పెసరట్టు (సినిమా)
పెసరట్టు సినీమా ఫిబ్రవరి 6, 2015 న రీలిజ్ అయింది. సినిమాలో నందు, బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు నటించారు. అందరినీ కొత్తవారితో కత్తి మహేష్ అనే దర్శకుడు తెరకెక్కించిన చిత్రమది. సంపూర్ణేష్ బాబు ఓ ప్రధాన పాత్ర పోషించాడు.[1]
వివరాలు
మార్చు- విడుదల తేదీ : 6 ఫిబ్రవరి 2015
- దర్శకత్వం : కత్తి మహేష్
- నిర్మాత : డి.జి.సుకుమార్, కిరణ్ గూడుపల్లి, శ్రీనివాస్ గునిశెట్టి, ఏడుపుగంటి శేషగిరి, స్వప్నరాణి తక్కెళ్ళని
- సంగీతం : ఘంటసాల విశ్వనాధ్
- నటీనటులు : నందు, నిఖిత నారాయణ, సంపూర్నేష్ బాబు
కథ
మార్చుపెళ్లి చేసుకునేందుకు అమెరికా నుంచి ఇండియాకు వస్తాడు ఎన్నారై హరనాథ్‌రావు అలియాస్ హ్యారీ (నందు)[2]. హ్యారీకి భావన (నిఖితా నారాయణ)తో పెళ్ళి కుదురుతుంది. నిశ్చితార్థానికి కొరిద్ది క్షణాల ముందే ఆమె ఇంట్లో నుంచి మాయమవుతుంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతారు. భావన గురించి కుటుంబ సభ్యులంతా ఆరా తీస్తున్న సమయంలో వారికో నిజం తెలుస్తుంది. గతంలో భావన ఇద్దరబ్బాయిలను ప్రేమించి వారు పెళ్ళి ప్రతిపాదన తెచ్చే సరికి వారికి హ్యాండ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇంతకూ భావన ఎక్కడికెళ్లింది. పెసరట్టుకు భావనకు సంబంధమేంటి. టైటిల్ కు జస్టిఫికేషన్ ఏంటి. హ్యారీకి భావనకు అసలు పెళ్లైందా. సంపర్ణేష్ వచ్చి ఏం చేశాడు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలియజేసే చిత్రమిది.[3]
ఫలితం
మార్చుసినిమా పరాజయం పాలైంది. ప్రేక్షకులు, సమీక్షకుల నుంచి వ్యతిరేక స్పందన రావడంతో ఫ్లాప్ అయింది.[1]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 పెసరట్టు మాడిపోయింది... కూర్చోలేక పరుగెడుతున్నారు...
- ↑ ‘పెసరట్టు’లో కీలక పాత్ర చేస్తున్న నందు.
- ↑ "రివ్యూ : పెసరట్టు సమీక్ష". Archived from the original on 2016-03-04. Retrieved 2015-08-28.