పృథ్వి క్షిపణులు

పృథ్వి క్షిపణులు భారత రక్షణ శాఖకు చెందిన భూమి మీద నుంచి ప్రయోగించగల సక్తివంతమైన క్షిపణులు. ఇది షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి. కేంద్రీకృత గైడెడ్ క్షిపణుల కార్యక్రమంలో భాగంగా డీఆర్‌డీవో దీన్ని అభివృద్ధి చేసింది. ఈ కార్యక్రమం క్రింద అభివృద్ధి చేసిన మొట్టమొదటి క్షిపణి ఇదే.

పృథ్వి క్షిపణి
రకంతక్కువ పరిధి బాలిస్టిక్ క్షిపణి
అభివృద్ధి చేసిన దేశంIndia
సర్వీసు చరిత్ర
సర్వీసులో1994 (పృథ్వి 1)
వాడేవారుIndian Armed Forces
ఉత్పత్తి చరిత్ర
తయారీదారుDefence Research and Development Organisation (DRDO)
Bharat Dynamics Limited (BDL)
తయారీ తేదీFebruary 25, 1988 (పృథ్వి 1)
January 27, 1996 (పృథ్వి 2)
January 23, 2004 (పృథ్వి 3)
విశిష్టతలు
బరువు4,400 కెజి (పృథ్వి 1)
4,600 kg (పృథ్వి 2)
5,600 kg (పృథ్వి 3)
పొడవు9 m (Prithvi I)
8.56 m (Prithvi II, Prithvi III)
వ్యాసం110 cm (Prithvi I, Prithvi II)
100cm (Prithvi III)

ఇంజనుఒకే దశ ద్రవ ఇంధన మోటారు (పృథ్వి 1, పృథ్వి 2),
ఒకే దశ ఘన ఇంధన మోటారు (పృథ్వి 3)
ఆపరేషను
పరిధి
150 km (పృథ్వి 1)
250-350 km (పృథ్వి 2)
350 - 600 km (పృథ్వి 3)
గైడెన్స్
వ్యవస్థ
strap-down inertial guidance
లాంచి
ప్లాట్‌ఫారం
8 x 8 Tata Transporter Erector Launcher

అభివృద్ధి, చరిత్ర మార్చు

1983 లో భారత ప్రభుత్వం సమీకృత గైడెడ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమం ను ప్రారంభించి, వివిధ రకాల క్షిపణుల తయారీకి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో తయారుచేసిన మొట్టమొదటి క్షిపణి పృథ్వి. ద్రవ ఇంధనంగాని, ఘన ద్రవ ఇంధనాలు రెంటినీ గానీ వాడేలా వివిధ కూర్పులను చేసారు. యుద్ధభూమి క్షిపణిగా తయారుచేసిన ఈ క్షిపణి, వ్యూహాత్మక అణు క్షిపణి పాత్రలో అగ్ని అణు వార్‌హెడ్‌ను మోసుకుపోగలదు.

రకాలు మార్చు

పృథ్వి క్షిపణి ప్రాజెక్టు భారతీయ సైన్యం, వైమానిక దళం, నావికాదళం మూడూ వాడేలా మూడు రకాలను తయారుచెయ్యాలని సంకల్పించింది. తొలినాళ్ళలో ఈ రకాలను కింది విధంగా ఉండాలని భావించారు.[1]

  • పృథ్వి I (SS-150) - సైన్యం కోసం (పరిధి 150 కిమీ, పేలోడ్ 1,000 కెజి)
  • పృథ్వి II (SS-250) - వైమానిక దళం కోసం (పరిధి 250 కిమీ, పేలోడ్ 500 కెజి)
  • పృథ్వి III (SS-350) - నావికా దళం కోసం (పరిధి 350 కిమీ, పేలోడ్ 1,000 కెజి)

వివరాలు మార్చు

 
Agni and పృథ్వి missile models in DRDO, Balasore

పృథ్వి 1 మార్చు

పృథ్వి 1 1000 కెజి మోసుకుపోగలిగే, భూమి-నుండి-భూమికి ప్రయోగించే క్షిపణి. దీని పరిధి 150 కిమీ. 10-50 మీ వర్తుల దోష పరిధి గల ఈ క్షిపణిని ట్రాంస్పోర్టర్ ఎరెక్టర్ లాంచరుతో ప్రయోగించవచ్చు. 1994 లో దీన్ని భారత సైన్యం లోకి ప్రవేశపెట్టారు. (DRDO) నాయకుడు అవినాశ్ చందర్ ప్రకారం ఈ క్షిపణిని తొలగించి దాని స్థానాన్ని మరింత మెరుగైన, కచ్చితమైన ప్రహార్ క్షిపణితో పూరిస్తారు. తొలగించిన పృథ్వి 1 క్షిపణులను మరింత దూరాలకు చేరగల క్షిపణులుగా ఆధునికీకరిస్తారు.


