ప్రధాన మెనూను తెరువు

భారతీయ చట్టంలో, ప్రజా ప్రయోజనాన్ని రక్షించేందుకు ఉద్దేశించిన వ్యాజ్యాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యం లేదా ప్రజాహిత వ్యాజ్యం (public interest litigation (PIL)) అంటారు. నష్టపడిన పక్షం ద్వారా కాకుండా, న్యాయస్థానమే స్వయంగా విచారణ చేపట్టడం లేదా ఏదైనా ఇతర స్వకీయ పక్షం ఈ వ్యాజ్యాన్ని న్యాయస్థానంలో దాఖలు చేయడం జరుగుతుంది. సొంత హక్కు ఉల్లంఘించబడటంతో బాధించబడిన ఒక వ్యక్తి న్యాయస్థాన అధికార పరిధిలో విచారణ కోసం, వ్యక్తిగతంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. న్యాయవ్యవస్థ క్రియాశీలత ద్వారా న్యాయస్థానాలు ప్రజలకు ఇచ్చిన అధికారమే ప్రజా ప్రయోజన వ్యాజ్యం.

వ్యాజ్యంపై పోరాడేందుకు బాధితుడి వద్ద అవసరమైన వనరులు లేనప్పుడు లేదా అతను న్యాయస్థానానికి వెళ్లే స్వేచ్ఛను హరించినప్పుడు లేదా అన్యాయంగా అడ్డుకున్నప్పుడు ఇటువంటి వ్యాజ్యాలు దాఖలు చేయవచ్చు. అన్యాయం జరిగిన విషయం న్యాయస్థానం దృష్టికి వచ్చినట్లయితే, న్యాయస్థానమే స్వయంగా విచారణ చేపట్టడం లేదా ఎవరైనా ప్రజా ప్రయోజనాల కోసం కృషి చేసే వ్యక్తి ద్వారా దాఖలు చేయబడిన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించడం చేయవచ్చు.

ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి (PIL) మూలాలుసవరించు

1980వ దశకానికి ముందు, బాధిత పక్షం మాత్రమే న్యాయం కోసం న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వచ్చేది. అయితే, 1980వ దశకం మరియు దేశంలో అత్యవసర పరిస్థితి తరువాత, సుప్రీంకోర్టు ప్రజలకు చేరువకావాలని నిర్ణయించింది, ఇందుకోసం అత్యున్నత న్యాయస్థానం ఒక వినూత్న మార్గాన్ని పరిచయం చేసింది, దీనిలో భాగంగా ప్రజా ప్రయోజనం పణంగా పెట్టబడిన కేసుల్లో న్యాయపరమైన పరిష్కారాలను కోరుతూ ఒక వ్యక్తి లేదా ఒక పౌర సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను (PIL) స్వీకరించిన మొట్టమొదటి న్యాయమూర్తుల్లో న్యాయమూర్తి పి.ఎన్. భగవతి మరియు న్యాయమూర్తి వి. ఆర్. కృష్ణ అయ్యర్ ఉన్నారు.[1] ఇతర న్యాయపరమైన వ్యాజ్యం మాదిరిగా, ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేయడం పెద్ద కష్టమైన పనేమీ కాదు, న్యాయస్థానానికి పంపిన లేఖలు మరియు టెలిగ్రామ్‌లను కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలుగా స్వీకరించి, వాటిపై విచారణలు జరిపిన సందర్భాలు కూడా ఉన్నాయి.[2]

PILకు ఉదాహరణలుసవరించు

ఆగస్టు 31, 2006న కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్ యాక్ట్ 1995కు అనుగుణంగా మరియు రేపటిలోగా న్యాయస్థాన ఆదేశాలను అమలు చేస్తూ కార్యకలాపాలు సాగించాలని బాంబే హైకోర్టు అనేక మంది ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని బ్రాడ్‌కాస్టర్‌లకు ఆదేశాలు జారీ చేసింది.

న్యాయమూర్తులు ఆర్ఎం లోధా మరియు ఎస్ఏ బాబ్డేలతో కూడిన ఒక డివిజిన్ బ్రెంచ్ సెయింట్ జేవియర్స్ కళాశాలకు చెందిన ప్రొఫెసర్ ప్రతిభా నాథానీ చేత దాఖలు చేయబడిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది, సెన్సార్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) చేత ధ్రువీకరించబడిన చలనచిత్రాలను కేబుల్ ఛానళ్లు ప్రసారం చేస్తున్నాయని, ఇవి పిల్లలపై చెడు ప్రభావం చూపుతున్నాయని ఆమె ఈ వ్యాజ్యంలో ఫిర్యాదు చేశారు. అందువలన, ఇటువంటి చలనచిత్రాలు చూపించకుండా చేయాలని మరియు ఇప్పటికీ ఇటువంటి ప్రసారాలు చేస్తున్న ఛానళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.

