పోలో ఆటగాళ్ళు

గుర్రం పై కూర్చొని జట్టుగా ఆడే అటే పోలో అనేది. ఈ ఆటలో ప్రత్యర్థి జట్టుకు వెతిరేకంగా గోల్ చేయడమే లక్ష్యం. ఆటగాళ్ళు ఒక చిన్న తెల్లటి ప్లాస్టిక్ లేదా చక్క బంతిని ప్రత్యర్థి జట్టు యొక్క గోల్ లో వేయడం ద్వారా స్కోర్ చేస్తారు. దీనికి ఒక పొడుగైన పిడి కలిగిని మేలట్ ను వాడుతారు. సాంప్రదాయక పోలో ఆటను 300 గజాలు పొడవైన ఒక పెద్ద పచ్చగడ్డి మైదానంలో ఆడుతారు. ప్రతి పోలో జట్టులో నలుగురు ఆటగాళ్ళు గుర్రాల పై ఉంటారు.

విభిన్న రకాలుసవరించు

గుర్రం పైనసవరించు

ఆట యొక్క ఒక నూతన రాకమును అరేనా పోలో అని పిలుస్తారు. ఇది లోపలప్రదేశములో గాని అన్ని వాతావరణాలకు సరిపడే ఒక మూయబడిన బయట ప్రదేశములో గాని (ఆటస్థలము చాలా చిన్నదిగా ఉంటుంది. పొడవు 100 గజాలకంటే ఎక్కువ మించదు) ఆడబడుతుంది. అరేనా పోలోలో ప్రతి జట్టులో ముగ్గురు ఆటగాళ్ళు మాత్రమే ఉంటారు. దీనిలో గాలితో నింపగలే తోలుతో తయారైన బంతిని వాడుతారు. అరేనా పోలో ఆటలలో సాధారణంగా 7-నిమిషాలు సమయం కలిగిన నాలుగు వ్యవదిలు (చుక్కాలు లేదా చుక్కర్లు అని పిలవబడే) ఉంటాయి. మైదానంలో ఆడే పోలో ఆటలలో నాలుగు నుంచి ఎనిమిది 7-నిమిషాల వ్యవదిలు ఉంటాయి (ఆట స్థాయిని బట్టి). పశ్చిమ యునైటెడ్ స్టేట్స్ లో ఆడే ఒక ప్రత్యేక అరేనా పోలో ఆట యొక్క రూపం కౌబాయి పోలో.

ఇటీవల కాలములో రూపు దిద్దుకున్న ఒక రూపం బీచ్ పోలో. ఇది అరేనా పోలోకు దగ్గరగా ఉంటుంది. ఐతే దుబయ్ మరియు మియామి లలో ఇసక పై ఆడబడుతుంది. ఇటీవల UKలో కూడా ఆటబడుతుంది.

మరొక నూతన పోలో రకము, మంచు పోలో. ఇది ఒక సమతలమైన నెల పై గాని గడ్డకట్టిన చెరువు పై గాని కాంపాక్ట్ చేయబడిన మంచు మీద ఆడబడుతుంది. అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి మంచు పోలో ఆట యొక్క రూపం మారుతుంది. సాధారణంగా ప్రతి జట్టులో ముగ్గురు ఆటగాళ్ళు ఉంటారు. ప్రకాశమైన రంగు గల ఒక లఘు ప్లాస్టిక్ బంతి వాడబడుతుంది.[ఉల్లేఖన అవసరం]

పోలో మరియు లక్రోస్ ఆటల కలయిక పోలోక్రోస్ అనేబడే ఒక ప్రజాదరణ పొందిన ఆట. దీనిని ఆస్ట్రేలియాలో 1930ల చివరిలో అభివృద్ధి చేశారు.

జట్టులో ఆటగాళ్ళ సంఖ్య, వాడే పరికరాలు, నిబంధనలు మరియు ఆట సదుపాయాలలో ఉన్న తేడాల మూలానా ఈ ఆటలు వేరు వేరు ఆటలుగా పరిగణించబడుతాయి.

ఇతర రకాలుసవరించు

పోలో ఆట గుర్రం పై మాత్రమే ఆడబడటం లేదు. కొన్ని పోలో ఆటల రకాలు ఉల్లాసముకు గాని పర్యాటకల కొరకు గాని ఆడబడుతాయి; వాటిలో కొన్ని దోనే పోలో, సైకిల్ పోలో, ఒంటి పోలో, ఏనుగు పోలో, గోల్ఫ్ కార్ట్ పోలో, సెగ్వే పోలో మరియు యాక్ పోలో.

చరిత్రసవరించు

ఈ ఆట మొదట్లో పెర్షియా (ఇరాన్) లో 5వ శతాబ్దం BC లో లేక దానికి ముందు[1] నుండి 1వ శతాబ్దం AD కాల మధ్యలో ఆడబడింది. ఈ ఆట అక్కడే పుట్టింది[2]. మొదట్లో ఇది అశ్విక దళానికి శిక్షణ కొరకు ఆడబడింది. రాజుగారి రక్షకులు వంటి ఉన్నత సైన్యా దళాలు ఈ ఆటను ఆడేవారు. జట్టుకు 100 మందితో ఆక్రోషమైన జాతివారు ఈ ఆటను ఒక చిన్నపాటి యుద్ధం లాగా ఆడేవారు.[3] కాలక్రమేణ, పోలో ఇరాన్ లో దేశీయ ఆటలా గుర్తించబడి, ఉన్నత స్థాయి వారు విస్తృతంగా ఆడే ఆటలాగా మారింది. ఆ ఆటను మహిళలు మరియు పురుషులు కలిసి ఆడేవారు. 6వ శతాబ్దములో, రాణి, తన తోటి మహిళలతో కలిసి రాజు ఖోశ్రో II పర్విజ్ మరియు అతని సభాసదులతో ఈ ఆటను ఆడినట్లు ఉపప్రమాణాలు ఉన్నాయి.[4] ప్రాచీన కాలములో పోలో ఆట గురించిన అనేక విషయాలు పెర్షియన్ సాహిత్యం మరియు కళలో ఉన్నాయి. 9వ శతాబ్దములో ఇరాన్ దేశానికి చెందిన ప్రముఖ కవి-చరిత్రకారుడు అయిన ఫెర్డోసి రచించిన షానమే (రాజుల కావ్యం) అనే కావ్యంలో రాజవంశీకుల మధ్య జరిగిన పోలో ఆటల గురించిన అనేక విషయాలు ఉన్నాయి. ఫెర్డోసి వ్రాసిన మొదటి సంఘటన, టురనియన్ బలహాలకు రాజ్యం యొక్క పూర్వ శతాబ్దాల నాటి రాజకుమారుడైన సియవాష్ కు జరిగిన ఒక అంతర్జాతీయ మ్యాచ్; పోలో మైదానంలో సియవాష్ యొక్క న్సిపుణ్యం గురించి కవి ప్రశంసిస్తాడు. తన ఏడవ సంవత్సరములోనే పోలో ఆడటాన్ని నేర్చుకున్న 4వ శతాబ్ద నాటి సస్సానిడ్ వంశానికి చెందిన షాపూర్ II చక్రవర్తి గురించి ఫెర్డోసి రాస్తున్నాడు.[5]

ఉత్తర భారతదేశ మొదటి ముస్లీం చక్రవర్తి అయిన సుల్తాన్ కుత్-బుతీన్ ఐబక్, 1206 నుంచి 1210 వరకు చక్రవర్తిగా ఉన్నాడు. ఈయిన 1210లో పోలో ఆడుతున్నప్పుడు ప్రమాదవశాత్తు మరణించాడు. అయిన గుర్రం పై పోలో (భారత దేశములో పోలో, చోవ్గన్ అని పిలవబడుతుంది) ఆడుతున్నప్పుడు, గుర్రం పడిపోతుంది. జీని యొక్క ముందరి గుబ్బ ఐబక్ ను పొడిచింది. లాహూర్ (ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంది) లోని అనార్కళి బజార్ సమీపంలో అయిన పాతిపెట్టబడ్డాడు. ఐబక్ కుమారుడు ఆరం 1211 CE [2] లో మరణించాడు. అలాగే టర్కీ వంశీకుడైన పూర్వ-బానిషుడు అయిన షంసుదీన్ ఇల్టుర్మిష్, ఐబక్ కూతురుని వివాహం చేసుకొని ఉండడంతో అతను ఢిల్లీ సుల్తాన్ అయ్యాడు.

