కాళిదాసు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 87 interwiki links, now provided by Wikidata on d:q7011 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
 
కాళిదాసు విరచిత నాటకమగు [[మాళవికాగ్నిమిత్రము]]లో కథానాయకుడు రెండవ సుంగ రాజయిన అగ్నిమిత్రుడు. ఈ రాజు క్రీ.పూ.170వ సంవత్సరము పరిపాలన గావించుటచే, ఆ కాలము కాళిదాసు జీవించిన కాలమని ఒక వాదన.
ఒక సంస్కృతకవి. కాళికాదేవిని కొలిచి ఆదేవి యొక్క వరప్రసాదమును పొందినందున ఇతనికి ఈ పేరు కలిగెను. ఇతఁడు మిక్కిలి ప్రసిద్ధుఁడు. కవిసమయము చక్కగా తెలిసినవాఁడు. ఉపమానోపమేయములను పోల్చి చెప్పుటయందు మిక్కిలి సమర్ధుఁడు కాబట్టి ఇతఁడు చెప్పెడు ఉపమాలంకారము శ్లాఘింపఁ దగినదిగా ఉండును. కనుకనే "ఉపమా కాళిదాసస్య" అను వచనము లోకమునందు ప్రసిద్ధముగా వాడఁబడుచున్నది. మఱియు ఈమహాకవి విక్రమార్కుని ఆస్థానమునందలి కవులలో ఒకఁడై ఉండెను.
 
"శ్లో|| ధన్వంతరి క్షపణ కామరసింహశంకు, బేతాళభట్టిఘటఖర్ప కాళిదాసాః|, ఖ్యాతో వరాహమిహిరో నృపతేస్సభాయం, రత్నానివై వరరుచే ర్నవ విక్రమస్య|| " అను ఈ శ్లోకమునందు చెప్పఁబడిన చొప్పున ధన్వంతరి, క్షపణకుఁడు, అమరసింహుఁడు, శంకువు, బేతాళుఁడు, భట్టి, ఘటఖర్పరుఁడు, కాళిదాసుఁడు, వరాహమిహిరుఁడు అను కవులు తొమ్మండ్రును విక్రమార్కుని సభయందలి నవరత్నములు అని తెలియఁబడుచు ఉన్నది. శాకుంతలము, మాళవికాగ్నిమిత్రము, విక్రమోర్వశీయము అను నాటకములును, రఘువంశము, మేఘసందేశము, కుమారసంభవము అను కావ్యములును ఇతనిచే రచియింపఁ బడెను.
 
ఇదిగాక భోజప్రబంధమువలన భోజరాజు యొక్క సభలోను ఒక కాళిదాసుఁడు ఉన్నట్టు తెలియవచ్చుచు ఉన్నది. ఇతఁడు సకల విషయములందును మొదటియాతనిని పోలినవాఁడు. ఒకానొక కాలమున భోజుని సభయందలి కవులలో ఒకఁడు అగు దండి అనువానికిని ఇతనికిని వివాదము కలిగి అప్పుడు సరస్వతిని ఆరాధించి మాయిరువురిలో కవి ఎవఁడో తెలుపవలయును అని ప్రార్థింపఁగా వారికి సరస్వతి ప్రత్యక్షమై "కవిర్దండీ కవిర్దండీ నసంశయః" అనఁగా కాళిదాసునికి కోపము వచ్చి "రండే అహం కః" అనఁగా "త్వమేవాహం త్వమేవాహం త్వమేవాహం నసంశయః" అని సరస్వతి చెప్పినందున ఈ కాళిదాసుఁడు సరస్వతి అవతారము అని చెప్పుదురు. ఈయన నళోదయము, శృంగార తిలకము, ప్రశ్నోత్తరమాల, కవికంఠ పాశము, కర్పూరమంజరి, భోజచంపువు అనెడు గ్రంథములను, శ్యామలా దండకమును రచియించెను. ఇందు కడపట ఉదహరించిన దండకము తనకు కాళికాదేవి ప్రత్యక్షము అయినప్పుడు చెప్పినది. ఇంతటి కవులు లోకములో మఱియెవరును కారు. కనుకనే,
 
