పోషకాలు
పోషకాలు లేదా పోషక పదార్థాలు అనేవి ఆహారంలోని భాగాలు, అవి జీవి మనుగడకు, పెరుగుదలకు ఉపయోగపడతాయి. పోషకాలు అనేవి రెండు రకాలు అవి స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు. పోషకాల యొక్క రెండు రకాలను పర్యావరణం నుంచి పొందవచ్చు. పోషకాలు తీసుకునే పద్ధతులు మొక్కలలో, జంతువులలో భిన్నంగా ఉంటాయి. మొక్కలు నేరుగా వాటి వేర్ల ద్వారా మట్టి నుండి, వాటి ఆకుల ద్వారా వాతావరణం నుండి పోషకాలను తీసుకుంటాయి.
స్థూల పోషకాలు
మార్చుజీవి మనుగడకు, పెరుగుదలకు ఎక్కువ మొత్తంలో అవసరమయ్యే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు వంటి పోషకాలను స్థూల పోషకాలు అంటారు.
సూక్ష్మ పోషకాలు
మార్చుజీవి మనుగడకు, పెరుగుదలకు తక్కువ మొత్తంలో అవసరమయ్యే విటమిన్లు, ఖనిజ లవణాలు వంటి పోషకాలను సూక్ష్మ పోషకాలు అంటారు.
ఆంగ్ల పదాల కొరకు
మార్చుపోషకాలు (Nutrients), స్థూల పోషకాలు (Macro Nutrients), సూక్ష్మ పోషకాలు (Micro Nutrients), పోషణ (Nutrition)
ఇవి కూడా చూడండి
మార్చు- పోషణ - పోషకాలను సేకరించడాన్ని లేదా తీసుకోవడాన్ని పోషణ అంటారు.