సత్య నాదెళ్ల: కూర్పుల మధ్య తేడాలు

/*మైక్రోసాఫ్ట్ ప్రస్థానము*
పంక్తి 1:
{{Infobox scientist
| name = సత్యసత్యనారాయణ నాదెళ్లచౌదరి నాదెళ్ల (Satya Nadella)
| image = Satya Nadella.jpg
| image_size = 250px
పంక్తి 17:
}}
}}
'''సత్యనారాయణ చౌదరి నాదెళ్ల ''' అలియాస్ '''సత్య నాదేళ్ల ''' ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన మైక్రోసాఫ్ట్ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు2014 ఫిబ్రవరి 4 న నియమితులయ్యారు.<ref>http://online.wsj.com/news/articles/SB10001424052702304851104579362603637152172</ref> సత్య నాదెళ్ల హైదరాబాద్‌కి చెందిన ఒక ప్రవాస భారతీయుడు. [[మైక్రోసాఫ్ట్]] కొత్త సీఈవోగా ఇతను నియమితులయ్యే అవకాశముందని వార్తలు రావడంతో ఇతని పేరు వెలుగులోకి వచ్చింది. 2014 ఫిబ్రవరి 4న మైక్రోసాఫ్ట్ సీఈవోగా నియమితులయ్యారు.<ref>http://www.microsoft.com/en-us/news/press/2014/feb14/02-04newspr.aspx</ref> అంతకుముందు ఆయన మైక్రోసాఫ్ట్‌లో క్లౌడ్ అండ్ ఎంటర్‌ప్రైజెస్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. మైక్రోసాఫ్ట్ ప్రస్తుత సీఈవో బామర్ 2015లోగా రిటైర్ కావాలనుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వారసుడి అన్వేషణ అనివార్యమైంది. 1976 నుండి సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, స్టీవ్ బాల్మేర్ తర్వాత మూడవ సిఇఓగా సత్య నాదెళ్ల బాధ్యతలు చేపట్టనున్నారుచేపట్టాడు. ఇటుంటి గొప్ప అవకాశం భారతీయులకు, అందులోనూ తెలుగువాళ్లకు లభించడం గర్వించదగిన విషయం. సీఈఓ ఎంపిక కోసం సంస్థ ఐదు నెలల పాటు కసరత్తు చేసి సత్యను ఎంపిక చేసింది. ఈ సంస్థ సీఈఓగా స్టీవ్ బామర్ సుదీర్ఘ కాలం పని చేశారు.
==నేపధ్యము==
వీరిది [[అనంతపురం జిల్లా]], [[ఎల్లనూరు|ఎల్లనూరు మండలం]], [[బుక్కాపురం (ఎల్లనూరు)|బుక్కాపురం]] గ్రామము.1967 లో సత్య నాదెళ్ల హైదరాబాద్ లో జన్మించారు. ఆయన తండ్రి బి.ఎన్.యుగంధర్ ఐఏఎస్ అధికారి. 2004-09 మధ్య కేంద్ర ప్రణాళిక సంఘంలో సభ్యుడిగా పనిచేశారు. సత్య నాదెళ్ల నగరంలోని బేగంపేట్ [[హైదరాబాద్ పబ్లిక్ స్కూల్]] లో చదువుకున్నారు. కర్ణాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ అభ్యసించారు. మంగళూరు విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చేశారు. అటుపైనా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, యూనివర్సిటీ ఆఫ్ షికాగో నుంచి ఎంబీయే చేశారు. అనంతరం సాఫ్ట్‌వేర్ రంగంలో పలు హోదాల్లో పనిచేశారు. అమెరికా పౌరసత్వం తీసుకుని అక్కడే స్థిరపడ్డారు.
పంక్తి 25:
==మైక్రోసాఫ్ట్ ప్రస్థానము==
క్రికెట్ అంటే ఇష్టపడే సత్య, 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరారు. రెండావ సీఈవో స్టీవ్ బామర్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. స్వతంత్ర డెరైక్టర్ జాన్ థాంప్సన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాడు. సంస్థ వ్యవస్థాపకుడు, మాజీ అధ్యక్షుడు [[బిల్ గేట్స్]] టెక్నాలజీ సలహాదారుడుగా వ్యవహరిస్తారు. సంస్థ ఉత్పత్తులు, టెక్నాలజీల రూపకల్పనకు దిశానిర్దేశం చేయడంపై దృష్టి పెడతారు. ఒకవైపు విండోస్, ఆఫీస్ వ్యాపార విభాగాలు క్షీణిస్తుండటం మరోవైపు.. డివైజ్‌లు, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కొంగొత్త రంగాల్లోకి మైక్రోసాఫ్ట్ విస్తరిస్తున్న తరుణంలో సత్య సీఈవోగా బాధ్యతలు చేపట్టాడు. 2014 నాటికి సంస్థ మార్కెట్ విలువ 31,400 కోట్ల డాలర్లు.
 
