పుర్నియా

బీహార్ లోని జిల్లా

పూర్నియా జిల్లా బిహార్ రాష్ట్ర జిల్లాలలో ఒకటి. పూర్నియా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. పూర్నియా డివిషన్‌లో పూర్నియా జిల్లా భాగంగా ఉంది. జిల్లా ఉత్తరంలో ఉన్న గంగానది వైపు విస్తరిస్తూ ఉంది.

Purnia/పుర్నియా జిల్లా

पूर्णिया जिला,ضلع پورنیا
దేశంభారతదేశం
రాష్ట్రంBihar బీహార్
పరిపాలన విభాగముPurnia
ముఖ్య పట్టణంPurnia
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుPurniaపుర్నియా
 • శాసనసభ నియోజకవర్గాలుAmour, Baisi, Kasba, Banmankhi, Rupauli, Dhamdaha, Purnia
విస్తీర్ణం
 • మొత్తం3,229 కి.మీ2 (1,247 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం32,64,619
 • సాంద్రత1,000/కి.మీ2 (2,600/చ. మై.)
జనగణాంకాలు
 • అక్షరాస్యత51.08 per cent
 • లింగ నిష్పత్తి921
ప్రధాన రహదార్లుNH 31, NH 57 , NH107 and NH131A
జాలస్థలిఅధికారిక జాలస్థలి

చరిత్రసవరించు

ముగల్ పాలనా కాలంలో పుర్నియా సైనిక విభాగానికి ఆదాయ వనరుగా ఉండేది. ఇక్కడి ఆదాయం అధికంగా సరిహద్దులను భారతదేశం తూర్పు మరియు ఉత్తర గిరిజనుల నుండి రక్షించడానికి వెచ్చించబడేది. .[1] ఈ భూభాగం రాజప్రతినిధి సిరాజ్- ఉద్- దుల్లాహ్‌ కొలకత్తాను స్వాధీనం చేసుకున్న తరువాత 1757 లో తిరుగుబాటును లేవదీసాడు. 1765లో మిగిలిన కొలకత్తాతో ఈ ప్రాంతం బ్రిటిష్ ఆధీనంలోకి వచ్చింది.[2] 1770 ఫిబ్రవరి 10న ఈస్టిండియా కంపెనీ పుర్నియా జిల్లాను రూపొందించింది.[3]

పుర్నియా జిల్లాలో ఉన్న " రామక్రిష్ణ మిషన్ " ఏప్రిల్ మాసంలో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న దూర్గాపూజ జిల్లాకు ప్రఖ్యాతి తీసుకువస్తుంది. జిల్లాలో ఉన్న " పూర్ణిమాదేవి ఆలయం జిల్లాకు " ప్రత్యేక ఖ్యాతి తీసుకువస్తుంది. ఈ ఆలయం ప్రధాన నగరానికి 5 కి.మీ దూరంలో ఉంది. కొంత మంది ప్రజలు పుర్నియా ఒకప్పటి పూర్ణా అరణ్యమని. ఇది దట్టమైన అరణ్యప్రాంతమని అందుకే ఈ ప్రాంతానికి పుర్నియా అని పేరు వచ్చిందని విశ్వసిస్తున్నారు.

పుర్నియా జిల్లా నుండి 1976లో కతియార్ జిల్లా [4] 1990లో అరారియా జిల్లా విడివడ్డాయి.[4]

భౌగోళికంసవరించు

పుర్నియా జిల్లా వైశాల్యం 3229 చ.కి.మీ.[5] ఇది సొలోమన్ ఇలాండ్స్ లోని మకరియా ద్వీపం వైశాల్యానికి సమానం..[6] హిమాలయాలో జన్మించిన పలు నదులు ఈ జిల్లాలో ప్రవహిస్తూ ఈ జిల్లా భూభాగాన్ని సారవంతం చేస్తున్నాయి. ఇది జిల్లావ్యవసాయానికి మరింతగా సహకరిస్తుంది. జిల్లాలో ప్రధానంగా కోసి నది, మహానందా నది, సువరా కాళీ నది మరియు కొలి నది ప్రవహిస్తున్నాయి. జిల్లా పశ్చిమ భూభాగంలో కోసీ నది ప్రావం కారణంగా భూమి అధికంగా ఇసుకమేటలు వేసి ఉంది. మహానందా మరియు పన్నర్ నదీ జలాలతో జిల్లాలో జనుము మరియు అరటి విస్తారంగా పండించబడుతుంది

ఆర్ధికంసవరించు

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో పుర్నియా జిల్లా ఒకటి అని గుర్తించింది.[7] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[7]

 • వ్యవసాయ ఉత్పత్తులు :- వరి, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలు మరియు గోధుమ. దాదాపు జిల్లాలో సగభాగంలో వరి పండించబడుతుంది. జిల్లాలో పుచ్చ మరియు కూరగాయలు వంటి వాణిజ్య పంటలు పండించబడుతున్నాయి.
 • జిల్లాలోని లైన్ బజార్ వద్ద " అభా కాంప్లెక్స్ " నింర్మించబడింది. డాక్టర్ డి.ఎన్ రాయ్ 65 షాపులు ఆరంభించడానికి ఏర్పాటు చేస్తున్నాడు.

