ప్రధాన మెనూను తెరువు

పూర్ణోత్సంగుడు శాతవాహన రాజులలో నాల్గవ వాడు. శ్రీ శాతకర్ణి కుమారుడు. ఇతను క్రీ.పూ.179, 161 మధ్య ఆంధ్ర దేశాన్ని పరిపాలించాడు. ఇతని కాలంలో రాజ్య విస్తరణ జరగలేదు. ఇతడు ఒక నామ మాత్రపు రాజుగా చరిత్రలో మిగిలిపోయాడు. 18 సంవత్సరాల పాటు పాలించాడు.

ఈయన జన్మనామం వేదిసిరి శాతవాహన. పూర్ణోత్సంగుడు ఆయన యొక్క బిరుదు. అయితే పురాణాల్లోని ఆంధ్ర రాజుల జాబితాల్లో ఎక్కడా వేదసిరి శాతవాహన అన్న పేరు కనిపించకపోవటం వలన ఇద్దరూ ఒకటే అన్న విషయం కచ్చితంగా తేలలేదు.[1] పూర్ణోత్సంగుని ప్రస్తావన మత్స్య, బ్రహ్మాండ, విష్ణు, భాగవత పురాణాల్లో ఆంధ్రభృత్యుల వంశానుక్రమణికలో ఉంది. భాగవత పురాణంలో పౌర్ణమాస్యునిగా పేర్కొనబడ్డాడు. వాయుపురాణంలో మాత్రం ఈయన పేరు లేదు.[2][3]

పురాణాల అనుసారంగా శ్రీ శాతకర్ణి మరణించిన తర్వాత, ఆయన కుమారుడు పూర్ణోత్సంగుడు సింహసనాన్ని అధిష్టించాడని తెలుస్తున్నది. మొదటి శాతకర్ణి మరణించేనాటికి తన కుమారులు చిన్నవారు కావటం వల్ల అతని భార్య నాగానిక కొంతకాలం పరిపాలించి తదుపరి తన కుమారుడైన పూర్ణోత్సంగుడు లేదా వేదసిరికి రాజ్యభారం అప్పగించింది.[4] ఈయన పాలనాకాలంలో భారతదేశంలో సమకాలీన రాజులైన మగధకు చెందిన పుష్యమిత్ర సుంగ, కళింగ చక్రవర్తి ఖారవేలుడు మరణించారు.

మూలాలుసవరించు