పెడన పురపాలక సంఘం

పెడన పురపాలక సంఘం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,కృష్ణాజిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం మచిలీపట్నం లోకసభ నియోజకవర్గం లోని,పెడన శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

పెడన పురపాలక సంఘం
పెడన
స్థాపన1985
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

చరిత్రసవరించు

పెడన పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లాకు చెందిన పురపాలక సంఘం.ఇది 1985 సంవత్సరంలో 3 వ గ్రేడ్ మునిసిపాలిటీగా స్థాపించబడింది.పురపాలక సంఘం పరిధి 23 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది.[1]

జనాభా గణాంకాలుసవరించు

2001 లో 29,612 ఉన్న పట్టణ జనాభా 2011 లో 30,835 కి పెరిగింది. గత దశాబ్దంలో 1.57% పెరిగింది. అక్షరాస్యత రేటు 65.08% ఉండగా పురుష జనాభాలో 69.96%, స్త్రీ జనాభాలో 60.20% అక్షరాస్యులు ఉన్నారు.

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్సవరించు

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా వెంకట బాబా,[2] వైస్ చైర్మన్‌గా కాశీ పనిచేస్తున్నారు.[2]

పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలుసవరించు

  1. పైడమ్మతల్లి దేవాలయం
  2. గంగా పార్వతీ సమేత శ్రీ అగస్తేశ్వరస్వామివారి దేవాలయం
  3. శ్యామలాంబ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం
  4. భద్రకాళీసమేత శ్రీ వీరభద్రస్వామివారి ఆలయం

ఇతర వివరాలుసవరించు

ఈ పురపాలక సంఘం 12.87.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.20 రెవెన్యూ వార్డులు,23 ఎన్నికల వార్డులు ఉన్నాయి.ఈ పురపాలక సంఘంలో 26 మురికివాడలు ఉన్నాయి. ఒక ప్రభుత్వ ఆసుపత్రి,18 ప్రభుత్వ పాఠశాలలు, 2 కూరగాయల మార్కెట్ ఉన్నాయి.

మూలాలుసవరించు

  1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
  2. 2.0 2.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబర్ 2019. Retrieved 13 May 2016. {{cite web}}: Check date values in: |archive-date= (help)

వెలుపలి లంకెలుసవరించు