విభాగాలుసవరించు

పూర్నియా జిల్లాలో 4 విభాగాలు ఉన్నాయి : పూర్నియా, బన్మంఖి, బైసి ధందహా. జిల్లాలో 14 మండలాలు ఉన్నాయి. అవి వరుసగా తూర్పు పూర్నియా, క్రిత్యానంద్ నగర్, బన్మంఖి, కస్వా, అముర్, బైంసి, బైసా, ధందహా, బర్హరా కొథి, రూపౌలీ, భవానీపూర్, డగరుయా, జలాల్గర్ మరియు శ్రీనగర్.

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,673,127,[8]
ఇది దాదాపు. మౌరిటానియా దేశ జనసంఖ్యకు సమానం.[9]
అమెరికాలోని. లోవా నగర జనసంఖ్యకు సమం.[10]
640 భారతదేశ జిల్లాలలో. 105 వ స్థానంలో ఉంది..[8]
1చ.కి.మీ జనసాంద్రత. 1014 [8]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 28.66%.[8]
స్త్రీ పురుష నిష్పత్తి. 930:1000 [8]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 64.49%.[8]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

సంస్కృతిసవరించు

మందిరాలుసవరించు

నగరంలో హజారత్ ముస్తాఫా జమాలుల్ హక్యూ బండగీ దర్గా, చిమ్నీ బజార్ ఉన్నాయి. నగర వాసులు ఉర్స్ మేళా జరుపుకుంటారు. ఇది ఈద్- ఉల్- అఝా తరువాత 7 రోజుల తరువాత ఆరంభించి 3 రోజులు జరుపుకుంటారు.దర్గా మరియు ఖాంక్వాహ్ అలియా ముస్తాఫియా ప్రధాన నగరానికి 7 కి.మీ దూరంలో ఉంది. ఇది ఆధ్యాత్మిక, సమూహాల కూటములు మరియు సూఫీయిజానికి కేంద్రంగా ఉంది. ఈప్రాంతానికి 400 సంవత్సరాల చరిత్ర ఉంది. హజరత్ బందగి జౌంపూర్ (ఉత్తరప్రదేశ్) నుండి వచ్చి ఖంక్వాలు మరియు దర్గాలను (పాండవా షరీఫ్, ది బీహార్ షరీఫ్ మొదలైన భారతీయ దర్గాలు) సందర్శించే సమయంలో ఈప్రాంతాన్ని సందర్శించాడు. దర్గా స్థాపించినప్పటి నుండి ఈశాన్య బీహార్ రాష్ట్రంలో సంస్కృతి, విద్య, దయ, లౌకికవాదం మరియు ఆధ్యాత్మిక విస్తరణలో ఈ దర్గా ప్రధానపాత్ర వహించింది. గర్బానిలి (పూర్నియా) సమీపంలో ఉన్న డియోర్హి సమీపంలో ఇప్పటికీ పురాతన సభామండపం శిధిలాలు ఉన్నాయి. ఇది రాజా కాలానంద్ సింగ్‌కు స్వంతమైనదని భావిస్తున్నారు. ఆయన సంతతికి చెందిన వారు ఇప్పటికీ ఇక్కడ నివసిస్తున్నారు.

మూలాలుసవరించు

 1. Purnea District - Imperial Gazetteer of India, v. 20, p. 414
 2. Purnea District - Imperial Gazetteer of India, v. 20, p. 415
 3. The Times of India, Patna Edition Feb 15, 2012
 4. 4.0 4.1 Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
 5. Srivastava, Dayawanti et al. (ed.) (2010). "States and Union Territories: Bihar: Government". India 2010: A Reference Annual (54th సంపాదకులు.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7. |access-date= requires |url= (help)CS1 maint: extra text: authors list (link)
 6. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Retrieved 2011-10-11. Makira 3,190km2 horizontal tab character in |quote= at position 7 (help); Cite web requires |website= (help)
 7. 7.0 7.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. మూలం (PDF) నుండి 2012-04-05 న ఆర్కైవు చేసారు. Retrieved September 27, 2011. Cite web requires |website= (help)
 8. 8.0 8.1 8.2 8.3 8.4 8.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires |website= (help)
 9. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Mauritania 3,681,634 July 2011 est. horizontal tab character in |quote= at position 11 (help); Cite web requires |website= (help)
 10. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Iowa 3,046,355 line feed character in |quote= at position 5 (help); Cite web requires |website= (help)

బయటి లింకులుసవరించు

మూలాలుసవరించు

వెలుపలి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=పుర్నియా&oldid=2807226" నుండి వెలికితీశారు