సత్య నాదెళ్ల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
'''సత్యనారాయణ చౌదరి నాదెళ్ల ''' అలియాస్ '''సత్య నాదేళ్ల ''' ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన మైక్రోసాఫ్ట్ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా 2014 ఫిబ్రవరి 4 న నియమితులయ్యారు.<ref>http://online.wsj.com/news/articles/SB10001424052702304851104579362603637152172</ref> సత్య నాదెళ్ల హైదరాబాద్‌కి చెందిన ఒక ప్రవాస భారతీయుడు. [[మైక్రోసాఫ్ట్]] కొత్త సీఈవోగా ఇతను నియమితులయ్యే అవకాశముందని వార్తలు రావడంతో ఇతని పేరు వెలుగులోకి వచ్చింది. 2014 ఫిబ్రవరి 4న మైక్రోసాఫ్ట్ సీఈవోగా నియమితులయ్యారు.<ref>http://www.microsoft.com/en-us/news/press/2014/feb14/02-04newspr.aspx</ref> అంతకుముందు ఆయన మైక్రోసాఫ్ట్‌లో క్లౌడ్ అండ్ ఎంటర్‌ప్రైజెస్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. మైక్రోసాఫ్ట్ ప్రస్తుత సీఈవో బామర్ 2015లోగా రిటైర్ కావాలనుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వారసుడి అన్వేషణ అనివార్యమైంది. 1976 నుండి సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, స్టీవ్ బాల్మేర్ తర్వాత మూడవ సిఇఓగా సత్య నాదెళ్ల బాధ్యతలు చేపట్టాడు. ఇటుంటి గొప్ప అవకాశం భారతీయులకు, అందులోనూ తెలుగువాళ్లకు లభించడం గర్వించదగిన విషయం. సీఈఓ ఎంపిక కోసం సంస్థ ఐదు నెలల పాటు కసరత్తు చేసి సత్యను ఎంపిక చేసింది. ఈ సంస్థ సీఈఓగా స్టీవ్ బామర్ సుదీర్ఘ కాలం పని చేశారు.
==నేపధ్యము==
వీరిది [[gunturuఅనంతపురం జిల్లా]], [[ఎల్లనూరు|ఎల్లనూరు మండలం]], [[బుక్కాపురం (ఎల్లనూరు)|బుక్కాపురం]] గ్రామము.ఆయన తండ్రి బీఎన్ యుగంధర్ విశ్రాంత ఐఏఎస్ అధికారి. 2004 నుంచి 2009 వరకు ప్రణాళిక సంఘం సభ్యునిగా.. ప్రధానమంత్రి కార్యదర్శిగా పనిచేశారు. నాదెళ్ల యుగంధర్ నాయుడు ఐఏఎస్‌కు ఎంపికైన తర్వాత కుటుంబాన్ని హైదరాబాద్‌కు మార్చారు. 1967లో బీఎన్ యుగంధర్ దంపతులకు హైదరాబాద్‌లో సత్య నాదెళ్ల జన్మించారు. సత్య నాదెళ్ల నగరంలోని బేగంపేట్ [[హైదరాబాద్ పబ్లిక్ స్కూల్]] లో చదువుకున్నారు. కర్ణాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ అభ్యసించారు. మంగళూరు విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చేశారు. అటుపైనా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, యూనివర్సిటీ ఆఫ్ షికాగో నుంచి ఎంబీయే చేశారు. అనంతరం సాఫ్ట్‌వేర్ రంగంలో పలు హోదాల్లో పనిచేశారు. అమెరికా పౌరసత్వం తీసుకుని అక్కడే స్థిరపడ్డారు.
 