పృథ్వి 2 మార్చు

పృథ్వి 2 కూడా ఒకే దశతో, 500 కెజి మోసుకుపోగలిగే క్షిపణి. ద్రవ ఇంధనంతో పనిచేసే పృథ్వి 2, 250 కిమీ దూరం వెళ్లగలదు. వైమానిక దళ వినియోగం కోసం దీన్ని తయారు చేసారు. 1996 జనవరి 27 న దీని తొలి పరీక్ష చేసారు. 2004 లో అభివృద్ధి దశలు పూర్తయ్యాయి. దీన్ని సైన్యంలో కూడా ప్రవేశపెట్టారు. ఇటీవల చేసిన ఒక పరీక్షలో దీన్ని 350 కిమీ పరిధి వరకు ప్రయోగించి చూసారు. ఇనర్షియల్ నేవిగేషన్ వ్యవస్థతో దీన్ని ప్రయోగించారు. క్షిపణి వ్యతిరేక వ్యవస్థల కన్నుగప్పగలిగే అంశాలు ఇందులో ఉన్నాయి.

2003లో ఈ క్షిపణిని వ్యూహాత్మక బలాల కమాండ్‌కు అందజేసారు. IGMDP అభివృద్ధి చేసిన మొదటి క్షిపణి ఇదే.[2] 2010 సెప్టెంబరు 24 న జరిగిన పరీక్ష విఫలమయ్యాక,[3] 2010 డిసెంబరు 22 న మరో రెండు క్షిపణులు రెండు వేరువేరు లక్ష్యాల వైపు ప్రయోగించగా అవి విజయవంతమయ్యాయి.[4] వారతా కథానాల ప్రకారం పరిధిని 350 కిమీ కు పెంచారు. పేలోడ్ సామర్థ్యం 500 – 1000 కెజి మధ్య ఉంది.[5][6][7]

పరీక్ష రకం తేది వాడుకరి స్థితి Notes
పరీక్ష 27 జనవరి 1996 DRDO విజయవంతం
వాడుకరి పరీక్ష 12 అక్టోబరు 2009 (I)[8] వ్యూహాత్మక బలాల కమాండ్ విజయవంతం
12 అక్టోబరు 2009 (II)[8]
24 September 2010[9] విఫలం లాంచ్ మోటారు విఫలమైంది
22 డిసెంబరు 2010 (I)[4] విజయవంతం
22 డిసెంబరు 2010 (II)[4]
9 జూన్ 2011[10]
25 ఆగస్టు 2012[11]
4 అక్టోబరు 2012[12]
7 అక్టోబరు 2013[13]
7 జనవరి 2014[14]
28 మార్చి 2014[14][15]
26 నవంబరు 2015[16]
16 ఫిబ్రవరి 2016[17][18]
18 మే 2016[19][20][21]

పృథ్వి 3 మార్చు

పృథ్వి 3 రెండు దశల భూమి-నుండి-భూమికి ప్రయోగించే క్షిపణి. మొదటి దశ ఘన ఇంధనంతో 157 kNtసామర్థ్యం గల థ్రస్ట్ మోటారు కలిగి ఉంది. రెండవ దశ ద్రవ ఇంధనం కలిగినది. ఈ క్షిపణి 1,000 కెజి వార్‌హెడ్‌ను 350 కిమీ దూరము, 500 కెజి వార్‌హెడ్‌ను 600 కిమీ దూరమూ, 250 కెజి వార్‌హెడ్‌ను 750 కిమీ దూరమూ తీసుకుపోగలదు. పృథ్విని సముద్రానికి అనుకూలంగా మలిస్తే తయారైనదే ధనుష్. దీన్ని హైడ్రాలిక్ గా స్థిర పరచిన లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించాలి. దీని తక్కువ పరిధి దీనికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. అందుకే దీన్ని శత్రు దేశపు నౌకాశ్రయాన్ని గానీ, విమాన వాహక నౌకను గానీ ధ్వంసం చేసే క్షిపణిగా భావిస్తారు. దీన్ని ఓడల నుండి పలుమార్లు ప్రయోగించి పరీక్షించారు. .

