దక్షిణ కొరియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 123:
యాసుకునీకి పలుమార్లు విజయం చేసాడు. గత అధ్యక్షుడైన రాహ్ మూ-హైన్ దక్షిణ కొరియా మరియు జపాన్ సమావేశాలన్నింటినీ రద్దు చేసాడు.
=== ఉత్తర కొరియా ===
ఉత్తర మరియు దక్షిణ కొరియాలు రెండు మొత్తం ద్వీపకల్పం మరియు పరిసర ద్వీపాలమీద అధికారికంగా సార్వభౌమాధికారం సాధించాయి. ఇరు దేశాలమధ్య రగులుకున్న విద్వేషాలు చివరకు 1950-1953 వరకు సాగిన కొరియన్ యుద్ధానికి దారితీసింది. తరువాత దక్షిణ కొరియా మరియు ఉత్తర కొరియాలు యుద్ధవిరమణ ఒప్పందం మీద సంతకం చేసాయి. 2072007 అక్టోబర్ 4న రోహ్ మూ-హుయన్ మరియు ఉత్తర కొరియన్ నాయకుడు జాంగ్-ఇల్ ఎనిమిది ముఖ్యాంశాలు కలిగిన శాశ్వత శాంతి ఒప్పందం, ఉన్నత స్థాయి చర్చలు, పరస్పర ఆర్ధిక సహకారం వాయు, రహదారి మార్గాల పునరుద్ధరణ మరియు సమైఖ్య ఒలింపిక్ చీరింగ్ స్క్వాడ్ రూపొందించడం మీద సంతకం చేసారు.
 
1993,1998, 2006 మరియు 2009 లలో ఉత్తర కొరియన్ ప్రభుత్వం చేసిన మిస్సైల్ పరిశోధన కారణంగా రాజీ ప్రయత్నాలు సందిగ్ధంలో పడ్డాయి. 2009లో దక్షిణ మరియు ఉత్తర కొరియాల మధ్య సంబంధాలలో ఘర్షణలు తలెత్తాయి. మిస్సైల్స్‌ను నిర్వీర్యం చేయమని ఉత్తర కొరియాను కోరారు. ఈ సంఘర్షణలు చివరికి మునుపటి ఒప్పందాలు ఉత్తరకొరియాను దక్షిణకొరియాతో చేసిన ఒప్పందాలకు ముగింపు పలికి తమ ఉపగ్రహ స్థాపనలో దక్షిణ కొరియా మరియు అమెరికాలు జోక్యం చేసుకోకుండా బెదిరించింది. . ఉత్తర కొరియా మరియు దక్షిణ కొరియా ఇప్పటికీ సాంకేతిక యుద్ధం కొనసాగిస్తున్నది. కొరియన్ యుద్ధం తరువాత ఇరు దేశాల మీద తిరిగి శాంతి ఒప్పందాలు జరగనే లేదు. ఇరుదేశాలు తమ మధ్య ఉన్న ప్రపంచంలో అత్యంత బలమైన సరిహద్దులలు సంరక్షిస్తూ ఉన్నాయి. 2009 మే 27న ఉత్తర కొరియా ప్రచార మాద్యమం ద్వారా ఇరుదేశాల మధ్య జరిగిన యుద్ధవిరమణ ఒప్పందానికి కాలం చెల్లినదని దేశరక్షణ కొరకు అణుఆధాల సేకరణ తప్పనిసరి అని ప్రకటించింది. 2010 మార్చి మాసంలో దక్షిణ కొరియా యుద్ధనౌక చియోనాన్ మునిగిపోవడం ఇరు దేశాల మధ్య ఘర్షణను మరింత క్లిష్టతరం చేసింది. ఈ సంఘటనకు కారణం ఉత్తరకొరియా అని ఖచ్చితంగా చెప్పింది ఉత్తర కొరియా దానిని నిరాకరించింది. 2010 మే మాసంలో దక్షిణ కొరియా ఆధ్యక్షుడు మియాంగ్-బ్యాక్ ఉత్తరకొరియాతో ఉన్న వాణిజ్య సంబంధాలను సియోల్ రద్దుచేస్తుందని ప్రకటించాడు. సమిష్ఠి కియోసాంగ్ పారిశ్రామిక ప్రణాళిక మరియు మానవీయ సహాయం విడిచి మిగిలిన ఆర్ధిక మరియు దౌత్య సంబంధాలు వెనుకకు తీసుకొనబడ్డాయి. ఉత్తర కొరియా కూడా ముందుగానే దక్షిణ కొరియాతో ముందున్న అన్ని ఒడంబడికలను రద్దుచేస్తామని అలాగే కియోసాంగ్ పారిశ్రామిక ప్రణాళికలో పని చేస్తున్న దక్షిణ కొరియన్లని తరిమివేస్తామన్న బెదిరింపులను వెనుకకు తీసుకుని దక్షిణ కొరియాతో ముందున్న ఒప్పందాలను కొనసాగించింది. అయినప్పటికీ ఇరుదేశాల నడుమ నెలకొన్న సైనిక చర్యల ఫలితంగా కియోసాంగ్ పారిశ్రామిక ప్రణాళిక భూభాగంలో పెట్టుబడులు మరియు శ్రామికశక్తి క్షీణిస్తూ వచ్చింది. ఇజ్రాయేలు దేశంలోలా దక్షిణ కొరియన్లు పొరుగు దేశాల దాడి నుండి రక్షించుకోవడానికి గ్యాసుమాస్కులను మాత్రం ఏర్పాటు చేసుకో లేదు.
