చిలకమర్తి లక్ష్మీనరసింహం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
 
==విద్య, బోధన==
[[File:Chilakamarthi laxminarasimham.jpg|thumb|రాజమండ్రి కోటిపల్లి బస్టాండు దగ్గరలో స్వాతంత్ర సమరయోధుల పార్కులో చిలకమర్తి లక్ష్మీనరసింహం]]
ఆయన ప్రాథమిక విద్య [[వీరవాసరం]], [[నరసాపురం]] పట్టణాలలో సాగింది. [[1889]] లో [[రాజమండ్రి]] హైస్కూలులో పట్టం చేత పట్టుకొన్నాడు. 1889 లో రాజమండ్రి '''ఆర్య పాఠశాల'''లో తెలుగు ఉపాధ్యాయునిగా చేరాడు. తరువాత ''ఇన్నీసు పేట'' స్కూలులోనూ, మునిసిపల్ హైస్కూలులోనూ విద్యాబోధన సాగించాడు. తరువాత ఒక సంవత్సరం ''సరస్వతి'' పత్రిక సంపాదకునిగా పనిచేశాడు. ఆపై ఉద్యోగం విరమించి 1899లో '''హిందూ లోయర్ సెకండరీ స్కూల్''' స్థాపించి 9 సంవత్సరాలు నడిపాడు. తరువాత ఈ పాఠశాల '''వీరేశలింగం హైస్కూల్''' గా మార్చబడింది.