పి. కుమార్ వాసుదేవ్

పి. కుమార్ వాసుదేవ్ (1936 జూన్ 21 - 1998 అక్టోబరు 31) భారతీయ టెలివిజన్ రంగంలో తన పనికి ప్రసిద్ధి చెందిన భారతీయ దర్శకుడు.[2][3] ఆయన దర్శరత్వంలో వచ్చిన హమ్ లాగ్, డిడి1లో ప్రసారం చేయబడింది. ఇది భారతదేశపు మొట్టమొదటి సోప్ ఒపెరా. అలాగే, ఆసియాలోనే మొదటి సీరియల్ డ్రామా సిరీస్.[4][5]

పి. కుమార్ వాసుదేవ్
జననం(1936-06-21)1936 జూన్ 21 [1]
మరణం1998 అక్టోబరు 31(1998-10-31) (వయసు: 62)
జాతీయతభారతీయుడు
విద్యాసంస్థఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
వృత్తిదర్శకుడు

కెరీర్

మార్చు

మల్లాది వెంకట కృష్ణమూర్తి రచించిన తెలుగు నవల రేపటి కొడుకు ఆధారంగా వాసుదేవ్ పెద్ద తెరపై నిర్మించిన చిత్రం 'కున్వరి బహు' (1984). ఆయన హమ్ లాగ్ టెలీవిజన్ ధారావాహిక రూపొందించాడు. గణదేవ అనే తారాశంకర్ బంద్యోపాధ్యాయ 1942 నాటి బెంగాలీ నవల గణదేవ టెలివిజన్ వెర్షన్. ఇందులో రోహిత్ ఓర్హి ప్రధాన పాత్ర పోషించాడు.[6] ఇందులో రూపా గంగూలీ, అంజుల్ చతుర్వేది కూడా నటించారు. ఈ సిరీస్ గంగూలీకి జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టింది.[7][8]

కుమార్ వాసుదేవ్ స్వల్ప అనారోగ్యంతో 1998 అక్టోబరు 31న భారతదేశంలోని పూణేలో మరణించాడు.[9] ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.[9]

మూలాలు

మార్చు
  1. Firoz, Md. (2005). Television in India (in ఇంగ్లీష్). India: Saad Publication. ISBN 9788190257206.
  2. FRONTLINE, TEAM (2022-08-15). "1984: First TV soap 'Hum Log' aired". Frontline (in ఇంగ్లీష్). Retrieved 2025-02-22.
  3. "30 years on, why Hum Log is still relevant". India Today (in ఇంగ్లీష్). 2014-07-07. Retrieved 2025-02-22.
  4. Saxena, Pooja (2014-07-21). "Hum Log: Revisiting that 80's show". Hindustan Times. Retrieved 2016-06-01.
  5. Jayaram, Rahul (6 July 2008). "The soap that gripped the nation". Hindustan Times. Archived from the original on 3 August 2008. Retrieved 1 June 2016.
  6. "Taking centre stage". Outlook Business (in ఇంగ్లీష్). 2015-03-06. Retrieved 2025-02-23.
  7. "Mahabharat's 'Draupadi' Roopa Ganguly ARRESTED: Her Journey From Stardom To Scandal". Times Now (in ఇంగ్లీష్). 2024-10-03. Retrieved 2025-02-22.
  8. "Roopa Ganguly aka Draupadi of 'Mahabharat' fame arrested during protest over schoolboy's death in Kolkata; later granted bail". The Times of India. 2024-10-03. ISSN 0971-8257. Retrieved 2025-02-22.
  9. 9.0 9.1 "Producer(sic) of "Hum Log" dead". www.tribuneindia.com. United News of India (UNI). Tribune India. 1 November 1998. Retrieved 2016-06-01.{{cite web}}: CS1 maint: others (link)