పి.వి. రంగారామ్ (జూలై, 1900 - 1947) ప్రముఖ రంగస్థల నటుడు, నాటక రచయిత, విమర్శకుడు, న్యాయవాది.[1]

పి.వి. రంగారామ్
జననంజూలై, 1900
మరణం1947
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల నటుడు

జననం - విద్యాభ్యాసం మార్చు

రంగారామ్ 1900, జూలై లో జన్మించాడు. విద్యాభ్యాసం విజయనగరం, మదరాసు లలో జరిగింది.

ఉద్యోగం మార్చు

1941లో జిల్లా మునసబుగా నియమితుడై 1945లో సబ్-జడ్డి పదవిని చేపట్టాడు. 1927 నుంచి 1930 వరకు మదరాసు ఆంధ్ర మహాసభకు కార్యదర్శిగా వ్యవహరించాడు. యుద్ధకాలంలో ప్రాంతీయ యుద్ధనిధి డైరెక్టర్ గా పనిచేశాడు.

రంగస్థల ప్రస్థానం మార్చు

మదరాసులో ఉన్నప్పుడే ఇబ్సన్, పి.వి. రాజమన్నార్‌, కూర్మా వేణు గోపాలస్వామి ప్రభావం రంగారామ్ పై పడింది. విద్యార్థి రోజుల్లోనే అనేక నాటకాల్లో నటించాడు. ఇబ్సన్ స్పూర్తితో 1931లో ఈయన రచించి ప్రచురించిన దంపతులు నాటకం ఆంధ్రనాటకరంగంలో కొత్త మలుపు తీసుకువచ్చింది. కె.వి.గోపాలస్వామితో కలిసి ఇబ్సన్ డాల్స్ హౌస్ నాటకంను బొమ్మరిల్లు పేరుతో తెలుగులోకి అనువదించాడు.

నటించినవి:

  1. కన్యాశుల్కం
  2. ప్రతాపరుద్రీయం
  3. బొబ్బిలి

రచించినవి

  1. దంపతులు
  2. బొమ్మరిల్లు

మరణం మార్చు

రంగారామ్ 1947 లో ఆత్మహత్య చేసుకున్నాడు.

మూలాలు మార్చు

  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.480.