పిశుపాటి విశ్వేశ్వరశాస్త్రి

సంస్కృతాంధ్రాలలో మహాపండితుడైన పిశుపాటి విశ్వేశ్వరశాస్త్రి పరాభవ నామ సంవత్సరం చైత్ర బహుళ విదియ బుధవారం నెల్లూరుమండలం కరవది లో సీతారామయ్య,కనకమ్మలకు జన్మించాడు. నెల్లూరు వెంకటగిరి రాజా కళాశాలలో తెలుగు లెక్చరర్ గా పనిచేశారు. ’’ఆశుకవికేసరి", "శతావధాని’’ బిరుదులు పొందాడు. మహా భాష్యంత వ్యాకరణ వేత్త. శంకర ప్రస్తాన త్రయాన్ని ఆకళింపు చేసుకున్న వేదాంతి. మంత్రశాస్త్ర ప్రవీణుడు. మధుర కృష్ణమూర్తిశాస్త్రి, రేవూరి అనంత పద్మనాభరావు, చల్లా రాధాకృష్ణ శర్మ మొదలైనవారు ఇతని శిష్యులు.

రచనలుసవరించు

  1. శ్రీరత్నపాంచాలిక(నాటిక)
  2. శ్రీ కాళిదాస కవితా వైభవము