ఆహారం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది హిందూ సంప్రదాయం.దానాలలో శ్రేష్టమైనది అన్నాదానం.ఇవి ఆహారానికి ఉన్న ప్రాదాన్యాన్ని సూచిస్తున్నాయి.పుట్టుక నుండి మరణం వరకు ఆచరించే ప్రతి ఆచారంలోను భోజనానికి ప్రాదాన్యత ఉంది.సంతోష సమయాలలోనే కాక మరణం లాంటి విషాద సమయంలోను విచ్చేసిన బందు మిత్రులకు భోజనం అందించడం విద్యుక్తుదర్మాలలో ఒకటి.వివాహభోజనానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం పరిపాటి.అథిధి అభ్యాగతులకు
భోజనసదుపాయం చేయడం సంప్రదాయమే.పరిచయస్తులకు కాఫీ,టీ లనైనా అందిచడం సంప్రదాయమే.జబ్బున పడిన వారిని పలకరించడానికి వెళ్ళేటప్పుడూ,పసిపిల్లను చూడటనికి వెళ్ళేటప్పుడూ,బధి మిత్రులను చూడటానికి వేళ్ళే సమయాలలో పడ్లు మొదలైన ఆహారాన్ని తీసుకు వెళతారు.సత్రాలు కట్టి బాటసారులకు,దేవుని దర్శనానికి వచ్చే భక్తులకూ ఉచితబోజనాలను అందించడం సంప్రదాయమే.ఆహారాన్ని ప్రసాదంగా అందించడం కోవెల సాంప్రదాయాలలో ఒకటి.పశ్చిమ బెంగాల్‌లో బ్రాహ్మణులు చేపలు తింటారు. చేపలను వాళ్లు ''జలపుష్పాలు''గా పరిగణిస్తారు.ఇతర మాంసాహారం ముట్టుకోరు. కాశ్మీర్‌లో బ్రాహ్మణులు మరోరకం పాక్షిక మాంసాహారులు.చాలా చోట్ల శాకాహారులు కోడిగుడ్లను శాఖాహారంగా పరిగణించి స్వీకరించడం కనిపిస్తుంది.
 
=== పచనం చేసే విధానాలు ===
పచనం అంటే వండటం. కొన్ని ఆహారాలను అలాగే తీసుకున్నా చాలా వరకు ఆహారం బాక్టీరియా నూండి రక్షణ కోసం,
సులభంగా జీర్ణం కావడం కోసం, రుచి కోసం వండటం ద్వారా ఆహారంగా మారుస్తారు. కడిగి, ముక్కలుచేసి, ఇతర ఆహార పదార్ధాలను చేర్చి వేడిచేయడం, చల్లబరచడం, వేగించడం, నీటితో చేర్చి వండటం, ప్రెషర్ కుక్కర్ మరియు ఇతర సాదనాలతో ఆవిరిలో వండటం, నూనెలో దేవటం, కాల్చటం మొదలైన పద్దతులలో ఆహారాన్ని పచనం చేస్తారు. ఇవి కాక నిలవ చేయటం ఉదాహరణగా ఊరగాయలు, వడీయాలు, వొరుగులు మొదలైన పద్దతులలో ఆహారాన్ని తయారు చేస్తారు. పండ్లు, కూరగాయలు నుండి తీసిన రసాలు ద్రవాహారాలలో ఒకటి. చట్నీలు,పచ్చళ్ళు నూరి వేడిచేయకుండానే ఆహారంగా చేస్తారు. తరిగిన పండ్లు, కూరగాయ ముక్కలతో ఇతర పదార్ధాలను చేర్చిన సలాడ్స్ ఆహారమే. పులవ పెట్టడంద్వారా ఇడ్లీ, దోశలు, పెరుగు మొదలైనవి ఆహారంలో భాగమే.
 
=== ఆహారం ఉత్పత్తి ===
"https://te.wikipedia.org/wiki/ఆహారం" నుండి వెలికితీశారు