?పోఖ్రాన్
రాజస్థాన్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 26°55′N 71°55′E / 26.92°N 71.92°E / 26.92; 71.92Coordinates: 26°55′N 71°55′E / 26.92°N 71.92°E / 26.92; 71.92
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 233 మీ (764 అడుగులు)
జిల్లా(లు) జైసల్మేర్ జిల్లా జిల్లా
జనాభా 19 (2001 నాటికి)

పోఖ్రాన్ (ఆంగ్లం : Pokhran) లేదా పోకరాన్, రాజస్థాన్ జైసల్మేర్ జిల్లా లోని, ఒక పట్టణం మరియు పురపాలిక సంఘము . ఇది థార్ ఎడారి ప్రాంతంలో ఉన్నది. భారత్ తన మొదటి అణుపరీక్ష ఇక్కడనే చేపట్టింది.

భూగోళికంసవరించు

పోఖ్రాన్ 26.92° N 71.92° E న యున్నది.[1] దీని సరాసరి ఎత్తు 233 మీటరులు (764  అడుగులు).

రాళ్ళతో చుట్టబడిన ఇసుక ప్రాంతము. పోఖ్రాన్ అనగా 'ఐదు ఎండమావులు'. జోధ్‌పూరు నుండి జైసల్మేరు మరియు బికనేరు నుండి జైసల్మేరు పోయే మార్గం మధ్యన పోఖ్రాన్ గలదు.

జనగణనసవరించు

2001 గణాంకాల ప్రకారం[2], పోఖ్రాన్ యందు, 19,186 జనాభా గలదు. పురుషులు 55% మరియు స్త్రీలు 45%. అక్షరాస్యత సరాసరి 56%, జాతీయ సరాసరి 59.5% కంటే తక్కువ : అక్షరాస్యత పురుషులలో 68%, మరియు స్త్రీలలో 41%. పోఖ్రాన్ లో 19% జనాభా 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల వారిది.

అణు పరీక్ష ప్రదేశంసవరించు

1972 సెప్టెంబరు 7 న, పోఖ్రాన్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ భాభా అణు పరిశోధనా సంస్థ (BARC) ట్రాంబే కు, భారత్ లో తయారైన అణు పరికరాన్ని పరీక్ష చేయడానికి అధికారాలను ఇచ్చింది. మే 18 1974 న భారత్ తన మొదటి అణుపరీక్ష చేపట్టింది. 1998 మే 11 నుండి మే 13 వరకు ఐదు అణుపరీక్షలు చేపట్టింది. ఆ తరువాత పరీక్షలకు నిషేధం ప్రకటించింది.

మూలాలుసవరించు

  1. "Falling Rain Genomics, Inc. - Map and weather data for Pokhran". Cite web requires |website= (help)
  2. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. మూలం నుండి 2004-06-16 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-11-01. Cite web requires |website= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=పోఖ్రాన్&oldid=2693768" నుండి వెలికితీశారు