పొన్నం రవిచంద్ర

పొన్నం రవిచంద్ర తెలంగాణ రాష్ట్రానికి చెందిన జర్నలిస్ట్, రచయిత, సినీ విమర్శకులు. ఆయన 80 ఏళ్ల తెలుగు సినీ ప్రస్థానం పై రచించిన "ప్రస్థానం" పుస్తకానికిగాను 2012లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ సినీ పుస్తకంగా నంది అవార్డును అందుకున్నాడు.[1][2]

డా. పొన్నం రవిచంద్ర గౌడ్
జననం1962 జూన్ 19
వృత్తిజర్నలిస్ట్, రచయిత, సినీ విమర్శకులు
జీవిత భాగస్వామిమంగా
పిల్లలురోహిత్ చంద్ర, రాజీవ్ చంద్ర, రేవతి
తల్లిదండ్రులుపొన్నం సత్తయ్య గౌడ్, మల్లమ్మ
బంధువులుపొన్నం అశోక్, పొన్నం ప్రభాకర్, లీలారాణి, విమల

పొన్నం రవిచంద్ర 2024 జనవరి 20న హైదరాబాద్‌లో యునైటెడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు.[3]

జననం, విద్యాభాస్యం

మార్చు

పొన్నం రవిచంద్ర కరీంనగర్‌లోని పాత బజార్ లో 1962 జూన్ 19న కీ.శే పొన్నం సత్తయ్య గౌడ్, మల్లమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన పదో తరగతి వరకు కరీంనగర్‌లోని దన్గర్వాడి పాఠశాలలో, ఇంటర్మీడియేట్ ఆర్ట్స్ కళాశాలలో, కరీంనగర్ ఎస్. ఆర్. ఆర్. కళాశాలలో బిఎ, ఎల్.ఎల్.బి పూర్తి చేశాడు.

జర్నలిస్టుగా

మార్చు

పొన్నం రవి చంద్ర ఆంధ్రపత్రిక ద్వారా 1987లో తన జర్నలిజం జీవితాన్నిప్రారంభించి కరీంనగర్ స్టోరీలు, బైలైన్ వార్తలను ప్రధానంగా రాసేవాడు. ఆయన ఆంధ్రపత్రిక మూతపడిన తర్వాత ఆంధ్రభూమి దినపత్రికలో నాలుగు నెలలు పని చేసి ఆ తర్వాత 1991లో 'మానేరు టైమ్స్' వార పత్రికను కరీంనగర్ కేంద్రంగా ప్రారంభించాడు. అప్పట్లో మల్టీకలర్లో 10 వేల కాపీలు ముద్రించి గోదావరిఖని, జగిత్యాల, సిరిసిల్ల ప్రాంతాలకు పంపేవాడు. అందులో 'ఊపర్ శేర్వాని అందర్ పరేషాని' జూకంటి జగన్నాధం శీర్షిక, మానేరు తీరం, అనంద్ శీర్షిక, మాడభూషి శ్రీధర్ 'హైదరాబాద్ లేఖ', 'ఈ వారం కవిత' ఒక దానితోపాటు 'గోదావరి' పేరు మీద అప్పుడు వస్తున్న ఉద్యమాల మీద ఒక వ్యాసాలు పత్రికకు మంచి గుర్తింపు తెచ్చాయి.

ఆయన 1994 వరకు 'మానేరు టైమ్స్' ను విజయవంతగా నిర్వహించి కరీంనగర్‌లో సంపూర్ణ విద్య కోసం జరిగిన ప్రభుత్వ కార్యక్రమం సంబంధించిన 'అక్షర ఉజ్వల' పత్రిక సంపాదకత్వ బాధ్యతల్లో ఒకడిగా ఉన్నాడు. అక్షర ఉజ్వల ప్రభుత్వ పత్రికకు ఆయన సమయం ఎక్కువగా వెచ్చించడం వల్ల 'మానేరు టైమ్స్' 2006 నుండి 2010 వరకు పక్షపత్రికగా వెలువడింది. రవిచంద్ర మధ్యలో 'మహానగర్' 'వర్తమానం'లో పని చేసి 2003-2005 మధ్యలో 'మానేరు టైమ్స్' తిరిగి పునరుద్ధరించి దినపత్రికగా తీసుకవచ్చారు. ఆయన 2010 నుంచి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ మాస పత్రికకు అసోసియేట్ ఎడిటర్ గా భాద్యతలు నిర్వహించాడు.

 
యునైటెడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకుంటూ

రచనలు

మార్చు
  1. రవిచంద్ర 2005 లో కరీంనగర్ జిల్లా ఏర్పడి వందేళ్లు అయిన సందర్భంగా జిల్లా చరిత్రపై సమగ్ర పరిశోధన చేసి "శత వసంతాల కరీంనగర్ " పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించాడు.
  2. 2012లో 80 వసంతాల తెలుగు సినీ చరిత్రపై "ప్రస్థానం" పేరుతో గ్రంధాన్ని వెలువరించాడు.
  3. బాలీవుడ్ సినీ హీరో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జైరాజ్ జీవితంపై "ది ఇండియన్ సినిమా ఫస్ట్ యాక్షన్ హీరో” పేరుతో సమగ్రమైన పుస్తకాన్ని ప్రచురించాడు.
  4. వివిధ పత్రికలలో ప్రచురితమైన భారతీయ సినీ నటీనటుల బయోగ్రపీస్ తో "భారతీయ సినీ వైతాళికులు" అనే పుస్తకాన్ని ప్రచురించాడు.

అవార్డులు

మార్చు

మూలాలు

మార్చు
  1. Eenadu (6 September 2022). "విభిన్న రంగాలు.. కీర్తి పురస్కారాలు". Archived from the original on 14 September 2022. Retrieved 14 September 2022.
  2. BBC News తెలుగు (23 July 2022). "పైడి జైరాజ్: తెలుగు నేల నుంచి తొలి పాన్ ఇండియా స్టార్". Archived from the original on 14 September 2022. Retrieved 14 September 2022.
  3. Raashtra (20 January 2024). "ఘనంగా డాక్టరేట్స్ ప్రదానం.. మీడియా పార్టనర్ గా 'రాష్ట్ర'". Archived from the original on 21 January 2024. Retrieved 21 January 2024.