"కడియం శ్రీహరి" కూర్పుల మధ్య తేడాలు

+ వర్గం
(+ వర్గం)
'''కడియం శ్రీహరి''' [[వరంగల్ జిల్లా]]కు చెందిన రాజకీయ నాయకుడు. 3 సార్లు ఎమ్మెల్యేగా, తొమ్మిదిన్నర సంవత్సరాలు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన కడియం శ్రీహరి వరంగల్ జిల్లా పర్వతగిరిలో జన్మించారు. రసాయనశాస్త్రంలో ఎమ్మెస్సీ పట్టా పుచ్చుకొని ప్రారంభంలో కొంతకాలం జూనియర్ లెక్చరర్6గా పనిచేసి [[ఎన్టీ రామారావు]] సూచనపై రాజకీయాలలో ప్రవేశించి వరంగల్ పురపాలక సంఘం చైర్మెన్ పదవికి పోటీచేశారు. తొలి పోటీలో పరాజయం పొందిననూ ఆ తర్వాత 1994లో [[స్టేషన్ ఘనపూర్ శాసనసభ నియోజకవర్గం|స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 1999లో మరియు 2008 ఉప ఎన్నికలలో కూడా విజయం సాధించి మొత్తం 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడమే కాకుండా ఎన్టీరామారావు మరియు [[నారా చంద్రబాబు నాయుడు]] మంత్రివర్గాలలో తొమ్మిదిన్నర సంవత్సరాలపాటు వివిధ మంత్రిపదవులు నిర్వహించారు.
 
[[వర్గం:వరంగల్ జిల్లా రాజకీయ నాయకులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1002367" నుండి వెలికితీశారు