పుల్లనారింజ నూనె
పుల్లనారింజ నూనె ఒక ఆవశ్యక నూనె.ఇది ఒక సుగంధ తైలం కూడా. పుల్లనారింజ నూనె ఓషధ గుణాలున్న నూనె.పుల్లనారింజను ఆంగ్లంలోబెర్గామోట్ (Bergamot) లేదా బెర్గామోట్ ఆరెంజి అంటారు. పుల్లనారింజ పండు మామూలు నిమ్మకాయ కన్న పెద్దగావుండి తోడిమ భాగం ముందుకు వుండి బేరిపండు వలె వుండును.పుల్లనారింజ చెట్టు రూటేసి కుటుంబానికి చెందిన చెట్టు.వృక్షశాస్త్రపేరుసిట్రస్ బెర్గామియా (C. bergamia), సిట్రస్ అరాన్టియం వర్ బెర్గామియా అనికుడా అంటారు.పుల్లనారింజ పందు యొక్క తొక్క (rid) నుండి ఆవశ్యక నూనెను ఉత్పత్తి చేస్తారు. పుల్లనారింజ నూనెను ఔషధంగాను, సుగంధ /పరిమళ ద్రవ్యంగాను ఉపయోగిస్తారు.నూనెను అరోమాథెరపిలో ఉపయోగిస్తారు.పుల్ల నారింజ నూనెను ఎక్కువగా పరిమళ ద్రవ్యాల పరిశ్రమల్లో, టాయిలేట్ లో వాడు పదార్థాల పరిశ్రమల్లో వాడుతారు. అలాగే ఇతర సుగంధ తైలాల్లో మిశ్రమం చేసి కూడా ఉపయోగిస్తారు. అలాగే గ్రే టీకి సువాసన ఇచ్చుటకై పుల్ల నారింజ నూనె ఉపయోగిస్తారు.[1]
పుల్లనారింజ చెట్టు
మార్చుపుల్లనారింజ చెట్టు రూటేసి కుటుంబానికి చెందిన చెట్టు.వృక్షశాస్త్రపేరుసిట్రస్ బెర్గామియా (C. bergamia), సిట్రస్ అరాన్టియం వర్ బెర్గామియా.పుల్ల నారింజ జన్మస్థానం తూర్పు ఆసియా. అక్కడి నుండి యూరోప్కు తీసుకోపోబడినది, యూరోపులో మొదటగా ఇటలీకి తీసుకెళ్లబడింది. అంతే కాకుండా ఐవరీ కోస్ట్, మోరోకో, తునిసియా,, అల్జీరియాకు వ్యాపించింది. పుల్ల నారింజ చెట్టు నాలుగు మీటర్ల ఎత్తువరకు పెరుగును. మృదువైన పచ్చిని ఆకులునుండి, పూలు నక్షత్ర ఆకారంలో వుండును. పుల్లనారింజ పండు చూచుటకు బేరి పండు ఆకారంలో వుండును. పండు ఆకుపచ్చగా వుండి పక్వానికి వచ్చినపుడు పసుపు రంగులోకి మారును.[1] పుల్ల నారింజ యొక్క ఇంగ్లీసు పేరు బేరమోట్ అనునది ఇటలీ లోని బేరమో అను నగరం పేరున ఏర్పడినది. ఇక్కడే మొదటగా పుల్లనారింజ నూనెను అమ్మడం జరిగింది. పుల్లనారింజ చెట్టు ఉష్ణమండల ప్రాంతాల్లో బాగా పెరుగును.
నూనె సంగ్రహణ
మార్చుపండిన, దోరగా వున్న పండ్ల పై తోక్క్లనుండి నూనూనే ఉత్పత్తి చేస్తారు. తొక్క నుండి నూనె దిగుబడి 0.5 %.వరకు వుండును.సాధారణంగా ఆవశ్యక నూనెలను ఎక్కువగా నీటి స్వేదన క్రియ ద్వారా సంగ్రహిస్తారు, అయితే పుల్ల నారింజ నూనెను కోల్డ్ కంప్రెసన్ పద్ధతిలో సంగ్రహిస్తారు.[2] డిస్టీలేసను ద్వారా ఉత్పత్తి చేసిన నూనె నీటి ఆవిరితో సంపర్కం వలన నూనె, యొక సువాసన/ఆరోమా పాడగును.అందువలన నీటిఆవిరి ద్వారా సంగ్రహించిన నూనెను తక్కువ రకపు నూనెగా భావిస్తారు.[3]
పుల్లనారింజ నూనె
మార్చునూనె నిమ్మ వాసనతో రుచికరమైన/spicy వాసన కల్గి వుండును.అంతేకాదు నేరోలి లేదా లావెండరు నూనెను జ్ఞప్తికి తెచ్చును. నూనె రంగు పచ్చగా లేదా పసుపుతో కూడిన పచ్చరంగులో వుండును.నిటి వంటి చిక్కదనం/స్నిగ్థత కల్గి ఉంది.
