కుంతీదేవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
కుంతీభాస్వంతుల సమాగమ ఫలము కర్ణుడు. శిశువు కలిగాడు, వాని చెవులకు పుట్టుకతోనే రత్న కుండలాలున్నాయి, శరీరమంతా వజ్ర కవచమయము, రెండవ సూర్యుని లాగా ఉన్నాడు. కుంతికి కళ్ళు తిరిగాయి. మతి పోయింది. ఇటువంటి బిడ్డ లోకంలో ఎవరికైన జన్మిస్తాడా? నాకు జన్మించాడు. ఇది భాగ్యమనుకోవలెనా? పెండ్లి కాని కన్యను నేను, వీడు నా కొడుకని చెప్పుకోలేను. ఏమి చేయాలి? అని లోలోపల కుమిలిపోయింది. లోకోపవాదం భయం ఆమెను దావాగ్నిలా చుట్టు ముట్టింది. ఆమె మనసులోఒక ఊహ మెరిసింది. వెంటనే ఒక పెట్టెలో బాలుని భద్రపరచి, అందులో కొంత ధనము కూడా ఉంచింది. తీసుకుపోయి, ఆ పెట్టెను అశ్వనది ప్రవాహములో వదిలింది. తానేమీ చేస్తున్నదో తనకే తెలియలేదు, పెట్టె వంక చూస్తూ నిలబడింది.
== కుంతి ఆవేదన ==
జల తరంగాల మీద తేలుతూ, పెట్టె కనుచూపు మేర దాటి పయనిస్తుంది. మబ్బు కొంత విచ్చిపోయింది. కుంతి దిక్కులు చూసింది. ఎవరూ లేరు. బావరమని ఏడ్చింది. కడుపులోని దుఃఖమంతా వెళ్ళబోసుకుంది. నా చిన్ని తండ్రీ! మునీశ్వరుడు నాకెందుకు మంత్రమిచ్చాడు? నేనెందుకు తెలివిమాలి అరవిందసఖుని ఆహ్వానించాను. అతడు వచ్చి వద్దంటే సుతునెందుకు ప్రసాదించాడు? అబ్బా! సుతుడంటే సామాన్య సుతుడా? సహజ కర్ణ కుండలాల భూషితుడు. వజ్ర కవచ శోభితుడు. అలాంటి నా కన్నకొడుకు నాకు దక్కలేదు. అయ్యో! చేతులారా నదిలో త్రోశాను. నా బంగారు కొండ ఏ ఊరికి వెళుతున్నావు. ఏ తల్లి ఒడిలో చేరుతావు. నిన్ని ముద్దాడి పోషించే అదృష్టం ఏ సతికి సమకూరుతింది. ఎక్కడున్నా నీవు కనిపిస్తావులే. తళతళలాడే చెవిపోగులు, మిలమిల లాడే మైమరపు అందాలు చిందే ఆకారము నీవెక్కడున్నా చేయెత్తి చూపిస్తాయి. నీ అభ్యుదయం చూసి తల్లిగా సంతోషిస్తాను. నా నోము ఫలమింతే, అని వెను తిరిగి అంతఃపురికి వెళ్ళింది.
జల తరంగాల మీద తేలుతూ, పెట్టె కనుచూపు మేర దాటి పయనిస్తుంది.
== విధి విలాసం ==
ఆ పెట్టె అశ్వనదిలోనించి చర్మణ్వరిలోకి, చర్మణ్వతిలోనుండి యమునలోకి, యమునలోనుండి గంగలోకి అంచెలంచెలుగా ప్రయాణించింది. అలల్లో ఊయల ఊగుతూ, సూత దేశములోని చంపా పుర ప్రాంతములో పోతూ వుంది. దృతరాష్ట్రుని సఖుడైన అతిరధుడనే సూతుడు భార్య సమేతంగ జల క్రీడలాడుచూ, పెట్టెను చూశాడు. అతని భార్య రాధ పెట్టెను తెరిచింది. మణికనక కాంతులతో ప్రకాశించే శిశువును ఇద్దరూ చూశారు, మనకు బిడ్డలు లేరు కనుక భగవంతుడు ఈ బిడ్డను యిచ్చాడు అని యదకు హత్తుకున్నారు. విధి విలాసమేమో! కుంతి కన్న కొడుకు రాధేయుడయ్యాడు.
ఆ పెట్టె అశ్వనదిలోనించి
ఇది దేవత వర ప్రసాద కధ, లోకానికి తెలియదు.
 
==ఉల్లేఖనలు==
"https://te.wikipedia.org/wiki/కుంతీదేవి" నుండి వెలికితీశారు