పి.నర్సారెడ్డి
పొద్దుటూరి నర్సారెడ్డి (1931 సెప్టెంబరు 22 - 2024 జనవరి 29) భారత జాతీయ స్వాంతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, పార్లమెంటు సభ్యుడు. ఇతడు ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గంనుండి 9వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించాడు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు.[1][2]
పి.నర్సారెడ్డి | |
---|---|
పార్లమెంట్ సభ్యుడు, 9వ లోక్‌సభ | |
In office డిసెంబర్ 1989 – మార్చి 1991 | |
అంతకు ముందు వారు | సి.మాధవరెడ్డి |
తరువాత వారు | అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి |
నియోజకవర్గం | ఆదిలాబాదు |
శాసనసభ సభ్యుడు, 5వ అసెంబ్లీ | |
In office మార్చి 1972 – మార్చి 1978 | |
అంతకు ముందు వారు | పి.నర్సారెడ్డి |
తరువాత వారు | పి.గంగారెడ్డి |
నియోజకవర్గం | నిర్మల్ |
శాసనసభ సభ్యుడు, 4వ అసెంబ్లీ | |
In office మార్చి 1967 – మార్చి 1972 | |
అంతకు ముందు వారు | పి.నర్సారెడ్డి |
తరువాత వారు | పి.నర్సారెడ్డి |
నియోజకవర్గం | నిర్మల్ |
శాసనసభ సభ్యుడు, 3వ అసెంబ్లీ | |
In office మార్చి 1962 – మార్చి 1967 | |
అంతకు ముందు వారు | కోరిపల్లి ముత్యంరెడ్డి |
తరువాత వారు | పి.నర్సారెడ్డి |
నియోజకవర్గం | నిర్మల్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1931 సెప్టెంబరు 22 నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా (తెలంగాణా) |
మరణం | 2024 జనవరి 29 హైదరాబాదు, తెలంగాణ | (వయసు 92)
జాతీయత | India |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | కౌసల్యాదేవి |
సంతానం | 3 కుమారులు & 1 కుమారె. |
తల్లిదండ్రులు | పి.గంగారెడ్డి (తండ్రి) |
నివాసం | ఆదిలాబాద్ & న్యూ ఢిల్లీ |
కళాశాల | ఉస్మానియా విశ్వవిద్యాలయం |
నైపుణ్యం | వ్యవసాయవేత్త, న్యాయవాది & రాజకీయవేత్త |
సభలు | అనేక కమిటీలలో సభ్యుడు |
ప్రారంభ జీవితం, విద్యాభ్యాసం
మార్చుఇతడు ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ పట్టణంలో 1931, సెప్టెంబర్ 22వ తేదీన జన్మించాడు. ఇతడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివి బి.ఎ., ఎల్.ఎల్.బి. పట్టాలు పొందాడు. వృత్తి రీత్యా ఇతడు వ్యవసాయదారుడు, న్యాయవాది.[1]
రాజకీయ జీవితం
మార్చుస్వాతంత్ర్యానికి ముందు
మార్చుఇతడు నిజాం నిరంకుశ పరిపాలన నుండి హైదరాబాదు విముక్తి కోసం పోరాడిన స్వాతంత్ర్య సమర యోధుడు.
స్వాతంత్ర్యం తర్వాత
మార్చుఇతడు 1940వ దశకం ప్రారంభం నుండి క్రియాశీల రాజకీయాలలో పాల్గొన్నాడు. ఇతడు మూడు పర్యాయాలు నిర్మల్ శాసనసభ నియోజకవర్గం నుండి శాసన సభ సభ్యుడిగా[3], ఒక పర్యాయం శాసన మండలి సభ్యునిగా, ఒక పర్యాయం ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనాడు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా కూడా పనిచేశాడు[1][4][5][6]
పదవులు
మార్చు# | నుండి | వరకు | హోదా | వ్యాఖ్య |
---|---|---|---|---|
01 | 1962 | 1967 | సభ్యుడు, 3వ అసెంబ్లీ | |
02 | 1962 | 1964 | చైర్మన్, తెలంగాణ అభివృద్ధి కమిటీ | |
03 | 1967 | 1972 | సభ్యుడు, 4వ అసెంబ్లీ | |
04 | 1968 | 1968 | సభ్యుడు, నిబంధనల కమిటీ | |
05 | 1972 | 1978 | సభ్యుడు, 5వ అసెంబ్లీ | |
06 | 1973 | 1978 | కేబినెట్ మంత్రి, నీటి పారుదల శాఖ (రాష్ట్ర ప్రభుత్వం) | |
07 | 1974 | 1978 | కేబినెట్ మంత్రి, రెవెన్యూ & శాసన సభా వ్యవహారాలు (రాష్ట్ర ప్రభుత్వం) | |
08 | 1981 | 1985 | సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి | |
09 | 1982 | 1985 | సభ్యుడు, ప్రభుత్వ హామీల కమిటీ | |
10 | 1989 | 1991 | సభ్యుడు, 9వ లోక్‌సభ | |
11 | 1990 | 1991 | సభ్యుడు, విజ్ఞాపనల కమిటీ | |
12 | 1990 | 1991 | సంప్రదింపుల కమిటీ, కార్మిక మంత్రిత్వశాఖ | |
14 | 1990 | 1991 | సంప్రదింపుల కమిటీ, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ |
మరణం
మార్చుఅనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 92 ఏళ్ల పి. నర్సారెడ్డి 2024 జనవరి 29న హైదరాబాదులో తుదిశ్వాస విడిచాడు.[7]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "Member Profile". Lok Sabha website. Archived from the original on 24 సెప్టెంబరు 2014. Retrieved 17 January 2014.
- ↑ "Election Results 1989" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 18 జూలై 2014. Retrieved 17 January 2014.
- ↑ Sakshi (14 October 2023). "నిర్మల్ నుంచి 'పొద్దుటూరి, 'సముద్రాల'." Archived from the original on 29 January 2024. Retrieved 29 January 2024.
- ↑ "Third Andhra Pradesh Legislative Assembly". Andhra Pradesh Legislature. Archived from the original on 7 డిసెంబరు 2013. Retrieved 17 January 2014.
- ↑ "Fourth Andhra Pradesh Legislative Assembly". Andhra Pradesh Legislature. Archived from the original on 3 August 2012. Retrieved 17 January 2014.
- ↑ "Fifth Andhra Pradesh Legislative Assembly". Andhra Pradesh Legislature. Archived from the original on 13 మార్చి 2013. Retrieved 17 January 2014.
- ↑ "కాంగ్రెస్ సీనియర్ నేత పి.నర్సారెడ్డి కన్నుమూత |". web.archive.org. 2024-01-29. Archived from the original on 2024-01-29. Retrieved 2024-01-29.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)