మెడీవల్ కాలములో పోలో పెర్షియా నుంచి బైజాన్టైన్స్ కు వ్యాపించింది. (వారు ఆ ఆటను టజికనియన్ అని పిలిచారు). ముస్లిం యుద్ధాల తరువాత ఈజిప్ట్కు చెందిన అయ్యుబిడ్ మరియు మమేలుక్ వంశాలకు మరియు లేవంట్ జాతికి ఈ ఆట వ్యాపించింది. వీరు మిగిలిన అన్ని ఆటలకంటే పోలోనే బాగా ఇష్టపడ్డారు. సలడిన్ మరియు బెబర్స్ వంటి ప్రముఖ సుల్తాన్లు ఈ ఆటను ఆడేవారు. తమ దివానంలోనూ ఈ ఆటను ప్రోత్సాహించేవారు.[6] ఆధునిక కాలపు పేకాట కార్డులకు ముందు వచ్చిన మమేల్యుక్ లలో పోలో కర్రలు చిత్రాలు ఉండేవి.

 
పెర్షియాకు చెందిన సఫావిడ్ వంశం కాలము నాటి Guy u Chawgan (బంతి మరియు పోలో-కర్ర) అనే పద్యం నుంచి ఒక పెర్షియన్ మినీయేచార్ - 1546 AD లో పోలో ఆడుతున్న పెర్షియన్ సభాసదులు

అనంతరం పోలో పెర్షియా నుంచి భారత ఉపఖండం, [7] చైనా వంటి ఆసియా లోని ఇతర ప్రాంతాలకు పాకింది. చైనాలో టాంగ్ డైనస్టి కాలములో ఈ ఆట చాలా ప్రసిద్ధంగా ఉండేది. వర్ణచిత్రాలలో, విగ్రహాలలో ఈ ఆట చిత్రీకరించబడేది. అశ్విక దళానికి శిక్షణకు చాలా ఉపయోకంగా ఉన్న ఈ ఆట, మాధ్యమిక యుగాల సమయములో కాన్స్టాంటినోపిల్ నుంచి జపాన్కు వ్యాపించింది. తూర్పు ప్రాంతాలలో ఈ ఆట రాజుల ఆటగా చెప్పబడేది.[4] బంతి అని అర్ధం గల తిబెతన్ పదమైన "పులు" నుంచి పోలో అనే పేరు ఏర్పడినట్లు చెప్పబడుతుంది.[8]

ఆధునిక పోలో ఆట బ్రిటిష్ వారిచే రూపొందించబడి ప్రాబల్యం చేయబడినా, దీనికి మూలం మణిపూర్ (ప్రస్తుతం భారతదేశములో ఒక రాష్ట్రం). అక్కడ ఈ ఆట 'సగోల్ కంజీ', 'కంజి-బాజీ', లేదా 'పులు' అని పిలవబడేది.[9] ఈ పులు ఆటను ఆంగ్లేయులు చక్క బంతితో ఆడడం మొదలుపెట్టడంతో, ఆ ఆట ప్రాశ్చాత్య దేశాలకు నెమ్మదిగా వ్యాపించింది. మొట్ట మొదటి పోలో క్లబ్ భారత దేశములోని అస్సాం లోని సిలిచార్ లో 1834లో స్థాపించబడింది.

మణిపూర్ లో ఆడబడిన ఆట సగోల్ కంగ్జేయ్ నుంచి వచ్చింది.[10] ఇది మణిపూర్ లో ఆడపడిన మూడు రకాల హాకి ఆటలలో ఒకటి. ఇతర రెండు హాకి రకాలు మైదాన హాకి (కోంగ్ కంజీ అని పిలబడేది) మరియు కుస్తీ-హాకి (ముక్న కంజే అని పిలవబడేది). పోలో ఆట దేవుడైన మర్జింగ్ అనే రెక్కలు కలిగిన గుర్రానికి సంబంధించిన స్థానిక ఆచారాలలో మరియు లాయ్ హరాబ పండగలో జరిపే సృష్టి-ఆచారాల సంఘటనలలో ఆ దేవుడు యొక్క కుమారుడైన కోరి-పాబా జీవితాన్ని సూచించే అంశాలు ఉండేవి. దీని వలన మణిపూర్ యొక్క చారిత్ర ఆధారాలకు ముందే, అనగా 1వ శతాబ్దం A.D. నాటికే ఈ ఆట ఉన్నట్లు చెప్పవచ్చు.

 
ఇంపాల్, మణిపూర్ లోని ఒక పాత పోలో మైదానం
 
అర్జెంటీనాలో పోలో ఛాంపియన్షిప్

మణిపూర్ లో పోలోలో సాంప్రదాయంగా జట్టుకు ఏడుగురు ఆటగాళ్ళు ఉంటారు. ఆటగాళ్ళు స్థానికంగా పెంచబడిన మణిపూరి పొట్టి గుర్రం పై కూర్చుంటారు. ఇవి 13 చేతులకంటే తక్కువ ఎత్తు ఉంటాయి. గోల్ స్తంభాలు ఏమి ఉండవు. బంతిని మైదానం యొక్క ఏ మూల దాటించినా గోల్ అవుతుంది. ఆటగాళ్ళు బంతిని చేతులోకి తీసుకోవచ్చు. అయితే అలాగ చేస్తే, ప్రత్యర్థులు శారీరకంగా దాడి చేయవచ్చు. కర్రలు బెత్తంతో తయారయ్యేవి. బంతులు వెదురు వేళ్ళతో తయారయ్యేవి. గుర్రాల రక్షణ కొరకు రంగు రంగుల బట్టలతో చేసిన పాం-పాంలు గుర్రం శరీరములో ముఖ్యమైన భాగాలలో కట్టేవారు. కాళ్ళకు రక్షణ కోసం తోలుతో చేసిన డాలు కట్టివారు.[11]

మణిపూర్ లో, ఆట కేవలం ఒక "ధనవంతుల" ఆట లాగా కాక, పొట్టి గుర్రం కలిగి ఉన్న సామాన్యలు కూడా ఆడేవారు.[8] మణిపూర్ రాజులు తమ కాంగ్లా కోట లోపల రాజుల కొరకు ఒక పోలో మైదానం ఉండేది. ఇక్కడ వారు మనుంగ్ కంగ్జే బుంగ్ ("లోపరి పోలో మైదానం" అని అర్ధం) ఆడేవారు. బహిరంగ ఆట ప్రదర్శనలు కూడా కాంగ్లాకు బయట ఉన్న పోలో మైదానమైన మాపాన్ కంగ్జేయ్ బుంగ్ ("బయట పోలో మైదానం” అని అర్ధం) లో ఆడబడేది. ఇప్పటికి కూడా ఈ ఆటలు ఆడబడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న రాజభవనానికి బయట ఉన్న ఒక పోలో మైదానంలో హప్ట కంగ్జే (వారావారం పోలో) అనే ఆట వారావారం జరిగేది.

1834లో కేప్టన్ రాబర్ట్ స్టీవర్ట్ మరియు మేజర్ జెనెరల్ జో షియరేర్ అనే ఇద్దరు బ్రిటిష్ సైనికులు మొదటి పోలో క్లబ్ అయిన కల్కత్తా పోలో క్లబ్ ను స్థాపించారు.[12] అనంతరం, వారు ఈ ఆటను ఇంగ్లాండ్ లోని తమ తోటి సైనికులకు పరిచయం చేసారు. 19వ శతాబ్దం ఆకరిలో మరియు 20వ శతాబ్దం ప్రారంబములో పోలో ఆటను ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపచేసినవారు బ్రిటిష్ వారే. సైనిక అధికారులు ఈ ఆటను 1860లో బ్రిటన్ కు దిగుమతి చేసుకున్నారు. లాంచనంగా నియమాలను రూపొందించిన తరువాత, ఇంగ్లాండ్ మరియు పశ్చిమ ఐరోపాలలో పోలో క్లబ్ లు ఏర్పాటు అయ్యాయి.[11] 1834లో, అల్డెర్షాట్, హన్ట్స్ లోని 10వ హుస్సర్స్ పోలోను ఇంగ్లాండ్కు పరిచయం చేసారు. 1874లో మొట్ట మొదటి సారిగా లాంచనంగా బ్రిటిష్ నియమాలను రూపొందించిన హుర్లింగం పోలో అసోసియేషన్ సంస్థే యునైటెడ్ కింగ్డంలో పోలోను నియంత్రించే సంస్థ. ఈ నియమాలలో అనేకము ఇప్పటికి అమలులో ఉన్నాయి.

