కొబ్బరి కుటుంబము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 87:
 
పోక చెట్టు చిరకాలము నుండియు తోటలలో పెంచు చున్నారు. అవి సముద్రమునకు రెండు వందల మైళ్ళ దూరములోను మూడు వేల అడుగుల ఎత్తు ప్రదేశములలోను పెరుగ జాలవు. వానికి నీరును వేడిమియు ఎక్కువగానే కావలెను. విత్తనముల కేబది యిరువది సంవత్సరముల చెట్ల కాయలు మంచివి. అట్టి వానినే తోటలలో నొక మడిలో పాతుదురు. ఒకటి రెండు సంవత్సరములైన పిదప చిన్న మొక్కలను దీసి ఆరేడడుగుల దూరమున నాటెదరు. పోక తోటలలోనె కొన్ని చోట్ల, అరటి, కొబ్బరి, పనస చెట్లను వేయు చున్నారు. మరి కొన్ని తావులందు బాడిద చెట్లను వేయుదురు. ఈ చెట్లు లేత పోక మొక్కల కెండ దెబ్బ దగుల నీయవు. అయిదారు సంవ
443
 
త్సరములు రాగాఏ కాయలు కాయుటకు ఆరంభించి, రమారమి ఆరువది సంవత్సరముల వకరు కాయును. ఒక చెట్టు సాధరణముగ రెండు గెలలు వేయును. కాని నేల సార వంతమైన యెడల మూడు నాలుగు గెలలు కూడ వేయును. ఒక చెట్టునకు సాధారణముగ 300 కాయలు దిగును. వర్షాకాలములో కాయలపై విస్తారము వాన కురిసినచో అవి కుళ్ళి పోవును గాన వాని పై పోక దొప్పలను కప్పు చుందురు. చెట్లెక్కి దొప్పల గట్టు వారు నిపుణులగుచో ఒక చెట్టు నుండి మరియొక చెట్టుంకు ఆకులను బట్టి కొనియే పోగలరు. కొన్ని కొన్ని తోట లందొకప్పుడు కాయలు పుచ్చు చుండును. పుచ్చునపుడు పువ్వుల మీదను కాయల మీదను నల్లని మచ్చలు బయలు దేరును. ఈ మచ్చలు వర్షము తగిలినచో ఎక్కువగును. కావున వర్షాకాలములో వానిపై దొప్పలను గప్పుట ఆవస్యకము. ఒకొక్కప్పుడు చెట్లకు చెద కూడ పట్టుట కలదు. విస్తారమెండలు కాయు చున్న దినములలో నీరునెక్కువగా పోయ కూడదు. పోసినచో చెట్టు తలలు విరిగి పడి పోవును. పోక తోటలందు చెమ్మ యారకుండుటయో కొంచెము మంచిది. పొగాకు, అల్లము, పసుపు తమలపాకు మొక్కలు చెమ్మ నారనీయవు గావున వానిని గూడ పోత తోటలందు వేయుట మంచిది.
"https://te.wikipedia.org/wiki/కొబ్బరి_కుటుంబము" నుండి వెలికితీశారు