పొట్టి వీరయ్య ఒక తెలుగు చలనచిత్ర నటుడు. ఇతడు జన్మతః మరుగుజ్జు. ఇతని ఎత్తు రెండడుగులు. దాదాపు 400 చిత్రాలలో నటించాడు.

వీరయ్య

జననం గట్టు వీరయ్య
ఫణిగిరి,
తిరుమలగిరి తాలూకా ,
నల్గొండ జిల్లా
తల్లి_పేరు గట్టు నరసమ్మ
తండ్రి_పేరు గట్టు సింహాద్రయ్య
వేరేపేరు(లు) పొట్టి వీరయ్య
వృత్తి సినిమా
నివాసం కృష్ణా నగర్, హైదరాబాదు
భార్య / భర్త(లు) మల్లిక (మరణం: 2008)

నేపధ్యము

మార్చు

ఇతనిది నల్గొండ జిల్లా, తిరుమలగిరి తాలూకా ఫణిగిరి గ్రామం. ఇతని తల్లి పేరు గట్టు నరసమ్మ. నాన్న పేరు గట్టు సింహాద్రయ్య. వాళ్లకు వీరయ్య రెండో సంతానం. ఇతనికి ఒక అక్కయ్య ఉంది. ఈమె సాధారణంగానే జన్మించింది.

సినీరంగ ప్రస్థానము

మార్చు

వీరి ఊరిలో మంగళ్‌గోపాల్ అని ఓ వ్యక్తి ఉండేవాడు. పెళ్లిళ్లకు సినిమా అలంకరణ చేయడం ఆయన వృత్తి. ఆయన ద్వారా వీరయ్య 1967లో మద్రాసులో అడుగుపెట్టాడు. అక్కడ ఓ పూల అంగడిలో వీరయ్యను చేర్పించారాయన. ఆయన ద్వారా ప్రముఖ నటుడు శోభన్‌బాబును కలిశాడు. ఆయన ఇతడిని చూసి, బి.విఠలాచార్యగారిని కానీ, భావన్నారాయణగారిని కానీ కలవండి, మీలాంటి వాళ్లకు అవకాశం ఇచ్చేది వాళ్లే అని సలహా ఇచ్చారు. ఆయన మాట ప్రకారం భావన్నారాయణగారిని కలిశాడు. ఆయన నుంచి పెద్దగా స్పందన రాలేదు. తర్వాత విఠలాచార్యగారిని కలిశాక ఇతడి ఆకారం ఆయనకు నచ్చి తన సినిమాలలో పలు అవకాశాలు కల్పించాడు. ఇతని తొలి చిత్రం అగ్గివీరుడు. సినీ పరిశ్రమలో విఠలాచార్య తర్వాత దర్శకుడు దాసరి నారాయణరావు వీరయ్యను బాగా ప్రోత్సహించాడు. ఆయన తొలి సినిమా తాతా మనవడులో గుమ్మడితో కలిసి నటించాడు. దాసరి దర్శకత్వంలో వచ్చిన రాధమ్మపెళ్లి చిత్రంలో హిజ్రాగా నటించాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి దాదాపు 500 చిత్రాల్లో నటించాడు. ఎన్టీఆర్, ఎమ్జీఆర్, అక్కినేని, శివాజీగణేశన్ లాంటి మహానటులతో కలిసి పనిచేశాడు.

నటించిన చిత్రాలు

మార్చు

తెలుగు

మార్చు
  1. 'అగ్గిదొర‌'
  2. అగ్గివీరుడు (తొలి చిత్రం)
  3. రాధమ్మ పెళ్లి (హిజ్రా పాత్ర)
  4. తాతా మనవడు
  5. టార్జాన్ సుందరి
  6. జగన్మోహిని (1978 సినిమా) (పిల్ల పిశాచి)
  7. పేదరాసి పెద్దమ్మ కథ (1968) - మాంత్రికుడి సహాయకుడు
  8. కృష్ణ గారడీ (1986)
  9. ‘యుగంధర్‌’
  10. గజదొంగ’
  11. ‘అత్తగారి పెత్తనం’
  12. ‘గోల నాగమ్మ’
  13. పాపే నా ప్రాణం (2000)
  14. దేవి నాగమ్మ (2002)

వివాహం

మార్చు

వీరయ్య వివాహము మల్లికతో జరిగింది. వీరిది ప్రేమ వివాహము. వీరికి ముగ్గురు సంతానము. మధుమేహంతో బాధపడుతూ ఇతని భార్య 2008 లో మరణించింది. చిన్న కుమార్తె విజయదుర్గ సినిమాల్లోనూ నటించారు.

పొట్టి వీరయ్య 25 ఏప్రిల్ 2021న అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని తన నివాసంలో మరణించాడు. [1][2]

బయటి లంకెలు

మార్చు

మూలాలు

మార్చు
  1. Eenadu. "Potti Veeraiah: ఆ మరుగుజ్జు నటుడు ఇకలేరు - actor and comedian potti veeraiah passed away". www.eenadu.net. Archived from the original on 25 ఏప్రిల్ 2021. Retrieved 25 April 2021.
  2. TV9 Telugu (25 April 2021). "Potti Veeraiah death: టాలీవుడ్ లో ఆక‌స్మిక విషాదం.. సీనియ‌ర్ న‌టుడు పొట్టి వీర‌య్య క‌న్నుమూత‌ - actor Potti veeraiah death". Archived from the original on 25 ఏప్రిల్ 2021. Retrieved 25 April 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)