అర్జెంటైన్ పంపాస్ లో ఉన్న బ్రిటిష్ సైనికులు ఈ ఆటను ఆడడం ప్రారంబించారు. వారిలో ఒకరైన డేవిడ్ శేన్నాన్ 1875లో మొదటి సారిగా దేశములో పోలో ఆటను నిర్వహించాడు. నైపుణ్యం గల గౌచోల మధ్య ఈ ఆట బాగా ప్రాబల్యం చెందింది. తదుపరి సంవత్సరాలలో వెనదో టువర్టో, కెనడా దే గోమేజ్, క్విల్మ్స్, ఫ్లోర్స్ లలో తరువాత (1888) హుర్లిన్ఘం ప్రాంతాలలో పలు క్లబ్బులు తెరవబడ్డాయి. 1892లో రివర్ ప్లేట్ పోలో అసోసియేషన్ స్థాపించబడింది. ఇదే ప్రస్తుతం ఉన్న Asociación Argentina de polo సంస్థకు పునాది. 1924లో పారిస్ లో జరిగిన ఒలింపిక్ క్రీడలలో జువాన్ మైల్స్, ఎన్రిక్ పాడిల్ల, జువాన్ నెల్సన్, అర్టురో కెన్ని, జి. బ్రూక్ నెయ్లర్ y A. పేనా కలిగిన బృందం బంగారు పతకం గెలిచింది; 1936లో బెర్లిన్ లో జరిగిన క్రీడలలోనూ మనువాల్ అండ్రడా, ఆండ్రెస్ గాజ్జొట్టి, రోబెర్టో కవనగ్, లూయిస్ డుగ్గాన్, జువాన్ నెల్సన్, డయగో కవనగ్ మరియు ఎన్రిక్ అల్బెర్డి లతో కూడిన బృందం బంగారు పతకం సాధించింది. ఆ తరువాత ఈ ఆట దేశవ్యాప్తంగా విస్తృతంగా వ్యాపల్యం చెందింది. అర్జంటినా ప్రపంచ పోలో ఆటకు మేక్కా అని పిలవబడుతుంది.

 
706 ADలో గుర్రం పై కూర్చొని పోలో ఆడుతున్న టంగ్ వంశావళికు చెందిన చైనీస్ సభాసదులు

19వ శతాబ్దములో ఆడబడిన ఈ ఆట మణిపూర్ లో ఆడబడిన వేగవంతమైన ఆటకంటే బిన్నంగా ఉండేది. ఈ ఆట నెమ్మదిగానూ పద్ధతిప్రకారము ఉండేది. ఆటగాళ్ళ మధ్య బంతి పాస్ అవ్వడం చాలా తక్కువగా ఉండేది. బంతి లేకుండా ఆటగాళ్ళు కొన్ని విశేష కదిలికలు చేయవలసి ఉండేది. వేగవంతమైన మరియు విడుపు లేకుండా ఆడడానికి ఆటగాళ్లకు గాని గుర్రాలకు గాని శిక్షణ ఉండేది కాదు. ఈ రకమైన పోలో ఆటలో జోరు, దూకుడు మరియు ఈక్వెస్ట్రియన్ నైపుణ్యత ఉండేది కాదు. 1800ల నుంచి 1910ల వరకు, భారతీయ ప్రిన్సిపాలిటీల యొక్క జట్టులే అంతర్జాతీయ పోలో క్రీడారంగంలో ఆధిపత్యం కలిగి ఉండేవి.[11]

 
ఒక టెర్రకోట మహిళా పోలో క్రీడాకారిణి, టాంగ్ వంశావళి, 8వ శాతబ్దం ప్రారంభం, మూసీ గైమేట్, పారిస్

అర్జంటినా, బ్రెజిల్, చిలీ, మెక్సికో, పాకిస్తాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా దేశాలలో పోలో ప్రాబల్యం చెందింది.[13][14][15]

యునైటెడ్ స్టేట్స్ లో మొదటి పోలో మ్యాచ్ ను జేమ్స్ గార్డన్ బెన్నెట్, జు. అనే వ్యక్తి న్యూ యార్క్ సిటీ లోని ఐదవ అవెన్యూలో 39వ వీధిలో ఏర్పాటు చేసారు. 20వ శతాబ్దం యొక్క ప్రారంభదశలో, హారి పిన్ విట్నీ సారథ్యంలో పోలో ఒక అతి-వేగవంతమైన క్రీడగా యునైటెడ్ స్టేట్స్ లో రూపు దిద్దుకుంది. ఇది ప్రత్యర్థి గోల్ వైపు బంతిని తక్కువ పాస్ లతో కదిలించే పద్ధతిలో ఇంగ్లాండ్ లో ఆడే ఆటకంటే బిన్నంగా ఉంది. దురిత బ్రేక్ లను వాడి, గుంపు ముంచి విడి పోయిన ఆటగాళ్ళకు వేగవంతంగా బంతిని పాస్ చేసే పద్ధతిని విట్నీ మరియు జట్టులో అతని తోటి ఆటగాళ్ళు పాటించారు.

మణిపూర్ రాష్ట్రంలో ఉన్న ఇంఫాల్ పోలో మైదానమే ప్రపంచంలోనే అతి పెద్ద పోలో మైదానం. ఈ పోలో మైదానము యొక్క చరిత్ర AD 33 నుంచి "చైతరోల్ కుంబాబా" అనే రాజల చరిత్ర పుస్తకంలో రాయనడింది. ఆధునిక పోలోకు తండ్రి అని చెప్పబడే లేఫ్టినంట్ షేరర్, 1850లలో ఈ రాష్ట్రములో సందర్శించి ఈ పోలో మైదానంలో ఆడాడు. భారత వైస్రాయ్ అయిన లార్డ్ కర్జన్ 1901లో ఈ రాష్ట్రాన్ని సందర్శించి ఈ పోలో మైదానం యోక్క పరిమాణాన్ని పొడవు 225 గజాలు, వెడల్పు 110 గజాలు ఉన్నట్లుగా కొలిచాడు. అతి పురాతనమైన రాజుల పోలో మైదానం అయిన 16వ శతాబ్దం నాటి గిల్గిట్ పోలో మైదానం పాకిస్తాన్లో ఉంది. ప్రపంచంలోనే అత్యధిక ఎత్తులో ఉన్న పోలో మైదానం, పాకిస్తాన్ లోని చిత్రాల్ జిల్లా లోని శందూర్ లో, 4307 మీటర్ల (14,000 అడుగులు) ఎత్తులో ఉంది.ప్రతి ఏడాది జూలైలో చిత్రాల్, గిల్గిట్ జట్టుల మధ్య సాంప్రదాయక పోలో పోటీ జరుగుతుంది. బ్రిటిష్ రాజ్ కు చెందిన మేజర్ కాబ్ ఒక పోలో అభిమాని. వెన్నల క్రాంతిలో పోలో ఆడడానికి అయిన మెహ్తర్ చిత్రాల్ ఆహ్వానం మేరకు శందూర్ కు వచ్చేవారు. ఈ నాటికి వాడబడుతున్న ప్రపంచంలోనే అతి పురాతనమైన పోలో క్లబ్, కలకత్తా పోలో క్లబ్ (1862).

ఆటసవరించు

 
పాకిస్తాన్ లో పోలో

మైదానపు పోలోలో జట్టుకు 4 ఆటగాళ్ళు చొప్పున రెండు జట్టులు ఉంటాయి. పూర్తి-స్థాయి పోలో మైదానం 300 గజాల పొడవు ఉండి, 200 గజాలు లేదా 160 గజాలు వెడల్పు ఉంటుంది. సైడ్ బోర్డ్ లు ఉంటే, వాటి ఎత్తు సాధారణంగా 6" ఉంటుంది. మైదానం యొక్క ఒక్కొక్క వైపు పొడుగాటి గోల్ స్తంభాలు, వాటి మధ్య 8 గజాల దూరం కలిగి ఉంటాయి. గోల్ ద్వారా బంతిని పోనించి అత్యధిక గోల్ లు వేయడమే ఆట యొక్క లక్ష్యం. గాలి పరిస్థితి మరియు మైదానము పరిస్థితిలు ఇరు జట్టులకు సమానంగా ఉండాలని, ప్రతి గోల్ అనంతరం జట్టులు దిశను మార్చుకుంటాయి.