న్యాయస్థానం ఆగస్టు 23న 'U' మరియు 'U/A' ధ్రువీకృత సినిమాలు మాత్రమే కేబుల్ ఆపరేటర్‌లు మరియు ఛానళ్లు ప్రదర్శించేందుకు అనుమతించింది.

అయితే, ఈ ఆదేశానికి ముందు, మల్టీ-సిస్టమ్ ఆపరేటర్‌లపై పోలీసులు చర్యలు తీసుకున్నారు, కొన్ని ఛానళ్లు ప్రసారం చేయడానికి వీలు లేకుండా చేసేందుకు వారి వద్ద డీకోడర్‌లను స్వాధీనపరుచుకున్నారు. పోలీసు అసిస్టెంట్ కమిషనర్ సంజయ్ అపరాంతి న్యాయస్థానంలో మాట్లాడుతూ కేబుల్ ఆపరేటర్‌లకు ఛానళ్లు కొత్త డీకోడర్‌లను అందిస్తే తమకు ఎటువంటి సమస్యలేదని చెప్పారు.

జీ టెలివిజన్ మరియు స్టార్ టెలివిజన్ నెట్‌వర్క్‌లు సూచించిన చట్టం మరియు కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటామని ప్రకటించాయి.

ప్రసారం చేయాలనుకుంటున్న చలనచిత్రాల జాబితాను పోలీసులకు సమర్పించాలని స్టార్ మూవీస్, స్టార్ వన్, స్టార్ గోల్డ్, HBO, జీ మూవీస్, AXN మరియు సోని మ్యాక్స్ అనే ఏడు ఛానళ్లకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

PIL ఫలితాలపై నిదర్శనపూర్వక అధ్యయనంసవరించు

హాన్స్ డెమ్‌బౌస్కీ యొక్క వివాదాస్పద అధ్యయనం, ప్రజా సంఘాలకు ప్రభుత్వ అధికారిక యంత్రాంగాలు సంజాయిషీ ఇవ్వాల్సిన కోణంలో PIL విజయవంతమైందని సూచించింది. అయితే ఈ సామాజిక శాస్త్రవేత్త ప్రాథమిక స్థాయిలో ఒక ప్రభావాన్ని గుర్తించారు, కోల్‌కతా పట్టణ పరిధిలో ప్రధాన పర్యావరణ సమస్యలకు సంబంధించిన PIL కేసులు సరైన పట్టణ ప్రణాళిక వంటి అంతర్లీన సమస్యలను పరిష్కరించలేకపోయాయని పేర్కొన్నారు. డెమ్‌బౌస్కీ యొక్క పుస్తకం "టాకింగ్ ది స్టేట్ ఆఫ్ కోర్ట్ - పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ అండ్ ది పబ్లిక్ స్పియర్ ఇన్ మెట్రోపాలిటన్ ఇండియా" మొదట 2001లో ఆక్స్‌ఫోర్డ్ యూనివర్శిటీ ప్రెస్ ద్వారా ప్రచురించబడింది. అయితే కలకత్తా హైకోర్టు, న్యాయస్థాన విచారణల యొక్క ధిక్కారంగా సూచించిన కారణంగా, ప్రచురణకర్త చేత ఈ పుస్తకం యొక్క పంపిణీ నిలిపివేయబడింది. న్యాయస్థానం తనకు అధికారికంగా ఎన్నడూ ఎటువంటి సమాచారాన్ని పంపలేదని పేర్కొన్న రచయిత ఈ పుస్తకాన్ని జర్మనీకి చెందిన NGO ఆసియా హౌస్‌తో ఆన్‌లైన్‌లో ప్రచురించారు: [1][3].

వీటిని కూడా చూడండిసవరించు

 • చట్ట ఆదేశం
 • మూల చట్టం ప్రకారం ఆదేశం
 • న్యాయ సాయం
 • భారతదేశ రాజ్యాంగం
 • రాజ్యాంగబద్ధమైన ఆర్థికశాస్త్రం
 • రాజ్యాంగ సిద్ధాంతం
 • భారతదేశం యొక్క ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాలు మరియు ప్రాథమిక విధులు
 • సామూహిక దావా (క్లాస్ యాక్షన్)
 • పౌర సంఘం

బాహ్య లింకులుసవరించు

సూచనలుసవరించు

 1. PIL ఎ బూన్ ఆర్ ఎ బేన్
 2. ఇంట్రడక్షన్ టు పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్
 3. Dembowski, Hans (2009). "Erratic justice?". Development and Cooperation. Frankfurt am Main: Societäts-Verlag. 36 (3): 122–123.