పెద్దక్కయ్య (సినిమా)

పెద్దక్కయ్య, చిత్రం1967 న విడుదల. బి ఎ సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో , హరనాథ్, కృష్ణకుమారి , వాణీశ్రీ, గుమ్మడి తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు సమకూర్చారు.

పెద్దక్కయ్య
(1967 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.ఎ.సుబ్బారావు
నిర్మాణం తోట సుబ్బారావు
చిత్రానువాదం బి.ఎ.సుబ్బారావు
తారాగణం హరనాధ్ ,
కృష్ణకుమారి,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
వాణిశ్రీ,
రమణారెడ్డి,
జి.వరలక్ష్మి,
విజయలలిత
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు
గీతరచన శ్రీశ్రీ,
కొసరాజు,
దాశరథి,
సి.నారాయణరెడ్డి
సంభాషణలు పినిశెట్టి
కళ వాలి
నిర్మాణ సంస్థ శుభలక్ష్మీ ప్రొడక్షన్స్
భాష తెలుగు

సాంకేతికవర్గం మార్చు

తారాగణం మార్చు

పాటలు మార్చు

ఈ చిత్రంలోని పాటలకు ఘంటసాల బాణీలు కట్టాడు.[1]

క్ర.సం పాట రచయిత గాయకులు
1 "తల్లి దీవించాలి దారి చూపించాలి తోడుగా నీడగా నిలిచి కాపాడాలి" కొసరాజు పి.సుశీల
2 "చెలియ కురుల నీడ కలదు రవ్వల మేడ" (పద్యం) దాశరథి ఘంటసాల
3 "విరబూసెను వలపుల రోజా నిను కోరెను చల్లని రాజా" దాశరథి ఘంటసాల, పి.సుశీల
4 "ఎదురు చూసే కళ్ళలో ఒదిగి ఉన్నది ఎవ్వరో" సినారె ఘంటసాల, పి.సుశీల
5 "పిక్నిక్ పిక్నిక్ పిక్నిక్ చెకచెకలాడే టెక్నిక్" సినారె ఘంటసాల, పి.సుశీల, పి.బి.శ్రీనివాస్
6 "చూడాలి అక్కను చూడాలి రావాలి ఇంటికి రావాలి" ఆరుద్ర పి.సుశీల
7 "తోడులేని నీకు ఆ దేవుడే ఉన్నాడు దారిలేని నీవు ఏ దారిని పోతావు" శ్రీశ్రీ ఘంటసాల
8 "వినవలె నమ్మా మీరు వినవలె నయ్యా" కొసరాజు పిఠాపురం

కథ మార్చు

మంచికి మారుపేరైన రామయ్య తన నిజాయితీ నిరూపించుకోవడానికి హఠాత్తుగా ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటి ముఖం పడతాడు.అప్పటికే అవసాన స్థితిలో ఉన్న అతని భార్య ఈ వార్త వినకముందే కన్ను మూసింది. పెద్దమ్మాయి కమల తన తల్లికిచ్చిన మాటప్రకారం కన్నతండ్రిని, మిగతా పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఆ ఇంటికే తల్లి అయ్యింది. రెండో అమ్మాయి పద్మ ఆనంద్ అండ్ కోలో టెలిఫోన్ ఆపరేటర్‌గా పనిచేస్తోంది. మిగతా పిల్లలందరూ చదువుకుంటున్నారు. పద్మకు అనుకోకుండా ఫోన్ ద్వారా మధు పరిచయమయ్యాడు. ఆ పరిచయమల్లా ప్రణయంగా పరిణమించింది. మధు ఎంత మంచివాడో అతని తండ్రి రమణయ్య అంత చెడ్డవాడు. అన్నపూర్ణమ్మ అనే జమీందారిణి వద్ద రమణయ్య మేనేజరుగా పనిచేస్తుంటాడు.అన్నపూర్ణమ్మకు మధు అంటే చాలా ఇష్టం. ఒకసారి అన్నపూర్ణమ్మ కాలువలో కాలుజారి పడగా కమల రక్షిస్తుంది. ఆనాటి నుండి అన్నపూర్ణమ్మ కమలను తన కన్నబిడ్డలా చూసుకుంటోంది. పద్మ స్నేహితురాలు మేరీకి జాన్‌తో పెళ్లి నిశ్చయించి అతని తండ్రి రామయ్య దగ్గర దాచిన ఐదువందల రూపాయలను అడిగాడు. అతడు దాచిన డబ్బులో నూటయాభైరూపాయలు ఇంటి క్రింద ఖర్చయిందని కమల చెబుతుంది. పద్మ బంగారు గొలుసు తాకట్టు పెట్టి ఆ డబ్బు చెల్లించాల్సి వస్తుంది. మేరీపెళ్ళికి బోసిమెడతో వెళ్ళడం గురించి పద్మ బాధపడుతుంది. ఇది గ్ర్తహించిన కమల అన్నపూర్ణమ్మ ఇంటికి వెళుతుంది. తనకు కావలసిన నగను ఎరువుగా తీసుకుని పని పూర్తి కాగానే రమణయ్యకు ఇవ్వమని చెప్పి అన్నపూర్ణమ్మ తీర్థయాత్రలకు వెళుతుంది. మేరీ పెళ్ళికి వెళ్ళిన పద్మ మెడలోని విలువైన నగను దొంగ దొంగలించి పారిపోతాడు. పోలీసులు వెంటపడితే ఆ దొంగ నగను ఒక పొదలో దాస్తాడు. అది రమణయ్య చూసి ఆ నగ అన్నపూర్ణమ్మదిగా గుర్తించి దాన్ని కాజేస్తాడు. గతిలేక రామయ్య ఆ నగ కోసం తన ఇంటిని తనఖా పెట్టాల్సివస్తుంది. తన వల్లే కుటుంబానికి తీరని కష్టం వచ్చిందని పరాకుతో ఉన్న పద్మ తన యజమాని చెప్పిన మాట వినిపించుకోలేదు. దానితో అతనితో చీవాట్లు తినాల్సి వస్తుంది. పద్మకు బాధ కలిగి ఉద్యోగానికి రాజీనామా చేస్తుంది. తను కూడా మధుతో వస్తానని పద్మ పట్టుపట్టింది. మధు ఆ పని మంచిదికాదని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. మధు సరే అనక తప్పలేదు. ఆ రాత్రే పద్మ ఇల్లు విడిచి మధుతో లేచిపోవడానికి స్టేషన్‌కు బయలుదేరుతుంది. ప్రమాదం జరిగి ఆమె మూగబోతుంది. అసలే కష్టాలలో ఉన్న రామయ్యకు ఈ సంఘటన గోరుచుట్టుపై రోకటిపోటు అవుతుంది[1].

మూలాలు మార్చు

  1. 1.0 1.1 కేతా. పెద్దక్కయ్య పాటలపుస్తకం. p. 12. Archived from the original on 20 ఆగస్టు 2020. Retrieved 19 August 2020.

బయటి లింకులు మార్చు