యునైటెడ్ స్టేట్స్ లో ప్రబలంగా ఉండే అరేనా పోలో లో, మైదానము 100 గజాలు పొడవు, 50 గజాలు వెడల్పు కలిగి ఉంటుంది. అరేనా పోలో మొట్ట మొదటిగా ఆడబడిన యునైటెడ్ స్టేట్స్ లో, మైదానాల యొక్క పరిమాణం మారుతూ ఉంటుంది. ఇక్కడ గదులలోనూ సవారి అకాడమీలలోనూ అప్పుడప్పుడు ఆటలు జరుగుతూ ఉంటాయి. ఎత్తైన చక్క గోడల (సాధారణంగా కనీసం 6 అడుగులు ఎత్తు) ఆట హద్దుగా ఉండేవి. అరేనా పోలోలో జట్టుకు ముగ్గురు ఆటగాళ్ళు ఉంటారు. గోడలలో అమర్చబడిన 10 అడుగులు వెడల్పు 12 అడుగులు ఎత్తు కలిగిన గోల్ స్థంబాల ద్వారా బంతుని పోనించి గోల్ చేసేవారు. అరేనా పోలోలో, ప్రతి గోల్ వేసిన తరువాత కాకుండా, ప్రతి 6-నిమిషాలకు (చుక్కా, చుక్కేర్ లేదా చుకెర్) ఒక సారి జట్టులు దిశలు మార్చుకుంటాయి. అరేనా పోలోలో ఒక చిన్న తోలుతో చేసిన బంతి వాడబడుతుంది. బంతి 12.5-15 ఇంచుల మధ్య చుట్టుకోలత కలిగి ఉండి, ఒక చిన్నాపాటి ఫుట్బాల్ లాగా ఉంటుంది.

పాకిస్తాన్ లోని శందూర్ లో, ప్రతి ఏడాది జూలైలో చిత్రాల్, గిల్గిట్ జట్టుల మధ్య సాంప్రదాయక పోలో పోటీ జరుగుతుంది. ఆ పోటీ, శందూర్ పాస్ లో, 3700 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రపంచములోనే అత్యధిక ఎత్తులో ఉన్న పోలో మైదానంలో జరుగుతుంది. ఆ సమయములో ఫాల్క్ సంగీతం మరియు నృత్యం కూడా ఉండి, ఒక క్యంపింగ్ గ్రామం ఏర్పాటు చేయబడుతుంది.[15]

గిల్గిట్, చిత్రాల్, స్కర్డు జట్టులు పోలో యొక్క మూల ఆటకు దగ్గరగా తమ ఆటను ఆడుతాయి. గతములో, స్థానిక ఖాన్ లు, మీర్ లు, మెహ్తర్ లు ఈ ఆటను ప్రోత్సాహించారు. కొన్ని సమయాలలో, తమ రాజ్యం యొక్క వార్షిక ఆదాయములో 50% కంటే పైగా ఈ ఆట కోరకు వేచ్చిన్చేవారు.[16]

పోలో ఆటలో చుక్కాస్ (చుక్కేర్స్ లేదా చుకెర్స్ అని కూడా పిలవబడుతుంది) అనే ఆట వ్యవధి కాలాలు ఉంటాయి. ఈ పధం 1898లో మొదట వాడబడింది. ఇది సంస్కృతం పదమైన చక్ర " వృత్తం, చక్రం" (చక్కతో పోల్చండి). స్థానిక పోటీల నియమాలను బట్టి, ఆటలో 4,6 లేదా 8 చుక్కాలు ఉంటాయి; చాలా ఆటలలో 6 చుక్కాలు ఉంటాయి[17]. సాధారణంగా, ప్రతి చుక్క 7 నిమిషాలు వ్యవది కలిగి ఉంటుంది. అయితే కొన్ని చుక్కాలు తక్కువ వ్యవధి కలిగి ఉంటాయి. చుక్కాల మధ్య ఆటగాళ్ళు వేరే కొత్త గుర్రాలకు మారుతారు. పోటీతత్వం తక్కువ ఉన్న కొన్ని పోలో ఆటలలో ఆటగాళ్ళు రెండు గుర్రాలు మాత్రమే వాడుతారు. ఒకటి తరువాత ఒకటి వాడుకుంటారు. అయితే బాగా పోటీ ఉన్న లీగులలో మరియు యునైటెడ్ స్టేట్స్ అంతర్ కళాశాల పోలో పోటీలలో, ఒక్కొక్క గుర్రం రెండు చుక్కాలలో మాత్రమే ఆడబడుతాయి.

 
బంతిని తీసే కర్రను పట్టుకొని ఉన్న ఒక అంపయర్. వితేర్స్ చుట్టూ బాల్ హోల్డర్ లను కట్టుకున్నాడు.

ఆటలు తరచూ హండికేప్ తో ఆడబడుతాయి. ప్రతి ఆటగాడి హండికేప్ లను కలిపి ఇరు జట్టుల హండికేప్పులు పోల్చబడుతుంది. ఇరు జట్టుల హండికేప్ ల మధ్య ఉన్న వ్యత్యాసం, ఆట ప్రారంభంలో తక్కువ హండికేప్ ఉన్న జట్టుకు గోల్ గా ఇవ్వబడుతుంది.

ఆట ప్రారంబములో, నలుగురు ఆటగాళ్ళు కలిగిన రెండు జట్టులు రెండు వరుసలలో 1, 2, 3, 4 క్రమములో అంపయర్ వైపు చూసినట్లు మైదానం మధ్యలో నిలబడుతారు. మైదానంలో గుర్రాల పై ఇద్దరు అమ్పయర్లు మరియు సైడ్ లైన్ లలో ఒక రేఫేరీ ఉంటారు. ఆట ప్రారంబములో, అమ్పయర్లలో ఒకరు బంతిని రెండు జట్టుల మధ్య గట్టిగా విసురుతారు. బయట ఆడే పోలోలో, గాలి వీసుతున్న దిశను బట్టి ఏ ఒక జట్టుకు ఎక్కువ అనుకూలం ఉండకూడదు కనుక ప్రతి గోల్ తరువాత గాని ప్రతి చుక్కేర్ తరువాత గాని జట్టులు మైదానములో తమ వైపును మార్చుకుంటాయి. ప్రతి జట్టుకు సమానమైన అవకాశం ఉండడం కోసం కూడా జట్టులు తాము ఉన్న వైపును మార్చుకువోడం ఉపయోగపడుతుంది. ఎందుకంటే, అందరు ఆటగాళ్ళు కుడి-చేతులోనే ఆడాలి కనుక.

సాధారణ విధానాలు మరియు ఆచరణలుసవరించు

పోలోలో రెండు మూలమైన రక్షణ విధానాలు వాడబడుతుంది. హుక్ లేదా హుకింగ్ అనబడే పద్ధతిలో, ఒక ఆటగాడు తమ కర్రను వాడి ప్రత్యర్థి కర్రను అడ్డుగోవడం లేదా పైకి లేపుతాడు. ఆ ఆటగాడు ప్రత్యర్థి కర్రను ఊపిన వైపు ఉంటేనే లేదా ప్రత్యర్థి ముందో వెనకో ఉంటేనే హుక్ చేయగలడు. ఈ నియమాన్ని పాటించకుండా హుక్ చేస్తే ఫౌల్ ఇవ్వబడుతుంది. ఉదాహరణకు, ఒక ఆటగాడు మరొక ఆటగాడి గుర్రం దగ్గరకు వెళ్లి వారి కర్రను హుక్ చేస్తే, అది ఒక పెనాల్టి అవుతుంది.

బంప్ లేదా రైడ్-ఆఫ్ అనేది మరొక రక్షణ పద్ధతి. ఇది హాకిలో ఉన్న బాడి-చెక్ మాదిరిగా ఉంటుంది. ప్రత్యర్థి యొక్క ఏకాగ్రతను బగ్నం చేయడానికి, బంతి నుంచి అతన్ని దూరం చేయడానికి లేదా అతని షాట్ ను చెడకోట్టడానికి ఈ పద్ధతిని వాడుతారు. రైడ్-ఆఫ్ లో ఒక ఆటగాడు తన గుర్రాన్ని ప్రత్యర్థికు పక్కగా పోనించి, అతను బంతినుంచి దూరంగా వెళ్ళేలా చేస్తాడు. ఇద్దరు డీకొనే కోణం 45 డిగ్రీల కంటే తక్కువ ఉన్నప్పుడే దీనిని అనుమతిస్తారు.

