నాస్తికధూమము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
విశ్వనాథ సత్యనారాయణ నవలను 1958 సంవత్సరంలో రాశారు. ఈ నవల పురాణవైర గ్రంథమాల నవలామాలికలోనిది. విశ్వనాథ వారు ఆశువుగా చెపుతూండగా ఈ నవలను పాలావజ్ఝుల రామశాస్త్రి లిపిబద్ధం చేశారు. <ref>''నాస్తికధూమము'' నవలకు "ఒకమాట" శీర్షికన విశ్వనాథ పావనిశాస్త్రి నోట్</ref>
=== పురాణవైర గ్రంథమాల ===
[[పురాణవైర గ్రంథమాల]] శీర్షికన విశ్వనాథ సత్యనారాయణ రాసిన నవలల్లో '''నాస్తికధూమము''' రెండవది. భారతీయులకు చరిత్ర రచనా దృష్టి లేదని, పూర్వరాజుల పరంపర అడిగితే పుక్కిటి పురాణాలు చెప్తారని ఆంగ్లవిద్య ప్రారంభమయిన తరవాత భారత చరిత్రను రచన చేసిన పలువురు అభిప్రాయపడ్డారు. సుమారు వెయ్యేళ్ల క్రితమే, అల్ బీరూనీ (Abu al-Biruni) వంటి పండితుడే, “దురదృష్టవశాత్తు భారతీయులు చారిత్రక గతిక్రమాన్ని పట్టించుకోరు. వారి రాజుల వంశపరంపరలు నమోదు చేసుకోవడంలో వారికి ఒకరకమైన నిర్లక్ష్యభావం ఉంది. ఖచ్చితమైన సమాచారం కోసం నిలదీస్తే ఏం చెప్పాలో తెలియక కథలు కల్పించి చెప్తారు” అన్నాడు. ఇదేమాట, ఏ మార్పులు లేకుండా, వలసపాలన నాటి రచయితలు కూడా పదే పదే ఉటంకించడం మూలాన ఈనాటికీ ఒక సత్యంగా స్థిరపడిపోయింది.
 
== ఇతివృత్తం ==
"https://te.wikipedia.org/wiki/నాస్తికధూమము" నుండి వెలికితీశారు