మైక్రోసాఫ్ట్ సంస్థ కొత్త మార్పులకు లోనవుతున్న తరుణంలో .. సంస్థను ముందుంచి నడిపేందుకు సత్యను మించి మరొకరు లేరంటూ బిల్ గేట్స్ కితాబిచ్చారు. అత్యుత్తమ ఇంజనీరింగ్ నైపుణ్యాలు, వ్యాపార దృక్పథం, అందర్నీ ఏకతాటిపైకి తేగలిగే సత్తా గల నాయకుడిగా సత్య తన సామర్థ్యాన్ని నిరంతరం నిరూపించుకుంటూనే ఉన్నారంటూ గేట్స్ ప్రశంసించారు. మరోవైపు, మైక్రోసాఫ్ట్‌కి సరైన సారథి సత్య అని స్టీవ్ బామర్ పేర్కొన్నారు. ఆయనతో 20 ఏళ్లకుపైగా కలసి పనిచేశానని, మైక్రోసాఫ్ట్‌కి సరైన సమయంలో సరైన నాయకుడు లభించారన్నారు.
 
సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజున ఉద్యోగులకు రాసిన ఈమెయిల్‌లో సత్య.. ‘అసాధ్యాలను సాధ్యం చేయగలమని నమ్మాలి.. అసంభవమన్న భ్రమలను తొలగించగలగాలి’ అంటూ ప్రసిద్ధ రచయిత [[ఆస్కార్ వైల్డ్]] చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు. సాఫ్ట్‌వేర్ శక్తిని పూర్తి స్థాయిలో వెలికి తీసుకురాగలగడంతో పాటు డివైజ్‌ల ద్వారా, సర్వీసుల ద్వారా ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థా సాధికారత సాధించగలిగేలా చూడగలగడం తమ వల్లే సాధ్యపడుతుందని సత్య పేర్కొన్నాడు. మైక్రోసాఫ్ట్ ముందు అపార అవకాశాలు ఉన్నాయని, వాటిని అంది పుచ్చుకునేందుకు మరింత వేగంగా స్పందించడంతో పాటు మరిం తగా కష్టపడాల్సి ఉంటుందని ఈ సందర్భంగా సత్య వ్యాఖ్యానించారు. టెక్నాలజీతో ప్రపంచాన్నే మార్చేసిన అరుదైన సంస్థలలో ఒకటైన మైక్రోసాఫ్ట్‌కి సీఈవో బాధ్యతలు చేపట్టడం తనకెంతో గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ పరిశ్రమలో సంప్రదాయానికన్నా.. నవకల్పనలకే పెద్దపీట దక్కుతుందని సత్య చెప్పారు.
==బయటి లంకెలు==
{{commonscat|Satya Nadella}}
"https://te.wikipedia.org/wiki/సత్య_నాదెళ్ల" నుండి వెలికితీశారు