ఆకాశవాణి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
ఆకాశవాణి మద్రాసు కేంద్రం తెలుగులో తొలి ప్రసారాలు చేయగా 1948 అక్టోబర్ 12న తొలి తెలుగు రేడియో స్టేషన్ గా విజయవాడ కేంద్రం ప్రారంభమైంది. అదే సంవత్సరం డిసెంబర్ 1 నుంచి విజయవాడ కేంద్రం ప్రసారాలు ప్రారంభించింది. 1933లో హైదారాబాద్ చిరాగ్ అలీ వీధిలో మహబూబ్ అలీ 200వాట్ల శక్తిగల రేడియోకేంద్రం స్థాపించారు. దాన్ని 1935 ఫిబ్రవరి 3న నిజాం తన అదుపులోకి తీసుకున్నారు. ''దక్కన్ రేడియో''గా 7వ అసఫ్ జా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిజాము ఉర్దూ ప్రసారాలతో ప్రారంభించినా పరిమితంగా తెలుగు, కన్నడ, మరాఠీ కార్యక్రమాలుండేవని తొలి తెలుగు రేడియో కార్యక్రమాలను గురించి పరిశోధించిన విశ్రాంత ఆకాశవాణి ఉద్యోగి సుధామ పేర్కొన్నారు. స్టూడియో సరూర్ నగర్ నుంచి ఖైరతాబాద్ యావర్ మంజిల్ కు తరలింది. 1948 డిసెంబరు 1నాటికి 800వాట్ల శక్తితో షార్ట్ వేవ్, మీడియం వేవ్ లతో ఉన్న దక్కన్ రేడియోలో తెలుగు కార్యక్రమాలను పెంచేందుకు మాడపాటి హనుమంతరావు ప్రయత్నించి సఫలీకృతులయ్యారు. 1950లో దక్కన్ రేడియో కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆలిండియా రేడియో హైదారాబాద్ కేంద్రంగా మార్చింది. హైదారాబాద్, విజయవాడ కేంద్రాలు తెలుగులో విజ్ఞాన వినోదాలను మేళవించి రూపొందించిన వివిధ కార్యక్రమాలతో తెలుగు జనజీవితంలో భాగమయ్యాయి.
=== ఇతర తెలుగు ఆకాశవాణి కేంద్రాలు ===
{| class="wikitable"
|-
! ఆకాశవాణి కేంద్రం !! ప్రారంభ తేదీ
|-
| గడి పాఠ్యం || గడి పాఠ్యం
|-
| గడి పాఠ్యం || గడి పాఠ్యం
|-
| గడి పాఠ్యం || గడి పాఠ్యం
|-
| గడి పాఠ్యం || గడి పాఠ్యం
|-
| గడి పాఠ్యం || గడి పాఠ్యం
|-
| గడి పాఠ్యం || గడి పాఠ్యం
|-
| గడి పాఠ్యం || గడి పాఠ్యం
|-
| గడి పాఠ్యం || గడి పాఠ్యం
|-
| గడి పాఠ్యం || గడి పాఠ్యం
|-
| గడి పాఠ్యం || గడి పాఠ్యం
|-
| గడి పాఠ్యం || గడి పాఠ్యం
|}
 
=== ఇతర కేంద్రాల తెలుగు ప్రసారాలు ===
1955 నవంబరు 2న ప్రారంభమయిన బెంగళూరు, 1963 జూన్ లో మొదలైన పోర్ట్ బ్లెయిర్ కేంద్రాల్లోనూ తెలుగు ప్రసారాలు చేశారు. ఢిల్లీ నుంచి తెలుగు వార్తలు, శ్రీలంకలో తెలుగు ప్రసారాలు, వివిధాభారతి వాణిజ్య విభాగంలోనూ తెలుగు కార్యక్రమాలు జరిగాయి.
"https://te.wikipedia.org/wiki/ఆకాశవాణి" నుండి వెలికితీశారు