హంపి నిర్మాణ సమూహాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 254:
 
===విఠలాలయం===
[[Image:View of dilapidated main mantapa at the Vitthala templetemplein DKHampi.jpg|250px|thumb|right|హంపీలోని [[విఠలాలయం]]]]
ఈ విఠలాలయం విజయనగర చారిత్రక కట్టడాలన్నింటి లోకి, శిల్ప కళ రీత్యా అత్యంత ప్రాధాన్యత సంతరించు కొన్నది. దాని ముందున్న పురావస్తు శాఖ వారి సూచిక ఫలకం లోని విషయం క్లుప్తంగా.................." ఈ ఆలయంలోని శిల్ప కళా రీతులు అత్యంత అద్భుతం. విఠల్ అనగా శ్రీకృష్ణుని రూపమే. ఆ కాలంలో ఇది అన్నింటి కన్న పెద్ద ఆలయం. దీనిని [[రెండవ దేవ రాయలు]] 1422-- 1446 సంవత్సరాల మధ్యలో కట్టించెను. ఆ తర్వాత [[శ్రీకృష్ణ దేవరాయలు]], ఇందులోని నూరు స్తంభాల మండపం, ఇరుప్రక్కల ప్రహరీకున్న ద్వారాలు దానిపై గోపురాలు కట్టించెను. ఆలయం లోని సభా మండపం లోని ఏకశిలా స్తంభాలు, అందులోని శిల్ప కళ అత్యంత అద్భతం. ప్రతి స్తంభానికి నాలుగు వైపులా నాలుగు ఉప స్తంభాలు చెక్కి ఉన్నాయి. వాటిని సుతారంగా మీటితే సప్త స్వరాలు పలుకుతాయి. ప్రవేశద్వారం ముందున్న [[ఏక శిలా రథం ]] దేవుని ఊరేగింపునకు ఉపయోగించిన రథానికి ప్రతి రూపం. ఇది విజయనగర శిల్ప కళా రీతులకు పరాకాష్ట. ఈ రథం లో గరుడుడు ఆశీనుడై ఉన్నాడు. తూర్పు ముఖ ద్వారానికి ఎదురుగా ఉన్న రాజ వీధి తొమ్మిది వందలా తొంబై ఐదు మీటర్లు పొడవు, నలబై మీటర్ల వెడల్పుతో చివరన " [[లోక పావని]]" [[పుష్కరిణి]] వరకు ఉన్నది." ఇది అందులోని విషయం.
ఆలయ ముఖ ద్వారం ముందు ఒక పెద్ద శిలా స్తంభం పడి ఉన్నది. అది ధ్వజ స్తంభం. 1856 వ సంవత్సరంలో [["జాన్ గోలింగ్స్"]] తీసిన ఫోటోలో ఈ స్తంభం నిలబడి ఉన్నది చూసి ఉంటారు. ఆలయం లోపలికి వెళ్లడానికి పది రూపాయలు టికెట్టు. ముఖ ద్వారం శిఖర పైభాగం కొంత శిధిల మైనది. ఆలయం లోనికి అడుగు పెట్టగానే కనుపించే దృశ్యం:....... ఎదురుగా ఏక శిలా రథం, దాని ముందు ఆలయ సభా మంటపం, లేదా నాట్య మండపం., కుడి ప్రక్కన పురందర దాసు భజన మండపం., ఎడం ప్రక్కన నూరు స్తంభాల మండపం. ఇది ప్రధమ దృశ్యం. లోనికి వెళ్లి వివరంగా చూస్తే...............