పులి బిడ్డ 1981 లో వి.మధుసూదన్ రావు దర్శకత్వంలో వచ్చిన తెలుగు స్పోర్ట్స్ డ్రామా చిత్రం. హేరంబ చిత్ర మందిర్ పతాకంపై ఎన్. శేషగిరి రావు నిర్మించాడు. ఈ చిత్రంలో కృష్ణరాజు, శ్రీదేవి ముఖ్య పాత్రల్లో నటించారు.[1] ఇది 1978 లో వచ్చిన కన్నడ చిత్రం తైగే తక్కా మాగాకు రీమేక్. దీన్ని హిందీలో మెయిన్ ఇంటెక్వామ్ లూంగా (1982) గా పునర్నిర్మించారు. సంగీతం చక్రవర్తి అందించాడు. ఈ చిత్రంలో కృష్ణరాజు బాక్సర్‌గా నటించాడు.

పులిబిడ్డ
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.మధుసూదనరావు
నిర్మాణం నాచు శేషగిరిరావు
తారాగణం కృష్ణంరాజు ,
శ్రీదేవి,
సత్యనారాయణ,
అంజలీ దేవి,
సావిత్రి
సంగీతం కె. చక్రవర్తి
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రమణ్యం,
పి.సుశీల
గీతరచన ఆత్రేయ,
వేటూరి సుందరరామ్మూర్తి
ఛాయాగ్రహణం వి.ఎస్.ఆర్ స్వామి
కూర్పు డి. వెంకటరత్నం
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం మార్చు

పాటలు మార్చు

  • కాశీవిశ్వనాథ తండ్రీ విశ్వనాథ , రచన: ఆచార్య ఆత్రేయ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • మనసంతా మంగళవాద్యాలే , రచన: వేటూరి సుందరరామ్మూర్తి , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల
  • వెయ్యి వెయ్యి వంతెన , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • నడుమకున్న లేడీ , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల
  • బుజ్జి పాప , గానం పి సుశీల .

మూలాలు మార్చు

  1. "Puli Bidda (1981) Cast - Actor, Actress, Director, Producer, Music Director". Cinestaan. Retrieved 2020-08-25.