పృథ్వి 3 ను 2000 లో INS సుభద్ర నుండి ప్రయోగించారు. నౌక యొక్క హెలికాప్టరు డెక్ నుండి దీన్ని ప్రయోగించారు. 250 కిమీ రకం క్షిపణి మొదటి పరీక్ష పాక్షికంగానే విజయవంతమైంది.[22] 2004 లో పూర్తి స్థాయి పరీక్షలు పూర్తయ్యాయి.[23] ఆ తరువాతి సంవత్సరం డిసెంబరులో 350 కిమీ క్షిపణి ధనుష్ ను INS రాజ్‌పుట్ నుండి ప్రయోగించి భూమ్మీద ఉన్న లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించారు.[24] తిరిగి ఈ క్షిపణిని 2009 డిసెంబరు 13 లో చాందీపూర్ నుండి 35 కిమీ దూరంలో నిలబెట్టిన INS సుభద్ర నుండి ప్రయోగించారు. అది ఆ క్షిపణి యొక్క ఆరవ పరీక్ష.[25] తిరిగి 2015 నవంబరు 26 న పృథ్వి 3 లేదా ధనుష్ ను బంగాళాఖాతంలో INS సుభద్ర నుండి ప్రయోగించారు.[26]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు వనరులు మార్చు

మూలాలు మార్చు

  1. Centre for Non Proliferation Studies Archive Archived 2001-12-02 at the Library of Congress Web Archives accessed 18 October 2006.
  2. "Prithvi-II training launch successful". The Hindu. August 12, 2013. Retrieved 14 August 2013.
  3. "PIB Press Release". Pib.nic.in. Retrieved 2010-07-16.
  4. 4.0 4.1 4.2 "India test-fires two Prithvi-II ballistic missiles". The Times Of India. 2010-12-22. Archived from the original on 2012-11-04. Retrieved 2016-07-24.
  5. "Improved Prithvi-II successfully test fired". Indianexpress.com. 2009-04-15. Retrieved 2010-07-16.
  6. "TOI" (2011-06-09). "Nuclear-capable Prithvi-II test-fired". Archived from the original on 2014-01-07. Retrieved 2016-07-24.
  7. PTI (2009-10-12). "Two nuclear capable Prithvi-2 missiles successfully test fired - India - The Times of India". The Times of India. Archived from the original on 2012-10-25. Retrieved 2010-07-16.
  8. 8.0 8.1 "India test-fires two Prithvi- II missiles". The Hindu (in Indian English). 2009-10-12. ISSN 0971-751X. Retrieved 2016-05-18.
  9. "Strategic Weapons: India Improves Its SCUD Clones". www.strategypage.com. Archived from the original on 2016-04-25. Retrieved 2016-05-18.
  10. Unacknowledged (9 June 2011). "Prithvi-II successfully launched". Business Line. The Hindu. Retrieved 9 June 2011.
  11. "Prithvi II successfully test-fired". thehindu.com. 2012-08-25. Retrieved 2012-08-25.
  12. "Prithvi-II ballistic missile test fired". The Hindu. 4 October 2012. Retrieved 4 October 2012.
  13. "Nuclear Capable Prithvi 2 Missile soars again successfully". The Biharprabha News. Archived from the original on 8 అక్టోబరు 2013. Retrieved 7 October 2013.
  14. 14.0 14.1 "India test-fires nuclear-capable Prithvi-II missile". The Indian Express. 7 January 2014. Retrieved 7 January 2014.
  15. PTI (2014-03-28). "India test fires nuclear-capable Prithvi-II missile from Chandipur". livemint.com/. Retrieved 2016-05-18.
  16. "India successfully test fires Prithvi". 26 November 2015.
  17. "Indigenously developed Prithvi-II missile successfully test-fired - The Economic Times". The Economic Times. Retrieved 2016-02-16.
  18. "Prithvi-II missile test-fired in Odisha - Times of India". The Times of India. Retrieved 2016-02-16.
  19. "India successfully test fires Prithvi-II missile from Chandipur - Times of India". The Times of India. Retrieved 2016-05-18.
  20. "India successfully test fires indigenously developed Prithvi-II missile". The Indian Express. 2016-05-18. Retrieved 2016-05-18.
  21. "Indian army successfully test fires Prithvi-II ballistic missile". The New Indian Express. Archived from the original on 2016-05-19. Retrieved 2016-05-18.
  22. "Nuclear Data - Table of Indian Nuclear Forces, 2002". NRDC. Retrieved 2010-07-16.
  23. Unacknowledged (12 Oct 2009). "Prithvi". Bharat Rakshak Missiles. Bharat Rakshak. Archived from the original on 14 మే 2011. Retrieved 22 May 2011.
  24. domain-b.com: Dhanush, naval surface-to-surface missile, test fired successfully
  25. "Dhanush missile successfully test-fired". The Times Of India. 2009-12-14. Archived from the original on 2012-10-25. Retrieved 2016-07-24.
  26. "Dhanush missile". India Today. Archived from the original on 29 నవంబరు 2015. Retrieved 30 November 2015.