==వ్యక్తిగత జీవితము==
పంక్తి 33:
 
సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజున ఉద్యోగులకు రాసిన ఈమెయిల్‌లో సత్య.. ‘అసాధ్యాలను సాధ్యం చేయగలమని నమ్మాలి.. అసంభవమన్న భ్రమలను తొలగించగలగాలి’ అంటూ ప్రసిద్ధ రచయిత [[ఆస్కార్ వైల్డ్]] చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు. సాఫ్ట్‌వేర్ శక్తిని పూర్తి స్థాయిలో వెలికి తీసుకురాగలగడంతో పాటు డివైజ్‌ల ద్వారా, సర్వీసుల ద్వారా ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థా సాధికారత సాధించగలిగేలా చూడగలగడం తమ వల్లే సాధ్యపడుతుందని సత్య పేర్కొన్నాడు. మైక్రోసాఫ్ట్ ముందు అపార అవకాశాలు ఉన్నాయని, వాటిని అంది పుచ్చుకునేందుకు మరింత వేగంగా స్పందించడంతో పాటు మరిం తగా కష్టపడాల్సి ఉంటుందని ఈ సందర్భంగా సత్య వ్యాఖ్యానించారు. టెక్నాలజీతో ప్రపంచాన్నే మార్చేసిన అరుదైన సంస్థలలో ఒకటైన మైక్రోసాఫ్ట్‌కి సీఈవో బాధ్యతలు చేపట్టడం తనకెంతో గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ పరిశ్రమలో సంప్రదాయానికన్నా.. నవకల్పనలకే పెద్దపీట దక్కుతుందని సత్య చెప్పారు.
==జీతభత్యాలు==
మైక్రోసాఫ్ట్ సంస్థకు సీఈవోగా ఎంపికైన తెలుగు తేజం సత్య నాదెళ్ల ఏడాదికి జీతంగా 112 కోట్లు నిర్ణయించారు. బోనస్, స్టాక్ అవార్డులు, అన్నీ కలిపి ఈ మొత్తం ఆయనకు అందుతుంది. అయితే బేస్ శాలరీ రూపంలో మాత్రం ఆయనకు అందేది ఏడాదికి ఏడున్నర కోట్ల రూపాయలు మాత్రమే. మైక్రోసాఫ్ట్ లో 22 ఏళ్లుగా పనిచేస్తున్న సత్య నాదెళ్ల (46)కు 0-300 శాతం వరకు బోనస్ కూడా అందుతుంది. దీంతోపాటు ఈయనకు స్టాక్ అవార్డులు కూడా అందుతాయి. ఇవన్నీ కలిపితే ఆయనకు మొత్తం 112 కోట్ల రూపాయలు ఏడాదికి అందుతాయి.
 
ఆయన వార్షిక వేతనాన్ని కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఇన్సెంటివ్ ప్రోగ్రాం (ఈఐపీ) నిర్ణయిస్తుంది. 2015 ఆర్థిక సంవత్సరం నుంచి ఆయనకు వార్షిక ఈఐపీ స్టాక్ అవార్డు అందుతుందని నాదెళ్లకు మైక్రోసాఫ్ట్ నుంచి అందిన ఆఫర్ లెటర్ లో పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం మొత్తమ్మీద అందిన జీతానికి గరిష్ఠంగా మూడు రెట్లు.. అంటే 300 శాతాన్ని యాన్యువల్ క్యాష్ అవార్డుగా అందిస్తారు. అయితే, ఆయన పనితీరును బట్టి ఎంత శాతం ఇవ్వాలనే విషయాన్ని బోర్డు నిర్ణయిస్తుందని ఆఫర్ లెటర్లో తెలిపారు. ఈ లేఖ కాపీని అమెరికా మార్కెట్ నియంత్రణ సంస్థ ఎస్ఈసీకి కూడా పంపారు. బిల్ గేట్స్, స్టీవ్ బామర్ తర్వాత నాదెళ్ల సత్యనారాయణ చౌదరే ఈ దిగ్గజ సాఫ్ట్ వేర్ కంపెనీకి సీఈవో అయ్యారు. 2013 సంవత్సరం నాదెళ్లకు దాదాపు పది కోట్ల రూపాయలు క్యాష్ బోనస్ లభించింది.
 
==బయటి లంకెలు==
"https://te.wikipedia.org/wiki/సత్య_నాదెళ్ల" నుండి వెలికితీశారు