పర్వతనేని ఉపేంద్ర

పార్లమెంటు సభ్యుడు
(పి. ఉపేంద్ర నుండి దారిమార్పు చెందింది)

పర్వతనేని ఉపేంద్ర (సెప్టెంబర్ 27, 1936 - నవంబర్ 17, 2009) మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి.

పర్వతనేని ఉపేంద్ర
పర్వతనేని ఉపేంద్ర


నియోజకవర్గం విజయవాడ

వ్యక్తిగత వివరాలు

జననం (1936-09-27)1936 సెప్టెంబరు 27
పోతునూరు,తూర్పు గోదావరి జిల్లా
మరణం 2009 నవంబరు 17(2009-11-17) (వయసు 73)
రాజకీయ పార్టీ తెలుగు దేశం
భారత జాతీయ కాంగ్రెసు
ప్రజారాజ్యం
సంతానం ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె
నివాసం విజయవాడ
మతం హిందూ మతము

ఇతను తూర్పు గోదావరి జిల్లాలోని పోతునూరు గ్రామంలో జన్మించాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ. పట్టాను పొందాడు. రైల్వే మంత్రిత్వ శాఖలో కలకత్తాలో జాయింట్ డైరెక్టర్ గా పనిచేశాడు. జనతా పార్టీ లోని మధుదండావతే రైల్వే మంత్రిగా ఉన్నసమయంలో 1977-79లో స్పెషల్ అసిస్టెంట్ గా పేరుపొందాడు.

తెలుగు దేశం పార్టీ స్థాపించిన తొలి రోజుల్లో కార్యదర్శిగా పార్టీ రూపురేఖలు తీర్చి దిద్దడంలో నందమూరి తారక రామారావుకు సహకరించి మంచి పేరు సంపాదించాడు. 1984 నుండి 1990 ల మధ్య రాజ్యసభ సభ్యుడిగా తెలుగు దేశం పార్టీ నాయకులుగా వ్యవహరించాడు. 1989లో జనతాదళ్ ప్రభుత్వ నేతృత్వంలో విశ్వనాధ ప్రతాప్ సింగ్ మంత్రివర్గంలో ఇతను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖను చేపట్టి (1989 - 1990) సమర్ధవంతంగా నిర్వహించాడు. ఆ కాలంలో ప్రసార భారతి బిల్లు ప్రవేశ పట్టడంలోకీలక పాత్ర వహించాడు. 1990లో తిరిగి రాజ్యసభ సభ్యులయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరి 1996, 1998లలో విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం నుండి 11వ, 12వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు. 2009 ఎన్నికల ముందు ఇతను ప్రజా రాజ్యం పార్టీలో చేరాడు. తన రాజకీయ అనుభవాల గురించి ఇతను "గతం స్వగతం" అనే పుస్తకాన్ని రచించాడు.

ఇతను 2009, నవంబర్ 17 తేదీన పరమపదించాడు.[1] ఇతనికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. ప్రముఖ రాజకీయ నాయకుడు లగడపాటి రాజగోపాల్ ఇతని అల్లుడు.

మూలాలు

మార్చు