"పురా కవీనాం గణనాం ప్రసంగే, కనిష్ఠకాధిష్ఠితకాళిదాసా|, అద్యాపి తత్తుల్యకవే రభావా, దనామికా సార్థవతీ బభూవ|| " అని చెప్పఁబడి ఉన్నది. ఈతని విషయమై కట్టుకథలు అనేకములు ఉన్నవి. అయినను మీఁద ఉదహరించిన విషయములనుపట్టి కాళిదాసులు ఇరువురు అనియు వాస్తవము ఐన చరిత్రము ఇదియే అనియు ఊహింపవలసి ఉన్నది.
 
క్రీ.శ.634వ శతాబ్దము నాటి [http://en.wikipedia.org/wiki/Aihole అయిహోళీ] ప్రశస్తిలో కాళిదాసు యొక్క చర్చ ఉన్నది. ఇది కాళిదాసుదిగా చెప్పబడిన కాలములలో అతి దగ్గరది. అంతేగాక, మరి కొందరు కాళిదాసును [[విక్రమాదిత్యుడు|విక్రమాదిత్యుని]] ఆస్థానములో విద్వాంసునిగా చెప్పిరి.ఎక్కువ చరిత్రకారులు కాళిదాసుని గుప్త రాజులయిన చంద్రగుప్త విక్రమాదిత్యుడు మరియు అతని కొడుకు అయిన కుమార గుప్తుని కాలమయిన క్రీ.శ.4వ శతాబ్దము నాటి వానిగా పరిగణింతురు. రెండవ చంద్రగుప్తుడు విక్రమాదిత్యునిగా పేరునొంది, గుప్తుల స్వర్ణయుగములోని చివరి కాలములో రాజ్య పాలన చేసెను. అదే సమయములో గుర్తుంచుకోదగ్గ విషయమేమంటే, కాళిదాసు తన రచనలలో ఎక్కడా కూడ సుంగ వంశమును [[యాదవ కులములొ ఒక శాఖ]]తప్ప మరెవరి ప్రస్తావనా చేయలేదు. పురూరవుడు మరియు ఊర్వశిలు నాయికానయకులుగా కాళిదాసు రచించిన విక్రమోర్వశీయములో, పురూరవుని పేరును నాటకములో విక్రమునిగా మార్చిన విధానము, కాళిదాసుకు తన రాజయిన విక్రమాదిత్యుని మీద గల అభిమానముగా భావింతురు. అదే విధముగా [[కుమార సంభవము]] రచన కూడా కుమారగుప్తుని కథగానే రాసాడని మరికొందరి అభిప్రాయము. అలాగే, [[రఘువంశము]] నందు హూణుల ప్రస్తావన కూడా స్కందగుప్తుడు హూణులపై సాధించిన విజయము తాలూకు ఆనవాళ్ళని మరో అభిప్రాయము. అదే కావ్యమునందలి [[రఘువు|రఘు మహారాజు]] యొక్క జైత్రయాత్ర కూడా, చంద్రగుప్తుని తాలూకు జైత్రయాత్రా వర్ణనయే అని మరికొందరి అభిప్రాయము. కాళిదాసు మేఘసందేశమును ఈనాటి మహారాష్ట్ర లోని నాగపూర్ వద్ద గన రామ్టెక్ లేదా రామగిరి అన్న ప్రదేశములో రచన కావించాడని మరికొందరి అభిప్రాయము. రెండవ చంద్రగుప్తుని కుమార్తె అయిన ప్రభావతీగుప్తను ఇచ్చి వివాహము చేసిన వెంకట రాజు యొక్క రాజధాని రామగిరికి దగ్గరలోనె ఉండటము పైన చెప్పిన వానికి ఓ కారణము.
"https://te.wikipedia.org/wiki/కాళిదాసు" నుండి వెలికితీశారు