నూనెలోని రసాయన పదార్థాలు
మార్చుపుల్లనారింజ నూనెలో పలు రసాయన పదార్థాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి ఆల్ఫా –పైనేన్, మైర్సేన్, లిమోనేన్, ఆల్ఫా -బెర్గప్టెన్, బీటా-బిసబోలేన్, లినలూల్, లైనైల్ అసిటేట్, నేరోల్, నేరైల్ అసిటెట్. జెరాన్లోల్, జెరాన్లోల్ అసిటేట్,, ఆల్ఫా టెర్పినియోల్.[1] నూనెలో 95% రసాయనాలు వోలటైల్ పదార్థాలు అనగా తక్కువ ఉష్ణోగ్రతలో ఆవిరిగా మారునవి. మిగిన 5% రసాయనాలు వోలటైలులు కానీ రసాయన సమ్మేళనాలు. నూనెలో టేర్పేనులు, ఈస్టరులు, ఆల్కహాలులు,, అల్డిహైడులు వోలటైల్ రసాయనాలు, వోలటైల్ కానీ పదార్ఠాలు కౌమారిన్స్,, ఫురనో కౌమారిన్స్ వంటి ఆక్సీజెనేటెడ్ హెటెరో సైక్లిక్ సమ్మేళనాలు నూనె లోని వోలటైల్ పదార్థాలు
నూనెలోని వోలటైలులు కాని రసాయన పదార్థాలు
నూనె రసాయనిక భౌతిక విలువలు
మార్చునూనె రసాయనిక భౌతిక లక్షణాలు | కనిష్ఠం | గరిష్ఠం | Unit |
---|---|---|---|
వక్రీభవన సూచిక (20 °C) | 1.4640 | 1.4690 | adim |
దృశ్య భ్రమణం (20 °C) | +15.0 | +34.0 | ° |
సాంద్రత (20 °C) | 0.875 | 0.883 | adim |
ఈస్టరులు (లినైల్ అసిటేట్ గా) | 30 | 45 | % |
బాష్పీభవన అవశిష్టము | 4.50 | 6.50 | % |
CD ( స్పెక్ట్రొ పొటొమెట్రి (Spectrophotometry) analysis) | 0.75 | 1.20 | adim |
నూనె వైద్యగుణాలు
మార్చుబాధానివారిణిగా, ఆందోళన/ వ్యాకులతా నివారిణిగా, (ఆంటీసెప్టిక్) ; చెడకుండ కాపాడు ఔషధముగా, సూక్ష్మజీవనాశకంగా, శూలహరము, శ్వాసహరముగా, జీర్ణకారియైన, ఆకలి పుట్టించేమందుగా, ఇలా పలు ఔషధ గునాలు వున్నవి[1]
ముందు జాగ్రత్తలు
మార్చుసున్నితమైన చర్మ గుణమున్న వారి వొంటి మీద ఈ నూనెను రాసినపుడు సూర్యకాంతి వలన బొబ్బలు వచ్చే అవకాశం ఉంది.ముఖ్యంగా నూనెలో వున్న బెర్గాప్టెన్ అను రసాయనం పోటో-టాక్సిటీటీ (కాంతి వలన క్లాగు విషప్రభావం) కల్గి ఉంది.అందు వలన ఈ నూనెను వొంటికి రాసినపుడు సూర్యకాంతి సోకాకుండా జాగ్రత్త వహించాలి.పుల్ల నారింజ నూనెను నోటి ద్వారా కడుపులోకి తీసుకోరాదు. పుల్ల నారింజ నూనెను కాంతికి ప్రతికూలంగా స్పందించు సిప్రో ఫ్లోక్సాసిన్, నార్ ఫ్లోక్సాసిన్, లోమ్ ఫ్లోక్సాసిన్, ఒఫ్లోక్సకిన్, లేవో ఫ్లోక్సాసిన్ వంటి వాటితో మిష్రమమ్ చేసి వాడరాదు.[3]
ఉపయోగాలు
మార్చుపుల్లనారింజ నూనె వలన పలు ఉపయోగాలువున్నవి వాటిని కింద జతపరచదమైనద్.[2]
- యాంటీ డేప్రెస్సంట్సెంట్ గా పనిచేయును.
- కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.
- యాంటీ సెప్టిక్ గుణాలున్నాయి.
- సహజ పరిమళ ద్రవ్యంగా, దుర్గంద నివారణిగా పని చేయును.
- జ్వరాన్ని తగ్గిస్తుంది.
- వొంటి నొప్పులను తగ్గిస్తుంది.
- నిద్రలేమిని పోగొట్టుతుంది.
- జీర్ణ వ్యవస్థను మెరుగు పరచును.
- దేహంనుండి విష మలినాలను తొలగించును.
- ప్రేగుల్లోని క్రిములను/నులి పురుగులను తొలగించును.
బయటి లింకుల వీడియోలు
మార్చుఇవికూదా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 "Bergamot essential oil information". essentialoils.co.za. Archived from the original on 2018-03-31. Retrieved 2018-10-15.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ 2.0 2.1 "20 Health Benefits Of Bergamot". stylecraze.com. Archived from the original on 2017-10-02. Retrieved 2018-10-15.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ 3.0 3.1 "The Blissful Benefits of Bergamot Oil". articles.mercola.com. Archived from the original on 2018-03-09. Retrieved 2018-10-15.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)