పోవై సరస్సు (ఆంగ్లం: Powai Lake) ముంబై, నగరంలో పోవై లోయలోని ఒక కృత్రిమమైన సరస్సు. ఒకప్పుడు ఇక్కడ పోవై గ్రామం ఉండేదని భావిస్తారు. భారతదేశంలోని ఉన్నత విద్యాసంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బొంబాయి ఈ సరస్సుకు తూర్పుతీరంలోనున్నది.[1] మరొక ప్రసిద్ధిచెందిన సంస్థ నేషనల్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ (NITIE) కూడా ఇక్కడికి సమీపంలోనే ఉన్నది. ఈ సరస్సు పరిసరప్రాంతాలలో చాలా నివాసప్రాంతాలు అభివృద్ధి చెంది గత కొద్దికాలంగా జనాభా పెరిగింది.

పోవై సరస్సు
Powai Lake
Powai Lake Summer.JPG
ప్రదేశంముంబై
అక్షాంశ,రేఖాంశాలు19°08′N 72°55′E / 19.13°N 72.91°E / 19.13; 72.91
పరీవాహక విస్తీర్ణం6.61 కి.మీ2 (71,100,000 sq ft)
ప్రవహించే దేశాలుభారతదేశం
గరిష్ట లోతు12 మీ. (39 అ.)
ఉపరితల ఎత్తు58.5 మీ. (191.93 అ.)
ప్రాంతాలుపోవై
Powai Lake is located downstream of the Vihar Lake on the Mithi River

ఈ సరస్సు బ్రిటిష్ కాలంలో తవ్వించినప్పుడు సుమారు 2.1 చదరపు కిలోమీటర్లు (520 ఎకరం) విస్తీర్ణం, 3 మీటర్లు (9.8 అ.) (చివరగా) నుండి 12 మీటర్లు (39 అ.) (మధ్యలో) లోతు కలిగివుండేది.[2]

ఒకప్పుడు బొంబాయి నగరానికి త్రాగునీటిని అందించే ఈ సరస్సు, క్రమేపీ కలుషితమై చివరికి ఒక పర్యాటక ప్రదేశంగా మిగిలింది.[3]

మూలాలుసవరించు

  1. "Powai lake". Mumbainet.com. Archived from the original on 2012-02-16. Retrieved 2012-08-30.
  2. "History Of Powai Lake". Members.tripod.com. Retrieved 2013-10-24.
  3. "Mumbai Hotels: Mumbai Tourist Attractions: Powai Lake". Bombay-mumbai-hotels.com. Archived from the original on 2012-02-10. Retrieved 2012-08-30.

బయటి లింకులుసవరించు