కుంతీదేవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
కుంతి యాదవుల ఆడబిడ్డ. వసుదేవుని చెల్లెలు, శ్రీకృష్ణుని మేనత్త. ఆమె అసలు పేరు పృధ. కుంతిభోజుడనే రాజు సంతానము లేక, ఈమెను పెంచుకున్నాడు. అందుచేత ఈమె కుంతి అయింది.
== బాల్యం ==
పువ్వుపుట్టగానే పరిమలిస్తుంది. కుంతి చిన్ననాడే చాలా బుద్దిమంతురాలనిపించుకుంది.ఆమెను /br/చూస్తేఆమెనుచూస్తే పెద్దలకు ముద్దు వచ్చేది.ఆమె దైవభక్తి, గురుభక్తి, మెచుకోదగ్గవి.ఆ ఇంట్లో కుంతి అంటే ఎంతో అనురాగం వెల్లివిరిసేది. కుంతిభోజుడు క్రొత్తవాడు కాదు; తన తండ్రి మేనత్త కొడుకే. కనుక ఆమెకు చనువు కూడా కావలసినంత వుండేది. తమ ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే కుంతిభోజుడు కూతురుని పిలిచి ఆమె చేత వారికి పాదాభివందనం చేయించేవాడు, పరిచర్య చేయించేవాడు. ఆశీర్వదించమని అర్థించేవాడు. ఇలా కాలం గడుస్తూ వుంది. చంద్రరేఖ వలె కుంతీకన్య వర్థిల్లుతూ ఉంది.
 
=='''నీ ఓర్పుకిది గీటురాయి: ==''' ==
ఒక నాడు కుంతిభోజుడు సభలో కొలువై ఉన్నాడు. ఆకస్మికంగా దుర్వాసుడనే ఋషి అచటికి వచ్చెను. ఆయన రుద్రాంశ సంభూతుడు. ఆయనను చూస్తే అందరికీ భయమే, ఆయనకు కోపం ముక్కుమీదే ఉంటుంది. ఆయన శపిస్తే తిరుగు లేదు. అటువంటి చండప్రచండుడైన ఋషికి ఆతిద్యమివ్వాలి. సపర్య చేయాలి. ఆ భారం కుంతిపై పడింది. తండ్రి బిడ్డ శిరస్సు నిమిరుతూ "తల్లీ! నీ ఓర్పుకిది గీటురాయి" అన్నాడు. కుంతి ఆనందంతో, అరమోడ్పు కన్నులతో " నాన్నా! మహర్షులకు సేవ చేసే భాగ్యం అందరికీ కలసి వస్తుందా? దుర్వాసుని సేవ నా జీవితానికి వెలుగు త్రోవ" అంటూ నమస్కరించి దీవెనలు పొందింది.
 
== '''దుర్వాసుని మంత్రోపదేశం''' ==
దుర్వాసునడు కుంతిభోజుని ఇంట ఒక సంవత్సర కాలం పాటు ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళతాడో, ఏ వేళకు తిరిగి వస్తాడో ఎవరికీ తెలియదు. ఒక్కొక్క సారి ఫలానా ఆశ్రమానికి వెళుతున్నాను, రేపు సాయంత్రానికి తిరిగి వస్తాను అని చెప్పి వెళ్ళి, ఆ రోజు అర్ధ రాత్రికి తిరిగి వస్తాడు. వచ్చాడంటే, రానీలే, అక్కడ మంచినీళ్ళు ఉన్నాయి, చాప ఉంది, త్రాగి పడుకుంటాడులే అనుకుంటానికి వీలు లేదు. ఫలహారమేమైనా ఉందా? అంటాడు. పండ్లు గట్టిగా ఉంటే పచ్చివంటాడు, మెత్తగా ఉంటే కుళ్ళినవంటాడు, విసిరి మొగాన కొడతాడు. అటువంటి మహానుభావుడికి కుంతి పరిచర్య చేసింది. ఓర్పులో భూదేవి వంటిదనిపించుకుంది. మునీశ్వరుని మరసు కరిగింది. " బిడ్డా! నీ పరిచర్య నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. నీకు ఏమి కావాలయునో అడుగు యిస్తాను" అన్నాడు. కుంతికి ఏ కోరిక లేదు. అవ్యాజంగా సేవ చేసింది. " మహాత్మా! నాకు కావలసింది ఏముంది? మీరు ప్రసన్నులయ్యారు. అదే నాకు పదివేలు, నా తండ్రి సంతోషిస్తాడు" అని నమస్కరించింది. ముని ఇలా అన్నాడు" నీవు పసిదానవు. నీకు తెలియదు, అడగలేకున్నావు, నీకు ఒక మంత్రాన్ని యిస్తాను తీసుకో. నీవు ఏ దేవుడిని పిలిస్తే ఆ దేవుడు నీ దగ్గరకు వస్తాడు, నీకు వరాన్ని ప్రసాదిస్తాడు". కుంతి మారాడకుండా మహా ప్రసాదమని మంత్రమును స్వీకరించింది. కుంతికి మంత్రోపదేశము చేసి, కుంతీభోజుని ఆశీర్వదించి దుర్వాసుడు తన దానిన తాను వెళ్ళిపోయాడు.
"https://te.wikipedia.org/wiki/కుంతీదేవి" నుండి వెలికితీశారు