పంక్తి 133:
* 2010 సెప్టెంబర్ 29న ఉత్తరకొరియా తండ్రిని అనుసరించి కుమారుడు అధికారం చేపట్టిన సంఘటనను ఘనంగా నిర్వహించింది.
* 2010 అక్టోబర్ ఇరుదేశాల మధ్య ఉన్న సరిహద్దుల వద్ద దక్షిణ కొరియా మరియు ఉత్తరకొరియాల మధ్య కాల్పులు జరిగాయి.
 
== సంయుక్త రాష్ట్రాలు ==
రెండవ ప్రపంచయుద్ధం తరువాత జపాన్ వలసరాజ్యం నుండి విడుదల కావడానికి దక్షిణకొరియాకు అమెరికా అలాగే ఉత్తర కొరియాకు సోవియట్ యూనియన్ ప్రోత్సాహమిచ్చాయి. మూడు సంవత్సరాల అమెరికా పాలన తరువాత దక్షిణకొరియా ప్రభుత్వస్థాపన జరిగింది. కొరియన్ యుద్ధం ఆరంభం కాగానే అమెరికన్ సైన్యాలు దక్షిణ కొరియాకు మద్దతుగా సైన్యాలను పంపింది. అమెరికా దక్షిణకొరియాకు ఉత్తర కొరియా దండెత్తిన సమయంలోనూ మరియు తరువాత చైనా దండయాత్రలోనూ సైన్యాల మద్దతు ఇచ్చింది. తరువాత అమెరికా దక్షిణ కొరియాలు పరస్పర సైనికమద్దతు ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం అనుసరించి యుద్ఫ్హవాతావరణం ఏర్పడితే రెండుదేశాలు ఒకటిగా స్పందించాలన్న నిబంధన చోటుచేసుకున్నది. ఈ ఒప్పందానికి కట్టుబడి 1967లో వియత్నాం యుద్ధసమయంలో అమెరికాకు మద్దతుగా దక్షిణకొరియా సైన్యం పంపింది. ది యు.ఎస్ ఎయిత్ ఆర్మీ, యు.ఎస్ ఎయిర్ ఫోర్స్ మరియు యు.ఎస్ నావల్ ట్రీటీ ఆఫ్ కొరియా దక్షిణ కొరియాలో నిలుపబడ్డాయి. ఉత్తరకొరియా పట్ల అనుసరిస్తున్న విధానాల విషయంలోనూ మరియు న్యూక్లియర్, రాకెట్ తయారీ పరిశ్రమల స్థాపన విషయంలోనూ ఇరు దేశాల విబేధాలు ఉన్నప్పటికీ రెండుదేశాల నడుమ ఆర్ధిక, దౌత్య మరియు సైనిక సంబంధాలు బలంగా ఉన్నాయి. గతంలో దేశంలో అమెరికన్ వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రస్థుతకాలంలో అది క్రమంగా తగ్గుతూ వస్తుంది. 2007 లో రిపబ్లిక్ కొరియా-యునైటెడ్ స్టేట్స్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పై ఇరుదేశాలు సంతకం చేసాయి. అయినప్పటికీ అది అమలుచేయడంలో తిరిగి తిరిగి జాప్యం జరిగింది. రెండు దేశాల చట్టసభలలో ఈ తీర్మానం అంగీకారం లభించకపోవడమే ఇందుకు కారణం. 2011 అక్టోబర్ 12 న అమెరికన్ చట్టసభలో ఈ ఒప్పందం అంగీకరించబడిన తరువాత మార్చ్ 15 నుండి ఈ వాణిజ్య ఒప్పందం అమలులోకి వచ్చింది.
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_కొరియా" నుండి వెలికితీశారు