పెందుర్తి

విశాఖపట్నం జిల్లా, పెందుర్తి మండలానికి చెందిన గ్రామము. విశాఖపట్నం మహానగర పరిధిలో వుంది

పెందుర్తి, విశాఖపట్నం జిల్లా, పెందుర్తి మండలానికి చెందిన గ్రామం.[1]ఇది పెందుర్తిలోని పౌర సౌకర్యాలకు బాధ్యత వహించే గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంది. ఈ ప్రాంతాన్ని జిల్లాలో ప్రధాన నివాస, వాణిజ్య ప్రాంతంగా పరిగణిస్తారు.పెందుర్తి మండలానికి,శాసనసభ నియోజక వర్గానికి ప్రధాన కేంద్రం.పెందుర్తి విశాఖపట్నం లోకసభ నియోజకవర్గంలోని, పెందుర్తి శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది.ఇది విశాఖపట్నం రెవెన్యూ డివిజను పరిధికి చెందిన ప్రాంతం.

పెందుర్తి రైల్వే స్షేషన్ (చివర)

భౌగోళికంసవరించు

పెందుర్తి విశాఖపట్నం నగరానికి పశ్చిమ దిశ అంచున ఉంది.ఇది 17.8333 ° N 83.2000 ° E. అక్షాంశ,రేఖాంశాల వద్ద ఉంది.సముద్రమట్టానికి సగటు ఎత్తు 22 మీటర్లు (75 అడుగులు) ఉంది[2]

రవాణా సౌకర్యంసవరించు

పెందుర్తి రైల్వే స్టేషన్ హౌరా-చెన్నై మెయిన్‌లైన్‌లో ఉంది. కొన్ని ప్యాసింజర్ రైళ్లు ఈ స్టేషన్‌లో ఆగుతాయి.ఇది వైజాగ్ నగరం నుండి BRTS (బస్ రాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టం) కారిడార్ కలిగి ఉంది. ప్రధాన రహదారి 200 అడుగుల వెడల్పుతో కలిగి ఉంది.ఇక్కడ నుండి ప్రతి ముఖ్యమైన ప్రతి ప్రదేశాలకు ఆంధ్రప్రదేశ్ రోడ్ రవాణా సంస్థ బస్సులు నడుపుతుంది.

మార్గం సంఖ్య నుండి వరకు ఏ ప్రాంతాల గుండా
28ఎ/28కె పెందుర్తి/కొత్తవలస రామకృష్ణా బీచ్ వేపగుంట, గోపాలపట్నం, ఎన్ఎడి కొత్తరోడ్, కంచరపాలెం, ఆర్.టి.సి.కాంపెక్స్, జగదాంబ సెంటర్
6కె కొత్తవలస ఓల్డ్ హెడ్ పోష్టాపీస్ పెందుర్తి, వేపగుంట, గోపాలపట్నం, ఎన్ఎడి కొత్తరోడ్, కంచరపాలెం, కాన్వెంట్, టౌన్ కొత్తరోడ్
68కె కొత్తవలస రామకృష్ణా బీచ్ పెందుర్తి, వేపగుంట, సింహాచలం, అడవివరం, అరిలోవ, హనుమంతువాక, మద్దిలపాలెం, ఆర్.టి.సి.కాంపెక్స్, జగదాంబ సెంటర్
541 కొత్తవలస మద్దిలపాలెం పెందుర్తి, వేపగుంట, గోపాలపట్నం, ఎన్ఎడి కొత్తరోడ్, బిర్లా జంక్షన్, గురుద్వార్, సత్యం జంక్షన్
12డి దేవరపల్లి ఆర్.టి.సి.కాంపెక్స్ కొత్తవలస, పెందుర్తి, వేపగుంట, గోపాలపట్నం, ఎన్ఎడి కొత్తరోడ్, బిర్లా జంక్షన్, గురుద్వార్
201 శృంగవరపుకోట ఆర్.టి.సి.కాంపెక్స్, కొత్తవలస, పెందుర్తి, వేపగుంట, గోపాలపట్నం, ఎన్ఎడి కొత్తరోడ్, బిర్లా జంక్షన్, గురుద్వార్
888 అనకాపల్లి తగరపువలస శంకరం, సబ్బవరం, పెందుర్తి, శొంఠ్యాం, గుడిలోవ, ఆనందపురం.
55కె కొత్తవలస యస్.సి.ఇండియా పెందుర్తి, వేపగుంట, గోపాలపట్నం, ఎన్ఎడి కొత్తరోడ్, ఎయిర్ పోర్ట్, బి.ఎచ్.వి.పి, ఓల్డ్ గాజువాక, న్యూ గాజువాక, మల్కాపురం

మూలాలుసవరించు

  1. "Wayback Machine" (PDF). web.archive.org. 2015-03-19. Retrieved 2020-06-29. Cite uses generic title (help)
  2. "Maps, Weather, and Airports for Pendurti, India". www.fallingrain.com. Archived from the original on 2020-06-30. Retrieved 2020-06-29.

వెలుపలి లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=పెందుర్తి&oldid=3042042" నుండి వెలికితీశారు