పేరాడ తిలక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాళింగ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ఉన్నాడు.[1]

పేరాడ తిలక్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాళింగ కార్పొరేషన్‌ ఛైర్మన్‌
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2020 నుండి ప్రస్తుతం
నియోజకవర్గం టెక్కలి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి పేరాడ భార్గవి
సంతానం పేరాడ దుష్యంత్, పేరాడ శరత్‌
వృత్తి రాజకీయ నాయకుడు

జననం, విద్యాభాస్యం మార్చు

పేరాడ తిలక్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లాలో జన్మించాడు. ఆయన తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ నుండి బీఏ పూర్తి చేశాడు.[2]

రాజకీయ జీవితం మార్చు

పేరాడ తిలక్‌ 1990 రాజకీయాల్లో వచ్చి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ కణితి విశ్వనాథం శిష్యునిగా పార్టీలో చురుగ్గా పని చేశాడు. ఆయన 2007లో కాంగ్రెస్ పార్టీ తరపున నందిగాం మండలంలో, పెద్దలవునిపల్లి ఎంపీటీసీగా గెలిచి, నందిగాం వైస్‌ ఎంపీపీగా పని చేశాడు. ఆయన 2012లో శ్రీకాకుళం జిల్లా డీసీసీబీ డైరక్టర్‌గా పని చేశాడు. పేరాడ తిలక్‌ 2013లో వైఎస్సార్‌ సీపీలో చేరి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసిన ఆయనకు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి 2016లో టెక్కలి నియోజకవర్గ అదనపు సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించాడు. ఆయన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుండి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు చేతిలో ఓటమి పాలయ్యాడు.[3] ఆయనను 18 అక్టోబర్ 2020న కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[4]

మూలాలు మార్చు

  1. HMTV (18 October 2020). "బీసీ కార్పొరేషన్లకు పాలక మండళ్లను ప్రకటించిన సీఎం జగన్". Archived from the original on 25 October 2020. Retrieved 9 July 2021.
  2. Sakshi (18 March 2019). "శ్రీకాకుళం జిల్లా: వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల వివరాలు". Sakshi (in ఇంగ్లీష్). Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.
  3. Sakshi (22 March 2019). "తిలక్‌ నామినేషన్‌కు ఉప్పొంగిన జనతరంగం". Sakshi. Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.
  4. Andrajyothy (9 July 2021). "బీసీ కార్పొరేషన్ల నామినేటెడ్ పోస్టులను ప్రకటించిన సర్కార్". Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.