పోలో పోనీలు (పొట్టి గుర్రాలు)సవరించు

 
ఆట మొదలవ్వడానికి వేచి ఉన్న పోలో గుర్రాలు

ఆటలో ఆటగాళ్ళు నడిపే జంతువులను 'పోలో పోనీలు' అని పిలుస్తారు. దీనికి పోనీ అనే పధం సాంప్రదాయకంగా వాడబడినా, నిజానికి ఇది ఒక పూర్తి స్థాయి గుర్రమే. అవి వితేర్స్ లో 14.2 నుంచి 16 హాండ్స్ (ఒక హాండ్ అంటే 4 ఇంచిలు లేదా 10.16 సెమి) ఎత్తు కలిగి ఉండి, 900-1100 lbs బరువు ఉంటాయి. త్వరగతిలో వేగంగా వెళ్ళగలే సామర్థ్యం, సత్తా, చురుకుతనం మరియు ఉపాయంగా నడపగలే వీలు వంటి అంశాలను బట్టి పోలో పోనీలు ఎంపిక చేయబడుతాయి. స్వభావము చాలా ముఖ్యం; ఒత్తిడిని తట్టుకోనేలా అవి ఉండాలి, తొందరగా ఉత్తేజబడేలాగా లేదా నియంత్రనించడానికి కష్టంగా ఉండకూడదు. వీటిలో అనేక గుర్రాలు మేలుజాతి గుర్రాలు లేదా మేలుజాతి సంకర గుర్రాలు. ఒక చేతితో పగ్గాలను పట్టుకొని, నడిపేవాడి కాలు, బరువు కదిలికను బట్టి ముందుకు వెళ్ళాలో, తిరగాలో, ఆగాలో అని తెలుసుకునే విధంగా వాటికి శిక్షణ ఇవ్వబడుతుంది. బాగా శిక్షణ పొందిన గుర్రం ఆటగాడును సాఫీగాను తోరగాను బంతి దగ్గరకు తీసుకువెళ్తాయి. ఆటగాడి నైపుణ్యంలోను తన జట్టు యొక్క నికర విలువలో 60 నుంచి 75 శాతం వరకు ఒక మంచి గుర్రం యొక్క పాత్ర ఉంటుంది.

పోలో శిక్షణ సాధారణంగా మూడవ వయస్సులో మొదలయి, ఆరు నెలలనుంచి రెండు సంవత్సరాల వరకు కొనసాగుతుంది. చాలా గుర్రాలకు తమ ఐదవ వయస్సులో పూర్తి శారీరక పరిపక్వత వస్తుంది. సుమారు 6 లేదా 7 వయస్సులో గుర్రాలు తమ సామర్థ్యం, శిక్షణలలో ఉచ్ఛ స్థాయిలో ఉంటాయి. అయితే, ప్రమాదాలు ఏవి జరగకపోతే, పోలో గుర్రాలు తమ 18 నుంచి 20 వయస్సు వరకు ఆడగలుగుతాయి.

ఒక్కొక్క ఆటగాడికి ఒకటికంటే ఎక్కువ గుర్రాలు అవసరమవుతాయి. ఎందుకంటే, చుక్కాల సమయములో అలిసిపోయిన గుర్రాలను మార్చి కొత్త గుర్రాలను వాడవచ్చు. సాధారణంగా ఒక్కొక్క ఆటగాదుకు 4 నుంచి 8 గుర్రాల వరకు ఉంటాయి. ఒక్కో ఆటగాడు వద్ద ఉన్న గుర్రాలను "పోలో పోనీల స్ట్రింగ్ " అని పిలుస్తారు. తక్కువ గోల్ ఆటలలో కనీసం 2 లేదా 3 గుర్రాలు (మల్లి వాడే ముందు కనీసం ఒక చుక్కేర్ కు విశ్రాంతి ఇవ్వబడుతుంది) ఉంటే, మీడియం గోల్ ఆటలకు 4 లేదా ఎక్కువ గుర్రాలు (కనీసం చుక్కేర్ కు ఒకటి) ఉంటాయి. ఉచ్ఛ స్థాయి పోటీలకు మరిన్ని ఎక్కువ గుర్రాలు ఉంటాయి.

ఆటగాళ్ళుసవరించు

 
యునైటెడ్ స్టేట్స్ లో అమ్మాయిల పోలో జట్టు.

ప్రతి జట్టులో నలుగురు ఆటగాళ్ళు గుర్రం పై ఉంటారు. జట్టులో పురుషులు, మహిళలు కలిసి ఉండవచ్చు.

ఆటగాళ్ళకు కేటాయించబడిన స్థానానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి:

 • ఒకటవ నంబెర్ అనేదే మైదానంలో అత్యధికంగా ఘర్షణ మీద ఆధారపడిన స్థానం. సాధారణంగా ఒకటో నంబర్ స్థానం ప్రత్యర్థి జట్టులోని నాలుగవ స్థానం ఆటగాడుతో తలబడుతాడు.
 • ఘర్షణలో రెండవ నంబర్ కు ముఖ్య పాత్ర ఉంటుంది. పరిగెత్తి వెళ్లి, స్కోర్ చేయడము గాని ఒకటవ నంబర్ ఆటగాడుకు బంతిని అందించి వారి వెనుక ఉండడం గాని చేస్తాడు. రక్షణలో, ఈ ఆటగాడు ప్రత్యర్థి జట్టులోని మూడవ నంబర్ అతగాడుతో తలపడుతాడు. సాధారణంగా మూడవ నంబర్ ఆటగాడే జట్టులోని అత్యుత్తమ ఆటగాడు. ఈ స్థానం అతి కష్టమైనది కనుక, ఉత్తమ ఆటగాడు రెండవ నంబర్ స్థానంలో ఆడటం కూడా జరుగుతుంది. అయితే, మూడవ స్థానంలో ఆడడానికి మరొక ఉత్తమ ఆటగాడు ఉన్నప్పుడు మాత్రమే.
 • మూడవ నంబర్ స్థానం యుక్తి పరంగా సారథి స్థానం. చాలా బలంగా బంతిని కొట్టి రెండవ నంబర్, ఒకటవ నంబర్ లకు బంతిని పంపించగలే సామర్థ్యం కలిగిన ఆటగాడుగా ఉండాలి. అంతే కాక, కచ్చితమైన రక్షణ కల్పించగలిగే ఆటగాడుగా ఉండాలి. జట్టులోని అత్యుత్తమ ఆటగాడు మూడవ స్థానంలో ఉంటాడు. అలాగే అతనికే హండికాప్ ఎక్కువగా ఉంటుంది.
 • నాలుగవ నంబర్ ప్రధానంగా రక్షణ ఆటగాడు. వారు మైదానంలో ఎక్కడైనా తిరగవచ్చు గాని వారు ముఖ్యంగా గోల్ వేయడాన్ని ఆపుతారు. నాల్గవ నంబర్ ఆటగాడు రక్షణను చూసుకుంటాడు కనుక, మూడవ నంబర్ ఆటగాడుకు బంతిని గట్టిగ కొట్టే స్వేచ్ఛ ఉంటుంది. ఒక వేళ బంతి వారినుంచి వెళ్ళిపోతే, గోల్ ను ఆపడానికి నాల్గవ నంబర్ ఆటగాడు ఉంటాడు కనుక.

పోలో కుడి చేతువాటంతోనే ఆడాలి.

ఉపకరణములుసవరించు

 
ఇరాన్ కు చెందిన ఒక మహిళా పోలో క్రీడాకారిణి
 
నీపాడ్స్ ధరించిన ఒక పోలో ఆటగాడు, ప్రత్యర్థిని "రైడ్ ఆఫ్" చేస్తున్న దృశ్యం

పోలో ఆటగాళ్ళ ధరించే కనీస దుస్తులు ఏమనగా, రక్షణ కొరకు ఒక హెల్మెట్ (దూరమునుంచి చూసే ప్రేక్షకులు గుర్తు పట్టే విధముగా విశేష రంగులో), మోకాలు క్రింద వరకు సవారి బూటులు, తెల్లటి ట్రౌసర్లు (సాధారణ దేనిం జీన్స్) మరియు ఆటగాడి స్థానము యొక్క సంఖ్యను కలిగి ఉన్న రంగుల చొక్కా. అదనంగా ఒకటి లేదా రెండు గ్లవ్స్, రిస్ట్ బ్యాండ్ లు, నీపాడ్స్ (కొన్ని క్లబ్ లలో తప్పనిసరి), స్పర్ లు, ముఖానికి మాస్క్ మరియు ఒక కొరడా. యునైటెడ్ స్టేట్స్ పోలో అసోసియేషన్ (USPA) నిబంధనల ప్రకారం, ఆటకు అవసరమయిన ఒకటే పరికరం, హెల్మెట్ లేదా స్ట్రాప్ తో కూడిన ఒక క్యాప్.[18]

