స్వామి వారు ఏకాంతంలో వుండగా తొండమాన్ చక్రవర్తి రావడంతో సిగ్గుపడిన దేవేరులు హడావుడిపడి శ్రీదేవి (లక్షీ దేవి) శ్రీవారి వక్షస్థలం చేరుకోగా, భూదేవి దగ్గరలో వున్న భావి లోనికి వెళ్ళి అంతర్దానమయ్యిందట.ఈ కథను విన్న రామానుజులవారు స్వామివారికి సమర్పించి తీసివేసిన పూలమాలల్ని (మాలిన్యాన్ని) ఈ భావిలో సమర్పించాలని కట్టడి చేసారు. తీసివేసిన పూలను వేసేవారు కాబట్టి ఈ భావిని పూలబావి అనడం వాడుకలోనికి వచ్చింది. ఆనాటినుండి కొన్నాళ్ళ క్రితం వరకూ మాలిన్యాన్ని ఈ పూలభావి లోనే సమర్పించేవారు. అయితే నేటి రోజుల్లో జనంతో పాటుగా స్వామివారి సేవల సంభారాలూ పెరిగిపోవడంతో పూలను ఎవరూ త్రొక్కకుండా దూరంగా పర్వత సానువుల్లో వదిలివస్తున్నారు.

"https://te.wikipedia.org/w/index.php?title=పూల_బావి&oldid=1997285" నుండి వెలికితీశారు