పిపెట్ (pipette, pipet, pipettor) ఒక ప్రయోగశాలలో ఉపయోగించే సామాన్యమైన పరికరం. దీనితో నిర్ధిష్టమైన పరిమాణంలో ద్రవాల్ని వివిధ ప్రయోగాల కోసం తీసుకొనే వీలుంటుంది. వీటిని గాజుతో కాని ప్లాస్టిక్ తోకాని చేయుదురు.ప్రయోగశాలలో ఒక నిర్దిష్టమైన ఘనపరిమాణంలో (volume) ఏదైన ద్రవ రసాయనాన్ని తీసుకొనుటకు పిపెట్ ను వినియోగిస్తారు. గాఢమైన ద్రవ ఆమ్లాలను, క్షారాలను వాడునప్పుడు గాజుతో చేసిన పిపెట్ ను వాడెదరు. సాధారణ ద్రవాలకు, ప్లాస్టిక్‍తో చర్య జరపని సాల్వెంట్ లకు ప్లాస్టిక్ పిపెట్ ను వాడెదరు.

A selection of pipettes
బల్బ్, విభజన పిపెట్ లు.గాజువి.

పిపెట్ రకాలు

మార్చు

పిపెట్ మూడు రకాలు.

1. బల్బ్ పిపెట్ (Bulb pipette)

2. విభజనలున్న పిపెట్ (Graduated pipette)

3.సిరంజి వంటి పిపెట్‍లు

1. బల్బ్ పిపెట్

బల్బ్ పిపెట్ లో మధ్యలో ఉబ్బెత్తుగా వర్తులాకారం (cylindrical) గా వుండి ఇరువైపుల సన్నని గొట్టం వుండును. ఒక గొట్టం చివర దగ్గరగా నొక్కబడి వుండి సన్నని రంధ్రం వుండును. ఈ రంధ్రం ద్వారా పిపెట్ లోనికి ద్రవాన్ని నింపడం, పిపెట్ లోని ద్రవాన్నికావలసిన పదార్థం/ద్రవం/ఫ్లాస్కులో కలుపుట చేయుదురు. పిపెట్ రెండొగొట్టం పైభాగం సమమైన రంధ్రంవుండి తెరచుకొని వుండును. దీని ద్వారా ద్రవాన్ని పిప్పెట్ లోకి పిల్చుట జరుగును. పిపెట్ లోకి ద్రవాని రెండొచివర నోటిని వుంచి పీర్చడం కాని లేదా రబ్బరు బల్బును (బి.పి.మీటరులో వాడె వంటిది) వాడెదరు. ప్రమాదకరం కాని వాటిని నోటితో పిల్చెదరు. ఘాటైన వాటిన్ ఆమ్లాలను, క్షారాలకు రబ్బరు బల్బ్ వాడెదరు. పిపెట్ లు అవసరాన్ని బట్టి వివిధ ఘనపరిమాణాలను ( 5,10,15, 20, 25, 50 మి.లీ ) వుండును. పిపెట్ లో నోటితో పిల్చువైపు ఒక మార్కు/గుర్తు వుండును. ఆ గుర్తు వరకు ద్రవాన్ని నింపిన ఆ పిపిట్ మీద ముద్రించిన ఘనపరిమాణముకు సమానం అగును. మొదట ఆ మార్కు కన్న ఎక్కువ ద్రావాన్ని పిపెట్ లోకి పీల్చడం జరుగుతుంది. తరువాత బొటన వేలుతో పై రంధ్రాన్ని మూసి వుంచి, నెమ్మదిగా బొటన వేలును వదులు చెయ్యడం ద్వారా ద్రవం మార్కు వద్దకు వచ్చునట్లు చేసి, బొటనవేలును గట్టిగా నొక్కి వుంచి, ద్రావణాన్ని చెర్చవలసిన ఫ్లాస్కులో వుంచి, బొటన వేలును తీసిన ద్రవం అందులో పడును. పిపెట్ ద్వారా కచ్చితమైన పరిమాణంలో ద్రవాన్ని తీసుకొవటం సాధ్యం అవుతుంది. కొలజాడి (measuring cylinder) అయ్యిన కొంచెం తేడా వుండును. బల్బ్ పిపెట్ ద్వారా ఒక నిర్ధిష్టమైన ఘనపరిమానమున్న ద్రవాన్ని తీసుకో వచ్చును (10,15,25మి.లీ ఇలా).

2. విభజనలున్న పిపెట్ :

ఈ రకం పిపెట్ మొత్తం ఒకే వ్యాసంలో వుండి ఏకరీతి రంధ్రం కలిగి వుండును. గొట్టం క్రిందమాతం దగ్గరిగా నొక్కబడివుండును. ఎక రీతిగా వున్న గొట్టం మీద మి.లీ. విభజన రేఖలు వుండును.గొట్ట పై వైపునుండి దిగువకు విభజన రేఖలుండును. మొదట సున్న మార్కు వరకు ద్రావాన్ని తీసుకొని, బోటనవేలుతో పై రంధ్రాన్ని మూసి, తరువాత నెమ్మదిగా వేలును వదుచేస్తూ, బిగువగా నొక్కుచూ కావలసిన ఘనపరిమాణాన్ని ఫ్లాస్కులో వదల వచ్చును.

3.సిరంజి వంటి పిపెట్‍లు

ఈ రకం పిపెట్ లలో దిగువన సన్నని రంధ్రం వున్న సూది వంటి భాగం పైన వెడల్పాటి వర్తులాకార భాగం వుండి, లోపల బిగుతుగా కదిలే పిస్టన్ వుండును.పిస్టనును పైకి క్రిందకు నొక్కడం ద్వారా ద్రవాన్ని పిపెట్ లోకి తీసుకోవడం, వదలటం చేయుదురు.

"https://te.wikipedia.org/w/index.php?title=పిపెట్&oldid=4080026" నుండి వెలికితీశారు