పెండెం జగదీశ్వర్

పెండెం జగదీశ్వర్ (జూన్ 28, 1976 - జూలై 17, 2018) బాలల కథా రచయిత, కార్టూనిస్టు, తెలుగు ఉపాధ్యాయుడు. బాల సాహితీరత్నగా పేరుపొందడమేకాకుండా 2005లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి కీర్తి పురస్కారం అందుకున్నాడు.[1][2]

పెండెం జగదీశ్వర్
పెండెం జగదీశ్వర్
జననంజూన్ 28, 1976
కొమ్మాయిగూడెం గ్రామం, రామన్నపేట మండలం, యాదాద్రి - భువనగిరి జిల్లా, తెలంగాణ
మరణం2018 జూలై 17(2018-07-17) (వయసు 42)
చిట్యాల
మరణ కారణంఆత్మహత్య
నివాస ప్రాంతం8-21/13, క్రిస్టియన్ కాలనీ, రామన్నపేట గ్రామం & మండలం, యాదాద్రి - భువనగిరి జిల్లా , తెలంగాణ 508113
వృత్తితెలుగు ఉపాధ్యాయులు
మతంహిందూ
భార్య / భర్తరాణీ సుధ
పిల్లలుహరిచందన, వికాస్‌తేజ
తండ్రినరసింహ
తల్లిసత్తమ్మ

జననం మార్చు

జగదీశ్వర్ 1976 జూన్ 28న చేనేత కుంటుబానికి చెందిన నరసింహ, సత్తమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి - భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం గ్రామంలో జన్మించాడు.

రచనా ప్రస్థానం మార్చు

1994 నుండి రచనలు చేస్తున్న జగదీశ్వర్ అనేక కథలు వ్యాసాలు రాశాడు. వాటిని పుస్తకాలుగా ప్రచురించాడు.

పుస్తకాలు మార్చు

  1. ఆనంద వృక్షం (పర్యావరణ కథల సంపుటి)
  2. పసిడిమొగ్గలు
  3. ఉపాయం
  4. గజ్జలదెయ్యం
  5. బాలల కథలు
  6. విడ్డూరాల బుడ్డోడు
  7. నూటపదహారు నవ్వులు
  8. తానుతీసినగోతిలో
  9. ముగ్గురు అవివేకులు
  10. విముక్తి
  11. ఆంధ్రప్రదేశ్ జానపదకథలు
  12. బడి పిలగాల్ల కతలు
  13. మాతో పెట్టుకోకు

గుర్తింపులు మార్చు

  1. తెలంగాణ మాండలికంలో పిల్లలు చెప్పుకునే ఇరవై జానపద, హాస్యకథలతో రాసిన `బడి పిలగాల్ల కతలు´(2015) అనే పుస్తకం తెలంగాణ మాండలికంలో వచ్చిన తొలి బాలల కథాసంకలనంగా ప్రశంసలందుకుంది. ఇందులోని 'నాకోసం యెవలేడుస్తరు?, వొంకాయంత వొజ్రం' కథలు మహారాష్ట్రలో ఆరవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకాలలో 2016-17 విద్యాసంవత్సరం నుండి పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టబడ్డాయి.[3]
  2. తెలంగాణ మాండలికంలోనే 'గమ్మతి గమ్మతి కతలు,(2016), దోస్తులు చెప్పిన కతలు'(2018) పుస్తకాలను కూడా ప్రచురించాడు.
  3. `చెట్టు కోసం ´కథ 2007 నుండి 2016 వరకు మహారాష్ట్రలో ఆరవ తరగతి తెలుగులో పాఠ్యాంశంగా కొనసాగింది.
  4. ప్రభుత్వ తెలుగు పాఠ్య పుస్తకాల (3వ తరగతి ప్రథమ భాష, 6, 7 తరగతులు ద్వితీయ భాష) రచనలో పాల్గొన్నాడు.
  5. వయోజనులు, నూతన అక్షరాస్యుల కోసం స్టేట్ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో పలు పుస్తకాలు రాశాడు.
  6. సాక్షరభారత్ వాచక రూపకల్పనలో పాలు పంచుకున్నాడు.
  7. బాలసాహిత్య గ్రంథాల ప్రచురణలో రాజీవ్ విద్యామిషన్ కు సేవలందించాడు.
  8. నల్లగొండ జిల్లా ఆర్వీయం బాలల మాసపత్రిక `జాబిలి´కి సంపాదక వర్గ సభ్యునిగా పనిచేశాడు.

పురస్కారాలు మార్చు

  1. 'ఉత్తమ బాలసాహితీ గ్రంథం' పురస్కారం - 'గజ్జెల దెయ్యం' - తెలుగు విశ్వవిద్యాలయం (2005)[4]
  2. మహాకవి శ్రీశ్రీ పురస్కారం
  3. 'బాలసాహితీరత్న' పురస్కారం - బాలసాహిత్య పరిషత్
  4. సాహితీ మేఖల, అక్షర కళాభారతి, చింతల స్వచ్ఛంద సంస్థలనుండి ఉగాది పురస్కారాలు
  5. వాసాల నర్సయ్య బాలసాహిత్య పురస్కారం
  6. గాడేపల్లి యువ సాహిత్య పురస్కారం
  7. తెలంగాణ ప్రతిభా పురస్కారం - 2017 (నటరాజ్ డ్యాన్స్ అకాడమీ, హైదరాబాద్, 28.07.2017) - తెలుగు వికీపీడియా కృషి[5][6]

మరణం మార్చు

ఈయన 2018, జూలై 17వ తేదీన చిట్యాల శివారులోని బాలనర్సింహ గుడి వద్ద రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.[7]

మూలాలు మార్చు

  1. ఈనాడు (18 July 2018). "బాలల మిత్రుడు ఇక లేరు". Archived from the original on 18 July 2018. Retrieved 18 July 2018.
  2. ఆంధ్రజ్యోతి (18 July 2018). "ప్రముఖ బాలల రచయిత పెండెం జగదీశ్వర్‌ ఆత్మహత్య". Archived from the original on 18 July 2018. Retrieved 18 July 2018.
  3. నమస్తే తెలంగాణ (18 July 2018). "సాహితీవేత్త జగదీశ్వర్ ఆత్మహత్య". Archived from the original on 18 July 2018. Retrieved 18 July 2018.
  4. ప్రజాశక్తి (18 July 2018). "బాల సాహితీవేత్త జగదీశ్వర్‌ దుర్మరణం". Archived from the original on 18 July 2018. Retrieved 18 July 2018.
  5. సాక్షి. "కళాకారులకు ప్రతిభా పురస్కారాలు". Archived from the original on 29 జూలై 2017. Retrieved 18 July 2018.
  6. ఆంధ్రజ్యోతి. "పలువురికి ప్రతిభా పురస్కారాలు". Retrieved 18 July 2018.[permanent dead link]
  7. రచయిత పెండెం జగదీశ్వర్ ఆత్మహత్య