help)
 41. Raghavan, Malathi (June 2008). "Fatal dog attacks in Canada, 1990–2007". The Canadian Veterinary Journal (La Revue vétérinaire canadienne). 49 (6): 577–581. PMC 2387261. PMID 18624067.
 42. "Animal People". Retrieved 2009-07-13. Cite web requires |website= (help)
 43. 43.0 43.1 43.2 "Dog attack deaths and maimings, US & Canada, September 1982 – December 22, 2009". 2009-12-22. Retrieved 2010-01-06. Cite web requires |website= (help)
 44. యునైటెడ్ స్టేట్స్ లో కుక్క కాటుల వలన సంభవించిన మరణాల జాబితాలో గుర్తించబడిన మరణాలను ఈ క్రింది పట్టిక సూచిస్తుంది. ప్రతి సూచికను ఈ ప్రస్తుత వ్యాసంలోనే సూచించడం కాకుండా నివేదించబడిన ప్రతి మరణానికి వ్యక్తిగత సూచిక ఇవ్వబడింది.
 45. 45.0 45.1 "Dog Bite Liability". Insurance Information Institute. 2009-09. Retrieved 2009-09-24. Cite web requires |website= (help); Check date values in: |date= (help)
 46. "Homeowners Insurance Available to Breeds Previously Excluded with CGC Certification". American Kennel Club. 2004-10-01. Retrieved 2009-02-04. Cite web requires |website= (help)
 47. "Ohio Revised Code, Chapter 955 (Dogs)". State of Ohio. 2008-06-15. Retrieved 2009-07-22. Cite web requires |website= (help)
 48. Ganz, Katy (2009-03-19). "Counties have special rules for pit bulls". The Daily Record. Wooster, Ohio. Retrieved 2009-09-24.
 49. Sodergren, Brian. "Insurance companies unfairly target specific dog breeds". Humane Society of the United States. Retrieved 2009-08-12. Cite web requires |website= (help)
 50. "Frequently asked questions". Air France. Retrieved 2010-01-11. Cite web requires |website= (help)
 51. "Traveling with pets". Alaska Airlines. Retrieved 2009-08-12. Cite web requires |website= (help)
 52. "Traveling with pets". American Airlines. Retrieved 2009-08-12. Cite web requires |website= (help)
 53. "British Airways Pet Policy". British Airways. Retrieved 2010-01-11. Cite web requires |website= (help)
 54. 54.0 54.1 "Restrictions". Continental Airlines. Retrieved 2009-08-12. Cite web requires |website= (help)
 55. "Pet Travel Requirements and Restrictions". Delta Airlines. Retrieved 2010-09-07. Cite web requires |website= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=పిట్_బుల్&oldid=2435765" నుండి వెలికితీశారు