పీ.వీ.ఎల్. నరసింహరాజు

పీ.వీ.ఎల్. నరసింహరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా సహకార సెంట్రల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.[1]

పీవీఎల్‌ నరసింహరాజు (పీవీఎల్‌)

పదవీ కాలం
17 జులై 2021 - 2024
నియోజకవర్గం ఉండి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1961
యండగండి, ఉండి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు పీవీఎల్‌ తిమ్మరాజు
వృత్తి రాజకీయ నాయకుడు, పారిశ్రామిక వేత్త

జననం, విద్యాభాస్యం

మార్చు

పీవీఎల్‌ నరసింహరాజు 1961లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి మండలం, యండగండి గ్రామంలో జన్మించాడు. ఆయన డిగ్రీ చదివాడు.

రాజకీయ జీవితం

మార్చు

పీవీఎల్‌ నరసింహరాజు పారిశ్రామిక వేత్తగా తన జీవితాన్ని ప్రారంభించి రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన ఉండి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా, డీసీసీబీ వైస్ డైరక్టర్‌గా పని చేశాడు. పీవీఎల్‌ 1995 నుండి ప్రస్తుతం యండగండి కో–ఆపరేటివ్‌ సొసైటీ చైర్మన్‌గా పని చేస్తున్నాడు. పీవీఎల్‌ నరసింహరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ఉండి నియోజకవర్గ కన్వీనర్‌గా పని చేస్తూ 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 17 జులై 2021న పశ్చిమ గోదావరి జిల్లా సహకార సెంట్రల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు.[2]

నరసింహరాజు 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో ఉండి నియోజకవర్గం నుండి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు చేతిలో 56,421 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

మూలాలు

మార్చు
  1. Sakshi (17 July 2021). "ఏపీ నామినేటెడ్‌ పదవులు దక్కించుకుంది వీరే." Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.
  2. Eenadu (18 July 2021). "జిల్లావాసులకు పదవుల పంట". Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.