పి.విష్ణువర్ధన్ రెడ్డి
పి. విష్ణువర్ధన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం నుండి రెండ్లు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయనకు 2008, డిసెంబరు 3న శృతితో వివాహం జరిగింది.
పి.విష్ణువర్ధన్ రెడ్డి | |
---|---|
శాసనసభ్యుడు (ఎమ్మెల్యే) | |
నియోజకవర్గం | జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 8 ఫిబ్రవరి 1981 హైదరాబాద్, తెలంగాణ. |
మరణం | హైదరాబాద్ |
రాజకీయ పార్టీ | బీఆర్ఎస్ |
ఇతర రాజకీయ పదవులు | భారత జాతీయ కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | శృతి[1] |
బంధువులు | గాయత్రి రెడ్డి, అనురాగిణి రెడ్డి, పి. విజయా రెడ్డి, పావని రెడ్డి |
నివాసం | ఇంటి నెం 1-2-412/10, ఇందిరా నిలయం, గగనమహల్ కాలనీ, హిమాయత్ నగర్, హైదరాబాద్ |
రాజకీయ నేపథ్యం
మార్చుపి. విష్ణువర్ధన్ రెడ్డి తన తండ్రి ఎమ్మెల్యే పి.జనార్ధనరెడ్డి హఠాన్మరణంతో రాజకీయాల్లోకి వచ్చాడు. 2004లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి రికార్డు మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]
శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2014లో కొత్తగా ఏర్పడ్డ జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చేతిలో ఓటమిపాలయ్యాడు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చేతిలో 16,004 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
విష్ణు వర్ధన్ రెడ్డి 2023లో జరిగే శాసనసభ ఎన్నికల్లో జూబ్లిహిల్స్ స్థానం నుంచి టిక్కెట్ ఆశించినా రెండో జాబితాలో పేరు దక్కకపోవడంతో ఆయన అక్టోబర్ 30న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి[3], అక్టోబర్ 31న తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరాడు.[4]
మూలాలు
మార్చు- ↑ "Vishnuvardhan Reddy gets married". 12 December 2008. Archived from the original on 12 ఏప్రిల్ 2019. Retrieved 21 April 2019.
- ↑ timesofindia, S (15 April 2014). "Vishnuvardhan Reddy eyes a hat-trick in Jubilee Hills | Hyderabad News - Times of India". The Times of India. Archived from the original on 6 ఏప్రిల్ 2021. Retrieved 6 April 2021.
- ↑ Eenadu (30 October 2023). "Vishnuvardhan Reddy: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విష్ణువర్ధన్ రెడ్డి". Archived from the original on 31 October 2023. Retrieved 31 October 2023.
- ↑ Sakshi (31 October 2023). "కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన నాగం, విష్ణువర్ధన్ రెడ్డి". Archived from the original on 31 October 2023. Retrieved 31 October 2023.