మైదానంలో ఆడే పోలో బంతి హై-ఇంపాక్ట్ ప్లాస్టిక్ తో చేసింది. కాని గతములో వెదురు తోనో విల్లో వెళ్లతోనో చేశేవారు. ఇండోర్ పోలో బంతి, తోలు కవర్ కలిగి ఉబ్బించబడుతుంది. ఇది సుమారు 4½ ఇంచీలు (11.4 సెమి) వ్యాసం కలిగి ఉంటుంది. మైదానంలో ఆడే బంతి సుమారు 3¼ ఇంచీలు (8.3 సెమి) వ్యాసం కలిగి ఉండి, సుమారు నాలుగు అవున్సులు (113.4 గ్రా) బరువు ఉంటుంది. పోలో మేలట్ లో రబ్బర్ తో చుట్టబడిన గ్రిప్ మరియు స్లింగ్ అని పిలవబడే వలయం మాదిరిగా ఉన్న తాంగ్ ఉంటాయి. దీనిని బొటన వేలుకు చుట్టుకుంటారు. కర్ర మానా-బెత్తం (లోపల కాలిగా ఉంటుంది కనుక వెదురు వాడరు) తో చేయబడుతుంది. అయితే ప్రస్తుతుం సంయుక్త పదార్ధాలతో మేలట్ తయారు చేయబడుతుంది. NZ లోని వుడ్ మేలట్స్ ఈ సాంకేతిక నైపుణ్యాన్ని మొదట ప్రవేశ పెట్టారు. మేలట్ యొక్క తల భాగం ఒక సిగార్ ఆకారంలో ఉండి, టిపా అనే దృఢమైన చక్కతో చేయబడుతుంది. దీని పొడవు సుమారు 9 1/4" ఉంటుంది. మేలట్ తల భాగం యొక్క బరువు, ఆటగాళ్ళ అభిరుచి, చక్క రకమును బట్టి 160 నుంచి 240 గ్రాములు ఉంటుంది. కర్ర యొక్క బరువు, వంగేగుణము వంటి అంశాలు ఆటగాళ్ళ అభిరుచిను బట్టి మారుతూ ఉంటుంది. పలు అనుబవస్తులైన ఆటగాళ్లకు మేలట్ యొక్క తల భాగం యొక్క బరువు ఒక ముఖ్యమైన అంశం. మహిళా ఆటగాళ్ళు, పురుష ఆటగాళ్ళు వాడే మేలట్లకంటే తక్కువ బరువు గల మేలట్ లను వాడుతారు. కొందరు పోలో ఆటగాళ్లకు పోలో మేలట్ యొక్క పొడవు గుర్రము యొక్క సైజును బట్టి ఉంటుంది: గుర్రము ఎత్తు ఎంత ఎక్కువగా ఉంటే, మేలట్ అంత పొడవుగా ఉంటుంది. అయితే, కొందరు ఆటగాళ్ళు గుర్రము ఎత్తుతో సంబంధం లేకుండా మేలట్ కు ఒక పొడవునే వాడుతారు. ఏది ఎలాగైనా, వేరు వేరు ఎత్తు ఉన్న గుర్రాలను వాడినప్పుడు, ఆటగాళ్ళు కొంత సర్దుపాటు చేసుకోవాలి. మేలట్ సైజు 50 ఇంచీల నుంచి 53 ఇంచీల వరకు ఉంటుంది. మేలట్ తల భాగం యొక్క పొడగైన వైపుల నుంచి బంతిని కొట్టుతారు.

పోలో సాడిల్ లు ఇంగ్లీష్-పధ్ధతిలో దగ్గరగా ఉంటాయి. ఇవి జంపింగ్ సాడిల్ ల మాదిరిగా ఉంటాయి. పలు పోలో సేడిల్ లకు బిల్లేట్ల క్రింద ఫ్లాప్ ఉండదు. దానికి బదులుగా సేడిల్ బ్లాంకెట్ ఉంటుంది. కొందరు ఆటగాళ్ళు సేడిల్ బ్లాంకెట్ ను వదిలేస్తారు. ఒక బ్రెస్ట్ ప్లేట్ ముందు బిల్లేట్ కు తగిలించబడుతుంది. ఒక టై-డౌన్ (నిలువుగా ఉన్న మార్టిన్గేల్) కూడా వాడవచ్చు: అలాగైతే, రక్షణ కొరకు ఒక బ్రెస్ట్ ప్లేట్ అవసరమవుతుంది. సాధారణంగా టై-డౌన్ ఒక మెడ స్ట్రాప్ సహాయంతో నిలపడుతుంది. ఒక ఓవర్గిర్త్ ని కూడా వాడవచ్చు. స్టిర్రప్ ఐరన్లు బరువు ఎక్కువగా ఉంటాయి. స్టిర్రప్ తోలు మందం ఎక్కువగాను వెడల్పు ఎక్కువగాను ఉంటాయి. ఆటగాళ్ళు స్టిర్రప్ లో నిలబడినప్పుడు, ఇది రక్షణను పెంచుతుంది. గుర్రాల కాళ్ళకు గాయం అవ్వకుండా మోకాలు క్రింద నుండి ఫెట్లాక్ వరకు పోలో రాప్స్ తో చుట్టబడుతాయి. కొన్ని సార్లు అదనపు రక్షణకొరకు, జంపింగ్ (తెరిచి ఉన్న ముందు భాగం) లేదా గెలప్ బూట్లు పోలో రాప్స్ తో పాటు వాడబడుతాయి. ఎక్కువగా ఈ రాప్స్ జట్టు రంగును బట్టి ఉంటాయి. గుర్రం యొక్క జూలు రోచ్ (హాగ్ చేయబడి) చేయబడి ఉంటుంది. ఆటగాళ్ళ కర్రానికి అడ్డు రాకుండా, తోక అల్లబడి ఉంటుంది.

ఆటలో వాడే బిట్, ఎక్కువగా ఒక గాగ్ బిట్ లేదా పెల్హం బిట్ గా ఉంటుంది. గాగ్ బిట్ అయితే, టై-డౌన్ కొరకు కేవేసన్ తో పాటు అదనంగా ఒక డ్రాప్ నోస్ బ్యాండ్ కూడా ఉంటుంది. సామాన్యంగా రెండు పగ్గాలు ఉంటాయి. వాటిలో ఒకటి డ్రా పగ్గముగా ఉంటుంది.

ఆట స్థలంసవరించు

ఆట స్థలం 300 గజాలు పొడవు 160 గజాలు వెడల్పు కలిగి ఉంటుంది. ఇది సుమారు తొమ్మిది ఫుట్బాల్ మైదానాలకు సమానం. ఆట మైదానం చాలా జాక్రత్తగా సంరక్షించబడుతుంది. మైదానంలో గడ్డి తొలగించబడి, ఆడటానికి సురక్షితమైన మరియు వేగవంతమైన ఆటస్థలం అందించబడుతుంది. మైదానం యొక్క ప్రతి వైపు మధ్యలో గోల్ స్తంభాలు ఎనిమిది గజాలు దూరంలో ఉంటాయి. ఆటస్థలాన్ని మంచి పరిస్థితిలో ఉంచుకోవడానికి పోలో మైదానం నిరంతరంగా పర్యవేక్షించబడాలి. ఆట హాఫ్-టైంలో ప్రేక్షకలు మైదానంలోకి వచ్చి "డివోట్ స్టాంపింగ్" అనే పోలో సాంప్రదాయంలో పాల్గొంటారు. దీని ఉద్దేశాలు రెండు. ఒకటి గుర్రాల కాళ్ళచే తోక్కబడిన నేలను (డివోట్లు) మరల సరిచేయడం. ఇంకోటి మైదానంలో తిరగడానికి అవకాశాన్ని కల్పించడం.

బయట ఆడే పోలోసవరించు

ఈ ఆటలో ఆరు 7 నిమిషాల చుక్కాలు ఉంటాయి. ఈ సమయములో ఆటగాళ్ళు గుర్రాలను మారుస్తారు. ప్రతి 7 నిమిషాల చుక్క ఆకరిలో, ఆట మరో 30 సెకన్లు లేదా ఆట ముగిసే వరకు, (వీటిలో ఏది ముందైతే అది) ఆట కొనసాగుతుంది. చుక్కాల మధ్య నాలుగు నిమిషాల విరామం ఉంటుంది. హాఫ్-టీంలో పది నిమిషాల విరామం ఉంటుంది. ఆట జారుతూనే ఉంటుంది. పెనాల్టీలు, పరికరాలు పగిలిపోవడం, గుర్రానికి గాని ఆటగాళ్లకు గాని గాయం వంటి కారణాలకు మాత్రమే ఆట నిలపపడుతుంది. గోల్ స్థంబాల మధ్య బంతిని కొట్టడమే ఆట యొక్క లక్ష్యం. బంతి ఎంత ఎత్తులోనైనా పోవచ్చు. గోల్ కు చాలా దూరములో బంతి వెళ్తే, బంతి గోల్ లైన్ ను దాటినా స్థానమునుంచి ఒక ఫ్రీ 'నాక్-ఇన్' డిఫెండింగ్ జట్టుకు ఇవ్వబడుతుంది. ఈ విధంగా బంతి మరల ఆటలోకి వస్తుంది.

