"ఆకాశవాణి" కూర్పుల మధ్య తేడాలు

30 bytes added ,  6 సంవత్సరాల క్రితం
== కార్యక్రమాలు ==
ప్రారంభం నుండి ఇప్పటి వరకు అకాశవాణి హైదరాబాద్‌ కేంద్రం వారు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు అనేకం. శాస్త్రీయ, లలిత, జానపద, పాశ్చాత్య సంగీత కార్యక్రమాలు, ఉపన్యాసాలు, చర్చలు, గోష్టులు, పరిచయాలు, ఇంటర్వ్యూలు, వివిధ వర్గాల వారికి ప్రత్యేక కార్యక్రమాలు, గ్రామస్థులకు, స్త్రీలకు, పిల్లలకూ, విద్యార్థులకు, కార్మికులకు, యువతరానికి, కవులకూ, రచయితలకూ - అంతేకాకుండా నాటికలు, నాటకాలు, రూపకాలు, మీరుకోరిన సినిమా పాటలు, శబ్దచిత్రాలు, సినిమా నటీనటులు, దర్శకులు, నిర్మాతలు. సాంకేతికపుణుల ఇంటర్వ్యూలు, పరిచయాలు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి.
=== వార్తలు ===
=== లలిత సంగీతం ===
మొదట్లో గీతావళి పేరుతో భావగీతాలు తొలుత ప్రసారమైనా [[లలిత సంగీతం]] అన్న పేరు ప్రాచుర్యం పొందింది ఆకాశవాణితోనే. [[పాలగుమ్మి విశ్వనాథం]], [[బాలాంత్రపు రజనీకాంత రావు]] తదితర స్వరకర్తలు, [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]], [[దాశరధి కృష్ణమాచార్యులు|దాశరధి]] వంటి కవులు, [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]], [[ఎమ్మెస్ రామారావు]], [[చిత్తరంజన్]], వేదవతీ ప్రభాకర్ తదితర కళాకారులు లలిత గీతాలకు ఆదరణ కల్పించారు. ''అమ్మదొంగా నిన్ను చూడకుంటే'', ''ఆకులో ఆకునై'', ''సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'', ''నారాయణ నారాయణ అల్లా అల్లా'' తదితర గీతాలు ఆకాశవాణిలో ప్రసారమై తెలుగునాట బహుళ ప్రచారంలోకి వచ్చాయి. “శతపత్రసుందరి”, “మ్రోయింపు జయభేరి” (సూర్యకుమారి), “మనప్రేమ” (బాలమురళి, గోపాలరత్నం), “గుడారమెత్తివేశారు”, “ఎందు చూచినగాని” (ఘంటసాల) “ఎన్ని తీయని కలలు కన్నానో” (మల్లిక్‌), “నటన మాడవే మయూరి” (బాలసరస్వతి), “పోయిరావే కోయిలా”, “కోపమేల రాధ” (సాలూరి, బాలసరస్వతి), “జాబిల్లి వస్తున్నాడు” (వింజమూరి సోదరీమణులు), “ఓహో ప్రతిశ్రుతి” (రజని), “ఓ భ్రమరా” (టి.జి. కమలాదేవి) ” రొదసేయకే తుమ్మెదా” (వి. లక్ష్మి?) గేయాలు బాలాంత్రపు రాజనీకాంతరావు స్వరకల్పన చేయగా రేడియోలో ప్రసారమై ఆంధ్రదేశంలో మార్మోగాయి.<ref>[http://eemaata.com/em/issues/200101/616.html ''తెలుగు లలిత సంగీతంలో రజనీ గంధం'' శీర్షికన పరుచూరి శ్రీనివాస్ రాసిన వ్యాసం(ఈమాట పత్రిక:జనవరి 2001 సంచిక)]</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1010254" నుండి వెలికితీశారు