బి.నాగిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కడప జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 83:
===విజయా సంస్థలో ముఖ్యులు===
'''నటీనటులు:'''
విజయాసంస్థ ఏర్పడిన నాటి నుంచి 'ఉమా చండీ గౌరీ శంకరుల కథ' వరకు వారి ప్రతి సినిమాలోనూ హీరో రామారావే. ఆయనతో బాటు విజయావారి ఆస్థాన నటులుగా ఉన్నవాళ్ళు [[ఎస్వీరంగారావు[[, [[సూర్యకాంతం]], [[రేలంగి]], [[రమణారెడ్డి]] తదితరులు. వీరి నటనాప్రతిభ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ కాలంలో నటులు ఇతర సంస్థలు తీసే సినిమాల్లో హీరో వేషం వేయడం కంటే విజయావారి సినిమాల్లో ఎక్స్‌ట్రా వేషం వేయడమే మిన్నగా భావించేవారు. చాలా మంది నటులకు విజయావారి సినిమాల్లో నటించాలనే కోరిక మాయాబజార్ తో తీరింది. ఆ సినిమాలో నాటి చిత్రరంగంలోని నటులందరూ కనిపిస్తారు. అక్కినేని నాగేశ్వరరావుకు విజయావారి సినిమాల్లో నటించే అవకాశం మొదట మిస్సమ్మ సినిమాతో వచ్చింది. చిత్రరంగంలో అడుగుపెట్టడమే హీరోగా అడుగుపెట్టిన ఆయన ఆ సినిమాలో పూర్తిస్థాయి హాస్యపాత్ర పోషించాడు. మాయాబజార్ తర్వాత ఆయనకు గుండమ్మకథలో సహనాయకుడి పాత్ర వేసే అవకాశం వచ్చింది. అది ఆయనకు నూరవ సినిమా కూడా. అది గొప్ప అదృష్టంగా భావించిన ఆయన ఆ సినిమాకు పారితోషికం తీసుకోలేదు. కానీ నాగిరెడ్డి ఆయనకు ఇవ్వవలసిన మొత్తాన్ని ఒక విద్యాసంస్థకు విరాళంగా ఇచ్చేశాడు.
 
'''తెరవెనుక నిపుణులు:'''
"https://te.wikipedia.org/wiki/బి.నాగిరెడ్డి" నుండి వెలికితీశారు