అరేనా పోలోసవరించు

అరేనా పోలో నియమాలలో US మరియు బ్రిటిష్ రకాల మధ్య చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. ఆటలో నాలుగు చుక్కా అని కూడా పిలవబడే కాలవ్యవదిలు ఉంటాయి (బ్రిటిష్ అరేనా నియమాల ప్రకారం ప్రస్తుతం ఆరున్నర నిమిషాలు చుక్కాలు ఆడబడుతున్నాయి). ఈ వ్యవదిలలో ఆటగాళ్ళు తమ గుర్రాలను మారుస్తారు. ఒకే గుర్రం రెండు సార్లు వరుసగా ఆడబడదు. ఆట నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. పెనాల్టీలు, పరికరాలు పగిలిపోవడం, గుర్రానికి గాని ఆటగాళ్లకు గాని గాయం వంటి కారణాలకు మాత్రమే ఆట నిలపపడుతుంది. అరేనా లోని ప్రతి వైపు గోల్ ద్వారాల మధ్య బంతిని కొట్టడమే ఆట లక్ష్యం. మైదాణం పోలో ఆటలలో మాదిరిగానే ప్రతి చుక్కా తరువాత గాని గోల్ తరువాత గాని జట్టులు తమ ఆడుతున్న వైపును మార్చుకుంటారు. సామాన్యంగా 5-6 అడుగులు ఎత్తు ఉండే ఎత్తైన చక్క సరిహద్దు గోడలు వాటి పైన వల ఉండడం వలన బంతి బయటకు వెళ్ళదు. ఒక వేల బంతి బయటకు వెళ్తే, అది డేడ్ బాల్ గా బావించబడి, ఆట మరల ప్రారంబమవుతుంది. (ప్రస్తుత బ్రిటిష్ అరేనా నియమాల ప్రకారం, బంతిని బయటకు కొట్టిన జట్టుకు ఎదురుగా ఫ్రీ హిట్ లు ఇవ్వబడుతాయి) అరేనా పోలోలో ఆటస్థలం పరిమాణం మైదాన పోలో కంటే తక్కువగా ఉండడంతో, గుర్రాలు వేగంగా పరిహేత్తలేవు. అయితే, ఆట నిరంతరాయంగా ఉంది, మొదటి నుండి చివరి వరకు మరింత వేగవంతంగా ఉంటుంది.

సమకాలపు క్రీడసవరించు

 
ఒలింపిక్ క్రీడల (1900) లో భాగంగా పోలో ఆట

పోలో ప్రస్తుతం 77 దేశాలలో ఉత్సాహవంతంగా ఆడబడుతుంది. ఒలింపిక్ క్రీడలలో పోలో 1900-1939 వరకు మాత్రమే చేర్చబడింది. 1998లో, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటి పోలోను ఒక క్రెడగా గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా పోలో ఆటను నిర్వహిస్తున్నది ఫెడరేషన్ అఫ్ ఇంటర్నేషనల్ పోలో. ఫెడరేషన్ అఫ్ ఇంటర్నేషనల్ పోలో, ప్రపంచ పోలో చేంపియన్షిప్ ను మూడు సంవత్సరాలకు ఒక సారి నిర్వహిస్తుంది.

అయితే, పోలో కొన్ని దేశాలలో మాత్రమే ఒక వృత్తిగా ఆటబడుతుంది. ఆ దేశాలలో కొన్ని అర్జంటినా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చిలి, డొమినికన్ రిపబ్లిక్, ఫ్రాన్స్, జర్మనీ, ఇరాన్, ఇండియా, మెక్సికో, పాకిస్తాన్, స్పెయిన్, స్విట్జేర్లాండ్, యునైటెడ్ కింగ్డం యునైటెడ్ స్టేట్స్.[19] జట్టుగా ఆడే ఆటలలో పోలోకు ఒక ప్రత్యేకత ఉంది. పాలోలో జట్టు యజమానులు ప్రముఖ ఆటగాళ్ళతో పాటు కలిసి ఆడుతారు.

U.S.లో పోలోను నిర్వహించే సంస్థ ది యునైటెడ్ స్టేట్స్ పోలో అసోసియేషన్ (USPA). విడిగా మహిళలు మాత్రం పాల్గొనే పోలో కేవలం U.S.లో మాత్రమే ఉంది. మహిళల పోలోను యునైటెడ్ స్టేట్స్ ఉమన్స్ పోలో ఫెడరేషన్ నడిపిస్తుంది.

ఈ ఆటను పెద్ద స్థాయిలో ఆడినప్పుడు చాలా ఖరీదుః అవుతుంది కనుక సాంప్రదాయంగా సామాజికంగాను, ఆర్థికంగాను అతి స్వల్ప మంది మాత్రమే ఆడే ఆట అనే పేరు ఈ ఆటకు నిలబడింది. పలు పోలో ఆటగాళ్ళు దీనిని ఆపాలని మరింత ఎక్కువ జనం ఈ ఆటలో పాల్గొనాలని అప్పుడే ఆట ప్రమాణాలు పెరగుతాయని బావిస్తున్నారు. అయితే మరికొంత ఆటగాళ్ళు ఈ ఆటను ఇలాగే, సామాజికంగా మరియు ఆర్థికంగా ఒక ప్రత్యేకమైన ఆటలాగానే ఉంచాలని కోరుతున్నారు. 1980ల నుంచి పోలో యొక్క జనాకర్షణ క్రమంగా పెరుగుతూ ఉంది.

పోలో ఆడాలని అనుకున్నవారికి అరేనా (లేదా ఇండోర్) పోలో అందుబాటులో ఉన్న ఆట. నియమాలు ఒకే మాదిరిగానే ఉంటాయి. ఈ ఆట 300 అడుగులు x 150 అడుగులు వైశాల్యం ఉన్న ఒక చుట్టూ మూయబడిన ఆటస్థలంలో ఆడబడుతుంది. ఇతర గుర్రాల ఆటల మాదిరిగానే ఆటస్థలం ఉంటుంది; కనీసం 150 అడుగులు x 75 అడుగులు ఉండాలి. యునైటెడ్ స్టేట్స్ లో పలు అరేనా క్లబ్ లు ఉన్నాయి. సాంటా బార్బారా పోలో & రాకెట్ క్లబ్ వంటి పలు ప్రముఖ పోలో క్లబ్లలు అరేనా పోలో ఉంది. అవుట్ డోర్ పోలోకు ఇండోర్ పోలోకు మధ్య ఉన్న ముఖ్య తేడాలు: వేగం (అవుట్ డోర్ పోలో ఎక్కువ వేగంగా ఉంటుంది), శారేరకం/గరుకుతనం (ఇండోర్/అరేనా ఎక్కువ శారీరకంగా ఉంటుంది), బంతి సైజు (ఇండోర్ బంతిలు పెద్దవి), గోల్ సైజు (అరేనా పోలోలో తొల చిన్నది) మరియు కొన్ని పెనాల్టీలు. యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడాలలో, కాలేజియేట్ పోలో అంటే అరేనా పోలో; UKలో కాలేజియేట్ పోలో అంటే రెండు.

ఆగ్నేయ ఆసియాసవరించు

 
SEA గేమ్స్ పోలో 2007లో ఇండోనేషియా, థాయ్లాండ్ తో తలపడుతుంది.

2007 ఆగ్నేయ ఆసియా క్రీడలలో పోలో ఆట చేర్చబడింది. ఇండోనేసియా, సింగపూర్, మలేషియా, తాయ్లాండ్, ఫిలిప్పైన్స్ దేశాలు ఈ పోటీలో పాల్గొన్నాయి. ఈ పోటీలో మలేషియా జట్టు బంగారు పతకం సాధిస్తే, సింగపూర్ వెండి పతకం మరియు తాయ్లాండ్ కాంస్య పథకం గెలుచుకున్నాయి.

ఆగ్నేయ ఆసియాలో ఇటీవల పోలో పై ఏర్పడిన ఆసక్తి మూలానా పట్టాయ, కోలా లంపూర్, జకార్తా వంటి నగరాలలో పోలో మీద ప్రాజాధారణ పెరిగింది. పటాయాలో మాత్రం, 3 పోలో క్లబ్బులు ఉత్సాహంగా పనిచేస్తున్నాయి, (పోలో ఎస్కేప్, సియాం పోలో పార్క్ మరియు తాయ్ పోలో అండ్ ఈక్వెస్ట్రియన్ క్లబ్. రాజుల పాలన లేని ఇండోనేషియాలో, (నుసంతారా పోలో క్లబ్) ఒక పోలో క్లబ్ ఉంది. ఆగ్నేశియ పోలో ఫెడరేషన్ ఏర్పాటయి తొలి సమావేశం 2008 మార్చిలో జరిగింది. దీంట్లో రాయల్ మలేషియన్ పోలో అసోసియేషన్, థాయిలాండ్ పోలో అసోసియేషన్, ఇండోనేషియన్ పోలో అసోసియేషన్, సింగపూర్ పోలో అసోసియేషన్, రాయల్ బ్రూనై పోలో అసోసియేషన్ మరియు ది ఫిలిప్పైన్స్ పోలో అసోసియేషన్ పాల్గొన్నాయి.[ఉల్లేఖన అవసరం] ఇటీవల కాలములో, "ఆస్ట్రేలియా నగరప్రాంతాలలో పార్కులలో" జనేక్ గజేకి మరియు రుకి బైల్లియు పోలో ఆటలు నిర్వహించారు. దీనికి కొందరు ధనవంతులు సహాయం చేసారు.[20]

