పేర్వారం జగన్నాథం

తెలుగు రచయిత

పేర్వారం జగన్నాధం (ఆగష్ట్23, 1934 - సెప్టెంబర్ 29, 2008) ప్రముఖ తెలుగు కవి, విమర్శకుడు, విద్యావేత్త.

పేర్వారం జగన్నాథం

వరంగల్లు జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్లో సెప్టెంబర్ 23, 1934 న జన్మించాడు.[1] ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి. పూర్తి చేసిన జగన్నాథం కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగంలో ఆచార్యుడిగానువరంగల్లోని సికెఎం కళాశాలలో ప్రధానాచార్యుడిగాను, 1992-95 లలో తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి గాను పనిచేశాడు.

సెప్టెంబర్ 29, 2008వరంగల్లో మరణించాడు. మాజీ డి.జి.పి.పేర్వారం రాములు ఇతడి సోదరుడు.

రచనలు

మార్చు
  1. అభ్యుదయకవిత్వానంతర ధోరణులు
  2. ఆరె భాషానిఘంటువు
  3. మోర్దోపు దున్న
  4. సాహితీ సౌరభం
  5. సాగర సంగీతం[2]
  6. వృషభ పురాణం
  7. గరుడపురాణం
  8. శాంతి యజ్ఞం
  9. తెలుగులో దేశీయ కవితాప్రస్థానం
  10. ఆరె జానపద గేయాలు[3]
  11. నన్నయ భారతి (ప్రథమ సంపుటము) [4] (సంపాదకత్వం - వ్యాస సంకలనం)
  12. డా.బాబాసాహెబ్ రచనలు - ప్రసంగాలు[5] (అనువాదం -11 సంపుటాలు) (ప్రధాన సంపాదకత్వం)
  13. సాహిత్యావలోకనం

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-09-18. Retrieved 2014-12-14.
  2. పేర్వారం, జగన్నాథం (ఆగస్టు 1981). సాగర సంగీతం (2 ed.). హనుమకొండ: సాహితీ బంధు బృందం. ISBN 978-12-455-9711-1.
  3. పేర్వారం, జగన్నాథం (1987). ఆరె జానపద గేయాలు. వరంగల్లు: ఆరె జానపద వాజ్మయ పరిశోధక మండలి. ISBN 978-11-753-4781-7. Retrieved 2020-07-12.
  4. పేర్వారం, జగన్నాథం (1993). నన్నయ భారతి (ప్రథమ సంపుటం) (1 ed.). హైదరాబాదు: తెలుగు విశ్వవిద్యాలయం. Retrieved 14 December 2014.
  5. పేర్వారం, జగన్నాథం (1994). డా.బాబాసాహెబ్ రచనలు - ప్రసంగాలు. హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.