కొత్తగా చైనీస్ ఈక్వెస్ట్రియన్ అసోసియేషన్ స్థాపించబడి, చైనాలో రెండు క్రొత్త క్లబ్బులు ఏర్పడ్డాయి: 2004లో జియా యాంగ్ ఏర్పాటు చేసిన బీజింగ్ సున్నీ టైం పోలో క్లబ్[21] మరియు 2005లో షాంగైలో స్థాపించబడ్డ నైన్ డ్రాగన్స్ హిల్ పోలో క్లబ్.[22]

ప్రసిద్ధ పోలో ఆటగాళ్ళుసవరించు

ఇటాలిక్స్లో చూపిన వారు పోలో కాకుండా ఇతరవాటిలో కూడా ప్రసిద్ధం

 • మేరియనో అగుర్
 • మికే అజ్జారో
 • పేటె బోస్టవిక
 • హెన్రీ బ్రెట్
 • అడాల్ఫో కంబియాసో
 • బార్టోలొం కాస్టగ్నొల
 • ప్రిన్స్ చార్లెస్
 • జాన్-పుల్ క్లార్కిన్
 • పుల్ క్లార్కిన్
 • డెన్నిస్ కొలెరిడ్జ్ బోల్స్
 • గబ్ర్యాల్ డోనోసో
 • నాచో ఫిక్వేరాస్
 • మార్టిన్ గారిక్
 • రాబర్ట్ ఎల్. గెరి, జు.
 • కార్లోస్ గ్రషిడా
 • ప్రిన్స్ హర్రి
 • టామీ హిట్చ్కాక్, జు.
 • టామీ లీ జోన్స్
 • వాల్టర్ జోన్స్
 • గొంజాలో పియరేస్
 • ఫకున్డో పియరేస్
 • రాబర్ట్ స్కేనే
 • పోర్ఫిరియో రుబిరోస
 • జోనాథన్ కర్త్బెర్ట్ రైట్
 • ల్యూక్ టాంలిన్సన్
 • హర్రి పిన్ విట్నీ
 • స్టీఫెన్ ఓ'బ్రియాన్
 • జార్జ్ పాట్టన్
 • కార్లోస్ మెండిట్గయ్

సంబంధిత క్రీడలుసవరించు

 • బుజ్కాషిలో గుర్రాల పై రెండు జట్టులు, ఒక చచ్చిపోయిన మేక మరియు కొన్ని నియమాలు. ఇది మధ్య ఆసియాలో ఆడబడుతుంది. దీంట్లో కొక్పర్ అనే ఒక రకం కూడా ఉంది.
 • కౌబాయ్ పోలోలో మామూలు పోలో లాగానే నియమాలు ఉంటాయి. కాని ఆటస్తాలము చిన్నదిగా ఉంటుంది. ఆటగాళ్ళు పశ్చిమ సేడిల్ లతో పోటీ పడతారు. రబ్బర్ తో చేసిన ఊదగలిగే ఒక మందు బంతితో ఆడుతారు.
 • హార్స్ బాల్ ఆటలో గుర్రం మీద కూర్చున్న ఆటగాళ్ళు బంతిని చేతిలో తీసుకొని ఒక ఎత్తైన వలలో విసరాలి. ఈ ఆట పోలో, రగ్బీ, బాస్కెట్ బాల్ ఆతల కలయిక.
 • పాటో అర్జంటినా లో శతాబ్దాలుగా ఆడబడింది. అయితే, ప్రస్తుతు పోలో కంటే చాలా బిన్నంగా ఉండేది. కర్రలు వుండవు. గడ్డి పై ఆడబడదు.
 • పోలోక్రోస్స్ అనే ఆట గుర్రాల పై ఆడబడుతున్న ఆట. ఇది పోలోకు లక్రోస్సే ల కలయిక.

సూచనలుసవరించు

 1. R. G. గోయల్, వీణ గోయల్, ఎన్సైక్లోపెడియా అఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ , ప్రచురణ - వికాస్ పబ్. హుసే, 1988, పేజి 318 నుంచి వ్యాసం: పెర్షియన్ పోలో. ఇది పుట్టింది ఆసియాలో. 2000 BC సమయములో ఈ ఆటను పెర్షియాలో రూపొందించినట్లు అధికారులు మాట.
 2. స్టీవ్ క్రైగ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అఫ్ ది ఎన్షియన్ట్స్ , ప్రచురణ - గ్రీన్వుడ్ పబ్లిషింగ్ గ్రూప్ 2002, ISBN 0-313-31600-7, పే. 157.
 3. "polo. (2007). In Encyclopædia Britannica. Retrieved April 26, 2007, from Encyclopaedia Britannica Online". Cite web requires |website= (help)
 4. 4.0 4.1 "Polo History". http://www.scottishpolo.com/history_game.html. 
 5. ఇస్ఫహాన్ లోని నాక్ష్-ఐ జహాన్ స్కొయర్ నిజానికి ఒక పోలో మైదానం. దీనిని 17వ శతాబ్దములో అబ్బాస్ I అనే రాజు నిర్మించారు.
 6. టూర్ ఈజిప్ట్.నెట్
 7. మాల్కం డి. విట్మన్, టెన్నిస్: ఆరిజిన్స్ అండ్ మిస్టరీస్ , కూరియర్ డొవెర్ పబ్లికేషన్స్, 2004, ISBN 0-486-43357-9, పే. 98.
 8. 8.0 8.1 స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అఫ్ ది 18థ్ అండ్ 19థ్ సెంచురీస్, రచన- రాబర్ట్ క్రేగో. పేజి 25. ప్రచురణ 1999. గ్రీన్వుడ్ ప్రెస్. స్పోర్ట్స్ & రిక్రియేషన్. 296 పేజీలు ISBN 0-262-08150-4
 9. "Polo History". http://www.indiapolo.com/Polopedia/History/history.html. 
 10. ది గిన్నాస్ బుక్ అఫ్ రికార్డ్స్. 1991 ఎడిషన్ (పేజి 288)
 11. 11.0 11.1 11.2 స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అఫ్ ది 18థ్ అండ్ 19థ్ సెంచురీస్, రచన- రాబర్ట్ క్రేగో. పేజీ 32 ప్రచురణ 1999. గ్రీన్వుడ్ ప్రెస్. స్పోర్ట్స్ & రిక్రియేషన్. 296 పేజీలు. ISBN 0-262-08150-4
 12. "History of Calcutta Polo Club". Calcutta Polo Club. Retrieved 2009-06-05. Cite web requires |website= (help)
 13. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అఫ్ ది 18థ్ అండ్ 19థ్ సెంచురీస్, రచన- రాబర్ట్ క్రేగో. పేజి 26 - 27. ప్రచురణ 1999. గ్రీన్వుడ్ ప్రెస్. స్పోర్ట్స్ & రిక్రియేషన్. 296 పేజీలు ISBN 0-262-08150-4
 14. FIP వరల్డ్ కప్ VIII - 2007
 15. 15.0 15.1 "Tourisamesouthasia.com". మూలం నుండి 2010-06-30 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-10-26. Cite web requires |website= (help)
 16. యుట్యూబ్.com
 17. .polo.co.uk Archived 2011-07-28 at the Wayback Machine.
 18. "యునైటెడ్ స్టేట్స్ పోలో అసోసియేషన్ రూల్ బుక్ 2009" (PDF). మూలం (PDF) నుండి 2011-07-21 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-10-26. Cite web requires |website= (help)
 19. "8o Campeonato Mundial de పోలో: México 2008". మూలం నుండి 2007-04-30 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-10-26. Cite web requires |website= (help)
 20. David, Ceri (2008-11-23). "Going Polo". Sunday Herald Sun. pp. Sunday magazine supplement (pp. 20–21).
 21. ది డైలీ టెలిగ్రాఫ్
 22. NDPpolo.com
 • పేనిన మేసిల్స్ మరియు మైకేల్ క్రోనన్ రచించిన పోలో . కాలిన్స్ పబ్లిషర్స్, సాన్ ఫ్రాన్సిస్కో, 1992. ISBN 0-912616-87-3.

బాహ్య లింకులుసవరించు

  Media related to పోలో at Wikimedia Commons

మూస:Team Sport

"https://te.wikipedia.org/w/index.php?title=పోలో&oldid=2824237" నుండి వెలికితీశారు